Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఏమండోయ్ మయాంక్ ‘నటరాజ్ షాట్’ చూశారా? (వీడియో)

హైదరాబాద్ : అప్పర్ కట్, స్వీప్, రివర్స్ స్వీప్, రివర్స్ స్కూప్, హెలీక్యాప్టర్, కవర్ డ్రైవ్, ఆఫ్ డ్రైవ్ ఇలా క్రికెట్‌లో ఉన్న అన్నీ షాట్లు చూశాం.. కానీ ఈ నటరాజ్ షాట్ ఏందయ్యా? అని అనుకుంటున్నారా? అయితే మీరు భారత్-న్యూజిలాండ్ ఎలెవన్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఆడిన షాట్ చూడాల్సిందే. అయితే అప్పట్లో కపిల్ దేవ్, ఇప్పట్లో రోహిత్ శర్మ అభిమానులకు ఈ షాట్ సుపరిచతమే. పాత తరంలో కపిల్ దేవ్ ఈ తరహా షాట్లను ఎక్కువగా ఆడగా.. ప్రస్తుత తరుణంలో రోహిత్ శర్మ ఈ షాట్‌తో మెరుపిస్తున్నాడు.

నట్‌రాజ్ షాట్ అంటే..

నట్‌రాజ్ షాట్ అంటే..

శరీరంపైకి దూసుకొచ్చే బంతిని లాఘవంగా నటరాజ్ స్టయిల్‌లో ఒక కాలు పైకెత్తి డీప్ మిడ్‌వికెట్ దిశగా బౌండరీకి తరలించడమే ‘నటరాజ్ షాట్'. అప్పట్లో కపిల్ దేవ్ ఈ షాట్ ద్వారా సునాయాసంగా పరుగులు రాబట్టేవారు. ప్రస్తుతం ఆ నటరాజ్ షాట్‌ని రోహిత్ శర్మ బాగా ఆడుతున్నాడు.

వారెవ్వా బుమ్రా.. ఏం స్వింగ్ అది, తక్కువ అంచానా వేస్తే ఇలానే ఉంటది (వీడియో)

ప్రాక్టీస్‌లో మయాంక్..

అయితే న్యూజిలాండ్‌ ఎలెవన్‌తో తాజాగా ముగిసన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీతో మెరిసిన విషయం తెలిసిందే. అనాధికార టెస్ట్‌లు, గత మూడు వన్డేల్లో దారుణంగా విఫలమైన ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్.. ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఎట్టకేలకు ఫామ్‌ను అందుకున్నాడు. 99 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 81 పరుగులు చేసి తొలి టెస్ట్‌కు తాను రెడీ అని చాటి చెప్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపర్చినా రెండో ఇన్నింగ్స్‌లో ధాటిగా ఆడాడు. ఈ మ్యాచ్ రెండో రోజు భారత బౌలర్ల ధాటికి ప్రత్యర్థి 235 పరుగులకే ఆలౌటవ్వగా..అనంతరం బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఓపెనర్లు పృథ్వీషా.. మయాంక్ ఘన ఆరంభాన్నిచ్చారు.

ఓవైపు పృథ్వీషా అప్పర్ కట్, లేట్ కట్, స్క్వేర్ కట్ షాట్లతో విరుచుకుపడగా.. మరోవైపు మయాంక్ కూడా అదే రీతిలో ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో కుగ్‌లిన్ వేసిన ఓవర్‌లో శరీరంపైకి దూసుకొచ్చిన బంతిని నటరాజ్ స్టైల్‌లో డీప్ వికెట్ మీదుగా సిక్సర్‌ కొట్టాడు. ప్రస్తుతం ఈ షాట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

ఫ్యాన్స్ ఫిదా..

ఫ్యాన్స్ ఫిదా..

ఇక మయాంక్ నట్‌రాజ్ షాట్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోను షేర్ చేస్తూ మయాంక్‌ను కొనియాడుతున్నారు. సూపర్ షాట్ అని ఒకరంటే.. క్లాసీ సిక్స్ అని ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు.

మార్చి 25న ఐపీఎల్ ఆల్‌స్టార్ గేమ్.. కోహ్లీ, రోహిత్ ఒక్కటీమ్‌లోనే.. కెప్టెన్‌గా ధోని!

మ్యాచ్ డ్రా..

మ్యాచ్ డ్రా..

ఈ మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో పుజారా(93), ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి ( 101) రాణించడంతో భారత్ 263 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బౌలర్ల సమష్టిగా చెలరేగడంతో ప్రత్యర్థి జట్టు 235 పరుగులకే కుప్పకూలింది. ఇక రెండో ఇన్నింగ్స్ రిషభ్ పంత్, మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీలతో రాణించడంతో 48 ఓవర్లలో నాలుగు వికెట్లకు 252 పరుగులు చేసింది. దీంతో ఈ సన్నాహక మ్యాచ్ డ్రాగా ముగిసింది.

Story first published: Sunday, February 16, 2020, 16:40 [IST]
Other articles published on Feb 16, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+