For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సౌతాఫ్రికా సిరీస్‌కు పాండ్యా రెడీ!!

IND VS SA 2020 : Hardik Pandya All Set To Make His Return For South Africa ODI Series
Hardik Pandya Might Return for South Africa ODI Series

బెంగుళూరు: వెన్నుగాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల లండన్‌లో సాధారణ చెకప్‌ చేయించుకున్న పాండ్యా ప్రస్తుతం బెంగుళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాడు.

రొటిన్ చెకప్..

రొటిన్ చెకప్..

'లండన్‌ నుంచి పాండ్యా తిరిగొచ్చాడు. ఇది రొటిన్ చెకప్‌ మాత్రమే. ఈ వారం నుంచి అతడు బౌలింగ్‌ ప్రాక్టీస్ చేస్తున్నాడు. త్వరలోనే టీమ్ సెలెక్షన్‌కు అందుబాటులోకి వస్తాడు. వీలైతే దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో ధర్మశాల వేదికగా జరిగే తొలి వన్డేలో అతడిని మనం చూడొచ్చు' అని ఎన్‌సీఏ సభ్యుడొకరు మీడియాకు తెలిపారు.

క్రికెట్ చరిత్రలోనే కనివిని ఎరుగని ఘటన.. క్రీడాస్పూర్తికి విరుద్దమంటూ మాజీల ఫైర్

రజినీకాంత్ శివగ్నమమ్ దగ్గర..

రజినీకాంత్ శివగ్నమమ్ దగ్గర..

ఎన్‌సీఏలో చేరకముందు పాండ్యా, బుమ్రా.. ఢిల్లీ క్యాపిటల్స్‌ ట్రైనర్‌ రజినీకాంత్‌ శివగ్నమమ్‌ వద్ద పునరావసం పొందిన విషయం తెలిసిందే. మరోవైపు బీసీసీఐ ప్రెసిడెంట్‌ సౌరభ్‌ గంగూలీ ఇటీవల మాట్లాడుతూ ఎవరైనా ఆటగాడు గాయపడితే ఎన్‌సీఏకి రావాలని, అక్కడే తమకు కావాల్సిన సేవలను ఉపయోగించుకోవాలని చెప్పారు. దీంతో పాండ్యా ప్రస్తుతం ఎన్‌సీఏలో తన సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాడు.

పాండ్యా రాక కోసం..

పాండ్యా రాక కోసం..

ఇక పాండ్యా రాక కోసం టీమ్‌మేనేజ్‌మెంట్ వెయ్యికళ్లతో ఎదురుచూస్తోంది. న్యూజిలాండ్ పర్యటనకు ముందు అతని కోసం వన్డే, టెస్ట్ జట్లను ఎంపికను వాయిదా వేసింది. అతను వర్క్‌లోడ్ టెస్ట్‌లో విఫలమవడంతో చేసేదేమి లేక జట్లను ప్రకటించింది.

జహీర్ సూచన..

జహీర్ సూచన..

పునరాగమనం కోసం పాండ్యా తొందరపడవద్దని మాజీ పేసర్ జహీర్ ఖాన్ ఈ ఆల్‌రౌండర్‌కు సలహా ఇచ్చాడు. ఐపీఎల్‌కు ఇంకా ఎంతో సమయం ఉంది. అప్పటిలోగా హార్దిక్‌ పాండ్యా 120 శాతం ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే.. గాయాలతో జట్టుకు దూరమైన తర్వాత పునరాగమనం ముఖ్యం కాదు. జట్టులో ప్రదర్శన ఏ స్థాయిలో ఉందనేదే పరిగణనలోకి తీసుకుంటారు. అందుకే పాండ్యాకు ఇప్పుడు ఓపిక అవసరం' అని అన్నాడు.

నీషమ్ ఈ గొడవ ఏప్రిల్‌లో చూసుకుందాం: రాహుల్

ఓపిక అవసరం..

ఓపిక అవసరం..

'సహాయ సిబ్బంది, ఫిజియో, ట్రైనర్స్‌తో పాటు వైద్య సిబ్బంది మాటను పాండ్యా వినాలి. తగినంత సమయం తీసుకోవాలి. రీఎంట్రీ కోసం తొందరపాటు పనికిరాదు. పునరాగమనంలో సుదీర్ఘ ప్రయోజనాలు కలిగిఉండాలి. ఇటీవల పాండ్యాతో మాట్లాడా. కొన్ని విషయాలు అతనికి చెప్పా. గాయాలతో జట్టుకు దూరమైనప్పుడు ఎంతో అసహనంతో ఉంటాం. కానీ.. ఓపికతోనే ఉంటేనే తిరిగి కోలుకోగలం. మన శరీరం మాట మనం వినాలి' అని జహీర్‌ పేర్కొన్నాడు.

Story first published: Wednesday, February 12, 2020, 21:49 [IST]
Other articles published on Feb 12, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+