IND vs ENG: నిరాశపర్చిన కోహ్లీ, రోహిత్.. ఇలానే ఆడితే ఇంటికే!
టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తీవ్రంగా నిరాశపర్చారు. ఇంగ్లండ్ పర్యటనలో భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఈ ఇద్దరూ అనూహ్యంగా పెవిలియన్ చేరారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో మంగళవారం జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ 11 పరుగులే చేసి సామ్ కరణ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరగ్గా.. కోహ్లీ 5 పరుగులకే ఔటయ్యాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.
ఇబ్బంది పడ్డ రోహిత్..
అఫ్గానిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్ పర్వాలేదనిపించిన రోహిత్ శర్మ.. ఆ జోరును కొనసాగించలేకపోయాడు. స్వింగ్ కండిషన్స్‌కు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. 21 బంతులు ఎదుర్కొన్నా క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. మరోవైపు కోహ్లీ 6 బంతుల్లో ఓ బౌండరీ బాది జోరు కనబర్చాడు. కానీ జోఫ్రా ఆర్చర్ వ్యూహాత్మక డెలివరీని అంచనా వేయలేక వికెట్ల ముందు దొరికిపోయాడు.

రివ్యూ కూడా తీసుకోకుండా పెవిలియన్ బాట పట్టాడు. ఐపీఎల్ తర్వాత గాయంతో అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్న కోహ్లీ.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఈ ఇద్దరి వైఫల్యంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ ఇద్దరి వైఫల్యం కారణంగా 259 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 48 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.
ఇలానే ఆడితే ఇంటికే..
2027 వన్డే ప్రపంచకప్ ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న రోహిత్, కోహ్లీలు ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్‌లో విఫలమైన నేపథ్యంలో వారిపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. జూలై 16న(గురువారం) కార్డిఫ్ వేదికగా జరిగే రెండో వన్డేలో ఈ ఇద్దరూ మెరుగైన ప్రదర్శన చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇంగ్లండ్ గడ్డపై విరాట్ కోహ్లీకి మెరుగైన రికార్డ్ ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు 34 వన్డేలు ఆడిన కోహ్లీ 50.14 సగుటుతో 1354 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
అంతేకాకుండా ఈ ఏడాది కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడి 61.25 సగటుతో 245 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ ఉంది. అయితే 2022 ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లీ రెండు వన్డేల్లో 33 పరుగులే చేశాడు. మరోవైపు రోహిత్ శర్మకు జైస్వాల్ రూపంలో పోటీ నెలకొంది. తదుపరి రెండు మ్యాచ్‌ల్లో రోహిత్ రాణించకపోతే.. అతని స్థానాన్ని జైస్వాల్ భర్తీ చేసే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

