Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్.. హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నీ రూల్స్ ఇవే!

హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ ఆడేందుకు టీమిండియా సిద్దమైంది. భువనేశ్వర్ కుమార్ సారథ్యంలోని భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. భువనేశ్వర్ కుమార్‌తో పాటు కృనాల్ పాండ్యా, నితీష్ రాణా, శశాంక్ సింగ్, టీ నటరాజన్, రాహుల్ తెవాటియా, రాహుల్ త్రిపాఠి ఈ జట్టులో ఉన్నారు.

న్యూజిలాండ్‌తో 2022లో చివరి టీ20 మ్యాచ్ ఆడిన భువనేశ్వర్ కుమార్.. మళ్లీ భారత్ తరఫున ఆడలేదు. ఇన్నాళ్లకు ఐసీసీ ఆమోదం ఉన్న హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు ఈ టోర్నీ జరగనుంది.

భారత్ ప్రపంచకప్ గెలవాలంటే.. జట్టులో ఆ ఇద్దరు ఉండాలి!

భారత్ ప్రపంచకప్ గెలవాలంటే.. జట్టులో ఆ ఇద్దరు ఉండాలి!

హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నీ ఫార్మాట్ ఏంటంటే..?

ఐసీసీ ఆమోదంతో క్రికెట్ హాంగ్ కాంగ్ ప్రతీ ఏడాది ఈ భిన్నమైన టోర్నీని నిర్వహిస్తుంది. ఈ టోర్నీ ఫార్మాట్, నిబంధనలు.. ఐసీసీ రూల్స్‌కు భిన్నంగా ఉంటాయి. ఈ టోర్నీలో ప్రతీ జట్టులో ఆరుగురు ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. బౌలర్, కీపర్ మినహాయించి మైదానంలో నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఉంటారు. దాంతో బ్యాటర్లకు పరుగులు చేయడం సులువవుతోంది. ప్రతీ మ్యాచ్‌ 6 ఓవర్ల చొప్పున జరగుతుంది. ఒక మ్యాచ్ సగటున 45 నిమిషాల్లోనే పూర్తవుతుంది.

Bhuvneshwar Kumar Named India Captain for Hong Kong Sixes Everything You Need to Know

వికెట్ కీపర్ మినహా జట్టులోని ఐదుగురు ఆటగాళ్లు తప్పనిసరిగా బౌలింగ్ చేయాలి. ఒక బౌలర్ గరిష్టంగా 2 ఓవర్లు వేయవచ్చు. కానీ వరుసగా వేయడానికి లేదు. మిగిలిన నలుగురు ఆటగాళ్లు తప్పనిసరిగా ఒక్కో ఓవర్ వేయాలి. ఈ ఫార్మాట్‌ ఆల్‌రౌండర్లకు బాగా కలిసొస్తుంది.

50 పరుగులు చేస్తే రిటైర్..

ఏ బ్యాటర్ అయినా వ్యక్తిగతంగా 50 పరుగులు పూర్తి చేయగానే నాటౌట్‌‌గా రిటైర్ కావాలి. ఒకవేళ జట్టులోని 5 వికెట్లు పడిపోతే, నాటౌట్‌గా మిగిలిన చివరి బ్యాటర్ ఒంటరిగానే బ్యాటింగ్ కొనసాగించవచ్చు. అయితే అతనితో పాటు రన్నింగ్ చేయడానికి నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఒక రన్నర్ (ఔటైన ఆటగాడు) ఉంటాడు.

జట్టు ఇన్నింగ్స్ ముగిసే సమయానికి ఓవర్లు మిగిలి ఉండి, చివరి వికెట్ పడిపోతే, అంతకుముందు 50 పరుగులు చేసి రిటైర్ అయిన బ్యాటర్ మళ్లీ క్రీజ్‌లోకి రావచ్చు.

అతనికి అవకాశాలు ఇస్తే గొప్ప ఆల్‌రౌండర్‌ అవుతాడు: టీమిండియా బౌలింగ్ కోచ్

Also Read

అతనికి అవకాశాలు ఇస్తే గొప్ప ఆల్‌రౌండర్‌ అవుతాడు: టీమిండియా బౌలింగ్ కోచ్

ఒక్క ఎక్స్‌ట్రాకు 2 పరుగులు..

ప్రతి వైడ్ లేదా నో బాల్‌కి ప్రత్యర్థి జట్టుకు 2 పరుగులు అదనంగా ఇస్తారు. సాధారణంగా ఫైనల్ మ్యాచుల్లో మాత్రమే 5 ఓవర్లకు బదులుగా 8 ఓవర్లు లేదా ప్రత్యేక వైవిధ్యమైన రూల్స్ ఉపయోగిస్తుంటారు.

బరిలో 12 జట్లు..

ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో సహా మొత్తం 12 జట్లు పోటీపడుతాయి. ఈ 12 జట్లను 4 గ్రూప్‌‌లుగా Pool A, B, C, D విభజించారు. గ్రూప్ దశలో టాప్ స్థానాల్లో నిలిచే జట్లు నాకౌట్‌కు అర్హత సాధిస్తాయి.

హాంకాంగ్ సిక్స్ సిరీస్ కోసం భారత జట్టు: భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్యా, శశాంక్ సింగ్, రాహుల్ ద్వివేది, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, డి నటరాజన్.

Story first published: Monday, October 5, 2026, 17:26 [IST]
Other articles published on Oct 5, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+