IND vs WI: ఆ ఊపుతో భారత్‌ను ఓడిస్తాం..వారికి బౌలింగ్ చేయడం భయానకమే: అకీల్ హోసెన్
ఆఖరి వన్డేలో సాధించిన గెలుపు ఊపుతో ఐదు టీ20ల సిరీస్‌లోనూ భారత్‌ను ఓడిస్తామని వెస్టిండీస్ స్పిన్నర్ అకీల్ హోసెన్ అన్నాడు. భారత్ ప్రమాదకర జట్టే అయినా.. ఎక్కడా తగ్గబోమని స్పష్టం చేశాడు.
భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కోల్పోయిన విండీస్.. ఐదు టీ20ల సిరీస్‌కు సిద్దమైంది. మంగళవారం లక్నో వేదికగా జరిగే తొలి టీ20తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. వన్డే సిరీస్ కోల్పోయినా ఆఖరి వన్డే విజయంతో వెస్టిండీస్ జోరు మీద ఉంది.
నీ అవ్వ తగ్గేదేలే..
తొలి టీ20 నేపథ్యంలో సోమవారం మీడియా సమావేశంలో పాల్గొన్న అకీల్ హోసెన్ భారత్‌ను ఓడిస్తామని తెలిపాడు. 'మేం ఎలాంటి విధ్వంసకర క్రికెట్ ఆడతామో టీమిండియాకు బాగా తెలుసు. భారత్ చాలా ప్రమాదకరమైన జట్టు అని మాకు కూడా తెలుసు. కానీ మేం మాత్రం ఎక్కడా తగ్గబోం. వెనకడుగు వేయం.

ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 2-1తో గెలుచుకున్నా.. ఆఖరి మ్యాచ్‌లో సాధించిన విజయం ఇచ్చిన ఊపుతో ఈ టీ20 సిరీస్‌లోకి దిగుతున్నాం. రెండు జట్లూ ఈ సవాలును స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సిరీస్‌లో ఎవరు ప్రణాళికలకు తగ్గట్లు ఆడుతారో వారినే విజయం వరిస్తుంది. మా చేతుల్లో ఉన్న విషయాలపైనే మేం పూర్తి దృష్టి పెడతాం.
వారికి బౌలింగ్ చేయడం భయానకమే..
క్రికెట్‌లో కొత్త సవాళ్లను స్వీకరించడం నాకు ఇష్టం. టీ20ల్లో భారత్ టాప్ ఆర్డర్ ఎంత విధ్వంసకరంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. నిజం చెప్పాలంటే.. పవర్ ప్లేలో బౌలింగ్ చేయడం ఎవరికైనా కష్టమే. ముఖ్యంగా స్పిన్నర్లకు చాలా భయానకమైన విషయం. భారత్‌లో బౌండరీ లైన్లు దగ్గరగా ఉంటాయి. పైగా కేవలం ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే సర్కిల్ బయట ఉంటారు. అందులోనూ మంచి బ్యాటింగ్ పిచ్‌లపై, అంత భారీ స్ట్రైక్ రేట్‌తో ఆడే బ్యాటర్లకు బౌలింగ్ చేయడం మరింత కష్టం.'అని అకీల్ హోసెన్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


