భారత్ కిరీటాన్ని అందుకోవడమే మా లక్ష్యం: హ్యారీ బ్రూక్
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని అందుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ తెలిపాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా బ్రిస్టల్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో సమష్టిగా రాణించిన ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో ఇంగ్లండ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. సౌతాంప్టన్ వేదికగా శనివారం జరిగే ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధిస్తే ఐసీసీ టీ20 ర్యాకింగ్స్‌లో అగ్రస్థానం దక్కనుంది.
ప్రస్తుతం వరల్డ్ ఛాంపియన్ టీమిండియా నెంబర్ వన్‌గా కొనసాగుతోంది. అదే రోజు ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఇంగ్లండ్ ఫుట్‌బాల్ టీమ్ నార్వేతో తలపడనుంది. నాలుగో టీ20 విజయానంతరం మాట్లాడిన హ్యారీ బ్రూక్.. ఇంగ్లండ్ ఫుట్‌బాల్ టీమ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ను ప్రస్తావిస్తూ.. ఆశించిన ఫలితాలు దక్కితే స్పోర్ట్స్ రంగంలో తమ దేశానికి డబుల్ ధమాకా అవుతుందన్నాడు.

నెంబర్ వన్ మా లక్ష్యం..
'మేం వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్ అందుకోవడం.. అలాగే ఇంగ్లండ్ ఫుట్‌బాల్ టీమ్ సెమీస్‌కు వెళ్లడం అద్భుతంగా ఉంటుంది. మేం ఖచ్చితంగా ఆ ఫుట్‌బాల్ మ్యాచ్‌పై ఓ కన్నేస్తాం. సౌతాంప్టన్ వేదికగా వేదికగా జరిగే ఆఖరి టీ20లో విజయం సాధిస్తే నెంబర్ వన్ ర్యాంక్ దక్కుతుందని చెప్పారు.
నెంబర్ వన్ ర్యాంక్ అందుకోవడమే మా ప్రస్తుత లక్ష్యం. భారత్ చాలా బలమైన జట్టు. గత రెండేళ్లతో పోల్చితే ఈ సిరీస్‌లో ఆ జట్టు అంతగా రాణించలేకపోయి ఉండవచ్చు. కానీ మేం మా ప్రణాళికలను అమలు చేసిన విధానం పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. నిజాయితీగా చెప్పాలంటే.. భారత్‌ను 4-0తో ఓడించి సిరీస్ గెలవడం చాలా ప్రత్యేకమైన అనుభూతినిస్తోంది. ఇక వరల్డ్ నెంబర్ వన్‌గా నిలవడం అంతకంటే బాగుంటుంది. మా ప్రధాన లక్ష్యం నెంబర్ వన్ ర్యాంక్ అందుకోవడమే.
ఈ విజయాన్ని ఊహించలేదు..
సౌతాంప్టన్ వెళ్లి అక్కడ భారత్‌ను చిత్తుగా ఓడించేందుకు ప్రయత్నిస్తాం. అందుకోసం మేం అక్కడి పరిస్థితులను వీలైనంత త్వరగా అంచనావేయాలి. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు మేం చేసిన పని కూడా ఇదే. ఈ సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-0తో సిరీస్ కైవసం చేసుకుంటామని ఊహించలేదు. వైట్-బాల్ క్రికెట్‌లో మా జట్టు పురోగతికి ఈ ఫలితం నిదర్శనం. మా వైట్‌బాల్ టీమ్ సరైన మార్గంలోనే సాగుతోంది.
మేం చాలా అద్భుతమైన క్రికెట్ ఆడుతున్నాం. పిచ్‌లు, మైదానాల పరిస్థితులకు చాలా బాగా అలవాటు పడుతున్నాం. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లోనూ మేం మెరుగైన ప్రదర్శన చేశాం. వాంఖడే వేదికగా జరిగిన సెమీఫైనల్లో కొద్దిలో వెనుకబడ్డాం. అది అసాధారణ ప్రదర్శన. ఈ సిరీస్ విజయం ఇంగ్లండ్ క్రికెట్ వాతావరణాన్ని మార్చిందని భావిస్తున్నాను. కానీ ఈ సిరీస్‌లో మేం ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించి వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్ అందుకుంటామని ఆశిస్తున్నా.'అని హ్యారీ బ్రూక్ చెప్పుకొచ్చాడు.
హ్యారీ బ్రూక్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ 22 టీ20 మ్యాచ్‌లు ఆడి 19 గెలిచింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ చేతిలో ఇంగ్లండ్ ఓటమిపాలైంది. 254 పరుగుల భారీ లక్ష్య ఛేదనలోనూ ధీటుగా బదులిచ్చిన ఇంగ్లండ్.. తృటిలో విజయాన్ని చేజార్చుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

