మరోసారి బ్యాటింగ్ వైఫల్యంతోనే ఓటమిపాలయ్యామని అఫ్గానిస్థాన్ కెప్టెన్ ఇబ్రహీమ్ జడ్రాన్ అన్నాడు. బ్యాటింగ్‌లో దక్కిన శుభారంభాన్ని భారీ స్కోర్‌గా మలచలేకపోయామని తెలిపాడు. భారత్‌తో ఆదివారం జరిగిన రెండో టీ20లో అఫ్గాన్ 6 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. ఈ పరాజయంతో మూడు టీ20ల సిరీస్‌ను 0-2తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కోల్పోయింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ఇబ్రహీమ్ జడ్రాన్.. మరో 20-30 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. 'మేం విధించిన లక్ష్యం సరిపోలేదు. బ్యాటింగ్‌లో మాకు మంచి ఆరంభమే లభించింది. కానీ చివరి వరకు ఆ జోరును కొనసాగించలేకపోయాం. కొన్ని సార్లు మేం పవర్ ప్లేలో బాగా ఆడితే.. మరికొన్నిసార్లు మిడిలార్డర్‌లో రాణిస్తున్నాం.

ఇంకొన్నిసార్లు డెత్ ఓవర్లలో చెలరేగుతున్నాం. ఇన్నింగ్స్ ఆసాంతం ఒకేలా ఆడాల్సిన అవసరం ఉంది. టీ20 ప్రపంచకప్‌లో మెరుగైన ప్రదర్శన చేయాలంటే తప్పిదాలను అస్సలు పునరావృతం చేయకూడదు. గుల్బాదిన్ నైబ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతను జట్టులో సీనియర్ ఆటగాడు. పవర్ ప్లేలో భారీ షాట్లు ఆడినప్పుడే అతను అసాధారణ ఇన్నింగ్స్ ఆడుతాడని నమ్మాం. అతను ఈ మూమెంటమ్‌ను ఇన్నింగ్స్ చివరి వరకు కొనసాగించాలని కోరుకుంటున్నాం.'అని ఇబ్రహీమ్ జడ్రాన్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు కుప్పకూలింది. ఇబ్రహీమ్ జడ్రాన్(35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/32) తీన్మార్ బౌలింగ్‌తో రఫ్ఫాడించగా.. రవి బిష్ణోయ్(2/39), అక్షర్ పటేల్(2/17) రెండేసి వికెట్లతో అఫ్గానిస్థాన్ పతనాన్ని శాసించారు. శివమ్ దూబేకు ఓ వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్య చేధనకు దిగిన టీమిండియా దూబే, యశస్వి సిక్సర్ల మోతకు ఓవర్లలో 4 వికెట్లకు పరుగులు చేసి అలవోక విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ(16 బంతుల్లో 5 ఫోర్లతో 29), రింకూ సింగ్(9 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.