Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్ X పాక్ మ్యాచ్‌ల కోసం ఐసీసీ కీలక నిర్ణయం!

అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ పాకిస్థాన్ మ్యాచ్‌లకు ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాయాదుల పోరుపై యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తి చూపిస్తోంది. ఇరు దేశాల్లో ఉండే క్రేజ్ అంత ఇంత కాదు. భారత్ పాక్ మ్యాచ్ అంటే ఇరు దేశాల అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు.

IND vs ENG: బూమ్ బూమ్ బుమ్రా.. 969 రోజుల తర్వాత రికార్డుల మోత!

IND vs ENG: బూమ్ బూమ్ బుమ్రా.. 969 రోజుల తర్వాత రికార్డుల మోత!

ఐసీసీకి కూడా దాయాదుల పోరుతో భారీ ఆదాయం చేకూరుతోంది. అయితే ఈ క్రేజ్‌ను మరింత సొమ్ము చేసుకునే ఉద్దేశంతో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐసీసీ వన్డే, టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో భారత్, పాక్ మ్యాచ్‌లు మరిన్ని జరిగేలా టోర్నీల నిబంధనలను మార్చాలని ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి.

ICC Plans World Cup Format Change to Increase India vs Pakistan Clashes Reports

భారత్ పాక్ మ్యాచ్‌ల కోసం..

ప్రపంచ క్రికెట్‌లో‌నే భారత్, పాకిస్థాన్ పోరు అత్యంత లాభదాయకమైనది. దాంతోనే మెగా టోర్నీల్లో భారత్, పాక్ జట్లు ఎక్కువ సార్లు తలపడేలా నిబంధనలు మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సూపర్ 8 రౌండ్ ఫార్మాట్‌లో టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 10 రౌండ్‌ను ప్రవేశపెట్టే అవకాశాలను ఐసీసీ పరిశీలిస్తోంది. తద్వారా రెండో రౌండ్‌లోనూ భారత్, పాకిస్థాన్‌లు ఒకే గ్రూప్‌లు ఆడవచ్చు.

అంతేకాకుండా సౌతాఫ్రికా వేదికగా జరిగే 2027 వన్డే ప్రపంచకప్ బరిలోకి దిగే జట్ల సంఖ్యను 14 నుంచి 12 తగ్గించి సూపర్ 7 రౌండ్ ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. సూపర్ 7 రౌండ్ కారణంగా నాకౌట్స్‌కు ముందే భారత్, పాక్ రెండేసి సార్లు తలపడే అవకాశం ఉంటుంది.

IND vs ENG: నిరాశపర్చిన కోహ్లీ, రోహిత్.. ఇలానే ఆడితే ఇంటికే!

IND vs ENG: నిరాశపర్చిన కోహ్లీ, రోహిత్.. ఇలానే ఆడితే ఇంటికే!

డబ్ల్యూటీసీలోనూ మార్పులు..

టెస్ట్ క్రికెట్‌కు మరింత ఆదరణ పెంచేందుకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కొత్త మార్పులను ప్రవేశపెట్టాలని ఐసీసీ యోచిస్తున్నట్లు సమాచారం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు సెమీఫైనల్స్ ప్రవేశ పెట్టాలా వద్దే అనే విషయంపై కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

ప్రస్తుత ఫార్మాట్ ప్రకారం డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో టాప్ 2లో నిలిచిన జట్లు నేరుగా ఫైనల్ ఆడుతున్నాయి. అయితే సెమీఫైనల్స్ ప్రవేశపెడితే ఇతర జట్లకు కూడా ఫైనల్ చేరే అవకాశం లభించనుంది. అఫ్గానిస్థాన్, ఐర్లాండ్, జింబాబ్వే జట్లను చేర్చి తదుపరి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షి‌ప్‌ను 12 జట్లకు విస్తరించాలని కూడా ఐసీసీ యోచిస్తోంది.

Story first published: Wednesday, July 15, 2026, 12:04 [IST]
Other articles published on Jul 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+