
చెప్పాపెట్టకుండా వచ్చాడు..
ఇక తాజాగా ధోనీ సింప్లిసిటి గురించి టీమిండియా క్రికెటర్ మన్‌దీప్ సింగ్ తెలిపాడు. మహీ తన పెళ్లికి వచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చాడని గుర్తు చేసుకున్నాడు. స్పోర్ట్స్‌కీదా చానెల్‌తో మాట్లాడుతూ.. ‘నా పెళ్లి 2016 డిసెంబర్‌లో జరిగింది. వివాహానికి రావాలని నేను మహీ భాయ్‌ని ఆహ్వానించా. అయితే అతను పెళ్లికి వస్తున్నట్లు చెప్పలేదు. పైగా న్యూయార్క్ వెళ్లాల్సి ఉందన్నాడు. నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ధోనీ భాయ్ చెప్పా పెట్టకుండా నా పెళ్లికి వచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. అతని బిజీ షెడ్యూల్‌ను పక్కనపెట్టి మరీ మహీభాయ్ నా పెళ్లికి రావడం మరిచిపోలేని మూమెంట్.

మూడు ఫ్లైట్స్ మారాడు..
నా పెళ్లికి రావడానికి ధోనీ భాయ్ ఏకంగా మూడు ఫ్లైట్స్ మారాడు. రాంచీ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి అమృత్‌సర్‌కు వచ్చి తర్వాత రెండు గంటల ప్రయాణం చేశాడు. ఆ సమయంలో తీవ్రమైన చలి ఉంది. కానీ అతను అవేవి పట్టించుకోకుండా నేను పిలిచానని వచ్చాడు. అతనితో నేను ఆడింది కూడా చాలా తక్కువ. ఇదే మహీ భాయ్ సింప్లిసిటికి, అతని గొప్పతనానికి నిదర్శనం.'అని 28 ఏళ్ల మన్‌దీప్ సింగ్ గుర్తు చేసుకున్నాడు.

ఏ రోజు ఆ అహం చూపించలేదు..
ఇక ధోనీతో గడిపిన క్షణాలను వర్ణించడానికి మాటలు రావడం లేదు. కల నిజమవ్వడం అంటే అదే. మహీ భాయ్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే రకం. మేమిద్దం ఎక్కువగా ప్లే స్టేషన్స్‌లో ఆడేవాళ్లం. ఏనాడు మహీ భాయ్ తానో లెజండరీ క్రికెటర్‌ననే అహాన్ని చూపించలేదు. నాతో ఎక్కువగా తినేవాడు. మేమిద్దరం బిర్యానీ వంటి దేశీ ఫుడ్ తెప్పించుకొని, కింద కూర్చొని తినేవాళ్లం. అతనితో గడిప్పిన క్షణాలు చాల గొప్పవి'అని మన్‌దీప్ చెప్పుకొచ్చాడు. ఇక 2016 జింబాబ్వే పర్యటనలో ధోనీతో మన్‌దీప్ డ్రెస్సింగ్ రూం షేర్ చేసుకున్నాడు.
ప్రధాని మోదీని ప్రశంసించిన పాక్ మాజీ పేసర్

టీవీ సిబ్బంది పక్కనే..
ఆ మధ్య మిడ్-డే దినపత్రికకు రాసిన కాలమ్‌లో భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్.. ధోనీ సింప్లిసిటీని ప్రస్తావిస్తూ కొనియాడాడు. 'స్వదేశంలో జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌ల ప్రయాణాల విషయంలో భారత క్రికెట్‌లో ఓ అద్భుతమైన విధానం ఉంది. ఈ విషయం చాలా మంది అభిమానులకు తెలుసు. మ్యాచ్‌ల కోసం ఒక వేదిక నుంచి మరొక వేదికకు ఇరు జట్లు ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తుంటాయి.
ఈ ఫ్లైట్‌లోనే టీవీ సిబ్బంది కూడా తమ సామాగ్రితో ప్రయాణిస్తుంటుంది. అయితే ఈ విమానంలో కొన్నే బిజినెస్ క్లాస్ సీట్లుంటాయి. వీటిలో టీమ్‌మేనేజర్స్, కెప్టెన్, కోచ్‌లు మాత్రమే కూర్చుంటారు. ఆటగాళ్లలో ముందు మ్యాచ్‌లో ఎవరైతే అద్భుత ప్రదర్శన కనబరుస్తారో వారికి రివార్డుగా ఆ సీటు కేటాయిస్తారు. అయితే ధోనీ మాత్రం ఏనాడు బిజినెస్ క్లాస్ సీట్‌లో కూర్చునేవాడు కాదు. కెప్టెన్‌గా ఆ సీటులో కూర్చునే అవకాశం ధోనీకి ఉన్నా.. అతను మాత్రం టీవీ సిబ్బంది పక్కనే కూర్చోవడానికి ఇష్టపడేవాడు.'అని గావస్కర్ పేర్కొన్నాడు.
6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టిన తర్వాత స్టువర్ట్ బ్రాడ్ తండ్రి యూవీతో ఏమన్నాడంటే.?


Click it and Unblock the Notifications












