Hong Kong Sixes: పాక్, యూఏఈ చేతిలో ఓడిన భారత్!
హాంగ్ కాంగ్ సిక్సెస్ 2026 టోర్నీలో భారత్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. శుక్రవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లతో ఓడిన కృనాల్ పాండ్యా సారథ్యంలోని భారత్.. శనివారం ఉదయం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. ఈ వరుస పరాజయాలతో గ్రూప్ సీలో అట్టడుగు స్థానంలో నిలిచి టైటిల్ రేసు నుంచి తప్పుకుంది. కన్సోలేషన్ ట్రోఫీ కోసం జరిగే బౌల్ సెమీఫైనల్స్ రౌండ్‌లో భారత్ తలపడనుంది.
యూఏఈ చేతిలో చిత్తు..
యూఏఈతో శనివారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 6 ఓవర్లలో 94 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ త్రిపాఠి(7 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 24), నటరాజన్(14 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 38) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కృనాల్ పాండ్యా(8 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 15) పర్వాలేదనిపింగా.. నితీష్ రాణా(6), రాహుల్ తెవాటియా(1), శశాంక్ సింగ్(1) తీవ్రంగా నిరాశపర్చారు. యూఏఈ బౌలర్లలో జాహిద్ అలీ(3/32) మూడు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం యూఏఈ 4.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 97 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ ఖలిద్ షా(14 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 52 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీతో రాణించగా.. అన్ష్ టండూన్(12 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 39 నాటౌట్) సత్తా చాటాడు.
పాక్ చేతిలోనూ ఓటమి..
శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 6 ఓవర్లలో 5 వికెట్లకు 88 పరుగులే చేసింది. శశాంక్ సింగ్(11 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 40) ఒక్కడే రాణించగా.. రాహుల్ త్రిపాఠి(9), నితీష్ రాణా(14 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 19), రాహుల్ తెవాటియా(0), కృనాల్ పాండ్యా(0) తీవ్రంగా నిరాశపర్చారు. టీ నటరాజన్(6 బంతుల్లో 2 ఫోర్లతో 12 నాటౌట్) అజేయంగా నిలిచాడు. పాకిస్థాన్ బౌలర్లలో అబ్దుల్ సమద్(2/10) రెండు వికెట్లు తీయగా.. అహ్మద్ డానియల్, ముమమ్మద్ షెహ్‌జాద్ తలో వికెట్ తీసారు.
అనంతరం పాకిస్థాన్ 3.5 ఓవర్లలో 2 వికెట్లకు 91 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. ఖవాజా నఫే(12 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 41), అబ్బాస్ అఫ్రిది(8 బంతుల్లో ఫోర్, 5 సిక్స్‌లతో 35) దూకుడుగా ఆడారు. భారత బౌలర్లలో శశాంక్ సింగ్, రాహుల్ తేవాటియా తలో వికెట్ తీసారు. భారత జట్టు నిండా ఐపీఎల్ స్టార్లున్నా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడాన్ని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


