
వీరూ.. విశ్వరూపం
పాకిస్థాన్ పర్యటనలో భాగంగా 2004లో ముల్తాన్ టెస్ట్ లో సెహ్వాగ్ ఈ ఘనతను కైవసం చేసుకున్నాడు. మొత్తం 531 నిమిషాలు క్రీజ్‌లో ఉన్న వీరూ.. 375 బంతులెదుర్కుని 309 పరుగులు సాధించాడు. అందులో 39 ఫోర్‌లు, 6 సిక్సర్లు ఉన్నాయి. షోయబ్ అక్తర్, సక్లైన్ ముస్తాక్, సమీ, రజాక్ వేసిన బంతులను చితకబాదుతూ.. మైదానంలో వీరూ విశ్వరూపం చూపించాడు. ట్రిపుల్ సెంచరీని సిక్సర్‌తో సాధించడం ఈ ఇన్నింగ్స్‌కే హైలైట్. ఫలితంగా అప్పటి వరకు వీవీఎస్ లక్ష్మణ్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల (281) రికార్డు బద్దలయింది.

ఇన్నింగ్స్ తేడాతో గెలుపు..
ఇక 82.40 స్ట్రైక్‌రేట్‌తో అత్యంత వేగంగా త్రిశతకం సాధించిన బ్యాట్స్‌మన్‌గా సెహ్వాగ్ గుర్తింపు పొందాడు. ఈ డాషింగ్ ఓపెనర్ మెరుపు బ్యాటింగ్‌తో భారత్ రెండురోజుల్లోనే 650 పరుగులు చేసింది. మిగతా రెండురోజుల్లో పాక్‌ను రెండు సార్లు ఆలౌట్ చేసి ఇన్నింగ్స్ తేడాతో భారత్ అద్భుత విజయాన్నందుకుంది.

సచిన్-ద్రవిడ్ వివాదం..
ఈ మ్యాచ్ అత్యంత దుమారానికి కూడా వేదికైంది. సెహ్వాగ్‌తో పాటు మరో ఓపెనర్ సచిన్ టెండూల్కర్ కూడా అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. అయితే సచిన్ (194 ) డబుల్ సెంచరీకి దగ్గర్లో ఉండగా అప్పటి కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ మ్యాచ్‌ను డిక్లెర్ చేశాడు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది.
సచిన్.. తన కన్న ముందు 5 డబుల్ సెంచరీలు చేస్తాడన్న అక్కసుతోనే ద్రవిడ్ డిక్లర్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. కానీ మ్యాచ్ గెలవడం కోసమే అలా చేశానని, సచిన్‌కు ముందే చెప్పానని ద్రవిడ్ వివరణ ఇచ్చాడు. ఇదే విషయాన్ని సచిన్ తన బయోగ్రఫీ ప్లేయింగ్ ఇట్ మై వే లో ప్రస్తావించాడు. ఈ వ్యవహారంలో ద్రవిడ్ తప్పులేదని, ముందే తనకు సూచించాడని స్పష్టం చేశాడు. అయితే ద్రవిడ్ కెరీర్‌లో మాత్రం ఈ వ్యవహారం ఓ మాయని మచ్చగా ఉండిపోయింది.
ఇల్లు క్లీనింగ్ అంత ఈజీ కాదు బ్రో : రోహిత్

గుర్తు చేసుకుంటున్న అభిమానులు..
ఈ అరుదైన ట్రిపుల్ సెంచరీని వీరూ అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకుంటున్నారు. ముల్తాన్ సుల్తాన్ సెహ్వాగ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ తర్వాత నాలుగేళ్లకు మళ్లీ ఇదే రోజు (2008 మార్చి 29) చెన్నైలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్‌లో సెహ్వాగ్ 319 పరుగులతో రెండో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. దీంతొ సెహ్వాగ్‌కు మార్చి 29తో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది.
సెహ్వాగ్ తర్వాత భారత్ తరపున యువ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. 2016లో నాయర్ ఇంగ్లండ్‌పై చెన్నైలో జరిగిన టెస్టులో 303 పరుగులతో ఈ ఘనతను అందుకున్నాడు. అప్పటి నుంచి భారత ఆటగాళ్లలో మరెవరూ ట్రిపుల్ సెంచరీ సాధించలేదు.


Click it and Unblock the Notifications












