Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Japan ఏకైక టీ20 మ్యాచ్.. జియో హాట్‌స్టార్, సోనీ లైవ్‌లో రాదు.. ఎలా చూడాలంటే?

ఆసియా గేమ్స్ 2026 కోసం జపాన్ పర్యటనకు వెళ్లిన టీమిండియా.. అక్కడ ఆతిథ్య దేశంతో ఏకైక టీ20 మ్యాచ్ ఆడనుంది. భారత్, జపాన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ఈ మ్యాచ్ ఏర్పాటు చేశాడు. స్పోర్ట్ 75 ప్రత్యేక ద్వైపాక్షిక సాంస్కృతిక క్రీడా కార్యక్రమంలో భాగంగా ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు.

జపాన్ రాజధాని టోక్యోలోని సానో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం‌ ఈ చారిత్రాత్మక మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 9.30 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతోంది.

భారత్ X జపాన్ ఏకైక టీ20కి భారీ అడ్డంకి!

భారత్ X జపాన్ ఏకైక టీ20కి భారీ అడ్డంకి!

జియో హాట్‌స్టార్, సోనీ లైవ్‌లో రాదు..?

అయితే ఈ మ్యాచ్‌ భారత అభిమానులు రెగ్యులర్‌గా చూసే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ జియో హాట్‌స్టార్, సోనీ లైవ్‌లో రాదు. ఈ ఏకైక మ్యాచ్‌కు అధికారిక ఓటీటీ బ్రాడ్‌కాస్టర్‌గా ఫ్యాన్ కోడ్ వ్యవహరిస్తోంది. ఫ్యాన్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోని ఈ మ్యాచ్‌ను చూడవచ్చు. టీవీలో మాత్రం స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. సిరీస్‌కు ఒక ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ మారుతుండటం అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది.

How to Watch India vs Japan T20I Despite No Telecast on JioHotstar or SonyLIV

సెప్టెంబర్ 28 నుంచి ఆసియా గేమ్స్‌లో భారత్ మ్యాచ్‌లు ప్రారంభం కానుండగా.. ఈ ఏకైక టీ20ని భారత్ సన్నాహకంగా వాడుకోనుంది. ఈ నామమాత్రపు టీ20 మ్యాచ్‌లో బరిలోకి దిగే టీమిండియా కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి యువ ప్లేయర్లను ఆడిస్తారా? లేక రెగ్యులర్ టీమ్ కాంబినేషన్‌ను కొనసాగిస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

జపాన్‌తో ఏకైక టీ20కి భారత తుది జట్టు(అంచనా).

అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్)/వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా/యశ్ ఠాకూర్, అర్ష్‌దీప్ సింగ్.

IND vs JPN: జపాన్‌తో తలపడే భారత తుది జట్టు ఇదే.. వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్!

Also Read

IND vs JPN: జపాన్‌తో తలపడే భారత తుది జట్టు ఇదే.. వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్!

ఆసియా క్రీడల కోసం భారత్ టీ20 జట్టు:

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, యశ్ ఠాకూర్, విప్రాజ్ నిగమ్.

Story first published: Monday, September 21, 2026, 17:45 [IST]
Other articles published on Sep 21, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+