Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హార్దిక్ పాండ్యా సీక్రెట్ డేటింగ్‌.. నోరు విప్పిన బాలీవుడ్ బ్యూటీ!

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో ఉన్న వైరల్ వీడియోపై బాలీవుడ్ నటి అమీషా పటేల్ స్పందించారు. ఇటీవల ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్లో అమీషా పటేల్, హార్దిక్ పాండ్యా ఒకరికొకరు కలిశారు. ఈ సందర్భంగా అమీషా పటేల్ తన స్నేహితులకు హార్దిక్ పాండ్యాను పరిచయం చేశారు. ఆ సమయంలో హార్దిక్ పాండ్యా భుజంపై అమీషా పటేల్ చేయి వేసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఈ వైరల్ వీడియోపై పాపరాజీలు ప్రశ్నించగా.. అమీషా చాలా సాధారణంగా స్పందిస్తూ ఎలాంటి వివరణ ఇవ్వడానికి ఇష్టపడలేదు. "ఆ వీడియో చాలా బాగా వైరల్ అయింది. ఇక చాలు, నాకు ఆలస్యమవుతోంది. సరే, బై" అని చెబుతూ అమీషా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

6 నెలల్లో 41 మ్యాచ్‌లు.. IPL 2027 వరకు టీమిండియా షెడ్యూల్ ఇదే..!

6 నెలల్లో 41 మ్యాచ్‌లు.. IPL 2027 వరకు టీమిండియా షెడ్యూల్ ఇదే..!

ఈ క్రమంలో ఓ నెటిజన్ ఎక్స్ వేదికగా వీరిద్దరి మధ్య డేటింగ్ రూమర్లు ఉన్నాయంటూ వీడియోను షేర్ చేశారు. అయితే అమీషా వెంటనే గట్టి కౌంటర్ ఇస్తూ అన్ని రూమర్లకు చెక్ పెట్టారు. ఆ పోస్టును తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. "నిజమేనండి.. ఆయనపై నేను చేయి వేసిన విధానం నిజంగానే చాలా రొమాంటిక్‌గా ఉంది. నాకు మీరు ఎవరో తెలియదు కానీ, మీకైతే ఖచ్చితంగా ఓ అమ్మాయి కూడా ఫ్రెండ్ గా లేదని అర్థమవుతోంది. ఇకపై ఇలాంటి పోస్టులు పెట్టే ముందు ఓ మహిళా స్నేహితురాలినైనా సంపాదించుకోండి" అని ఘాటుగా స్పందించారు.

Ameesha Patel Reacts to Viral Dating Rumors with Hardik Pandya while He confirms his relationship with Mahieka
Hardik Pandya: పవన్ కళ్యాణ్ హీరోయిన్‌తో హార్దిక్ పాండ్యా హంగామా!

Also Read

Hardik Pandya: పవన్ కళ్యాణ్ హీరోయిన్‌తో హార్దిక్ పాండ్యా హంగామా!

మరోవైపు హార్దిక్ పాండ్యా కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన ప్రియురాలు మహికా శర్మతో ఉన్న పలు ఫోటోలను పోస్ట్ చేశారు. దీంతో బాలీవుడ్ నటితో ముడిపెడుతూ వస్తున్న పుకార్లకు పూర్తిగా తెరపడినట్లయింది. ఇదిలా ఉండగా.. హార్దిక్ పాండ్యా త్వరలోనే మళ్లీ స్టేడియంలోకి అడుగుపెట్టనున్నారు. ఆస్ట్రేలియా ఏతో జరిగే స్వదేశీ సిరీస్ కోసం భారత్ ఏ జట్టులో హార్దిక్ పాండ్యాకు చోటు దక్కింది. ఈ సిరీస్ లో రెండు మల్టీ-డే మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా బెంగళూరులోన బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో కోలుకుంటూ శిక్షణ పొందుతున్నారు.

Story first published: Wednesday, September 9, 2026, 20:16 [IST]
Other articles published on Sep 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+