
ఇంతకేం జరిగిందంటే..
బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పేస్ బౌలరైన జేమ్స్ నీషమ్ పరుగు తీయకుండా అడ్డు వచ్చాడని రాహుల్ వాగ్వాదానికి దిగాడు. అతని బౌలింగ్‌లో బంతిని మిడాన్ దిశగా నెట్టిన రాహుల్.. సింగిల్ కోసం నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు పరుగెత్తాడు. ఈ క్రమంలో బౌలర్ నీషమ్ వెనక్కి అడుగులు వేసుకుంటూ రాహుల్‌కి అడ్డుగా వెళ్లాడు. దీంతో.. అతన్ని ఢీకొట్టబోయిన రాహుల్.. అప్రమత్తమై తన దారిని మార్చుకుని సింగిల్ పూర్తి చేశాడు. ఆ వెంటనే ఆగ్రహంతో నీషమ్ దగ్గరికి వెళ్లి.. అడ్డొస్తే పరుగెలా తీయాలని ప్రశ్నించాడు. దీంతో ఈ ఇద్దరి మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగినట్లు కనిపించింది.
నగ్నచిత్రాలు బయటపెడ్తానని బెదిరిస్తున్నాడు.. పాక్ క్రికెటర్‌పై ఓ మహిళ సంచలన ఆరోపణలు
జేమ్స్ నీషమ్ ఉద్దేశపూర్వకంగానే తన దారికి అడ్డుగా వచ్చాడని రాహుల్ ఆరోపిస్తూ అతనితో వాగ్వాదానికి దిగాడు. మధ్యలో అంపైర్ కలగజేసుకుని సర్దిచెప్పడంతో రాహుల్ వెనక్కి తగ్గాడు. కానీ.. మళ్లీ నీషమ్ తన నోటికి పని చెప్పడంతో రాహుల్ కోపంగా అతనిపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే.. ఆఖరి క్షణంలో నీషమ్ పక్కకి తప్పుకోగా.. రాహుల్ తన మోచేతిని అతనికి తాకిస్తూ వెళ్లాడు. చివరకు రాహుల్ స్మైల్ ఇవ్వడంతో ఈ గొడవ సద్దుమణిగింది. కాకపోతే నిన్న మ్యాచ్‌లో ఈ గొడవే హైలెట్‌గా నిలిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియా వేదికగా విపరీతంగా షేర్ అయ్యాయి.

ఏప్రిల్ ఉంది సుమా.. కొన్ని దాచుకో
ఈ వ్యవహారం నెట్టింట హల్‌చల్ చేయడంతో జేమ్స్ నీషమ్ ట్విటర్ వేదికగా స్పందించాడు. తొలుత ‘రాహుల్.. అన్ని పరుగులు ఇప్పుడే చేయకు.. ఏప్రిల్ ఉంది సుమా.. కొన్ని దాచుకో'అంటూ రాహుల్ ఇన్నింగ్స్‌ను కొనియాడుతూ సరదాగా ట్వీట్ చేశాడు. అనంతరం వారిద్దరి మధ్య జరిగిన గొడవ గురించి ఓ అభిమాని ప్రశ్నించగా.. ‘అది చిన్న వాగ్వాదం అంతే.. ఎవరూ హద్దులు దాటలేదు'అంటూ బదులిచ్చాడు. ఆ వెంటనే ఈ గొడవకు సంబంధించిన ఫొటోకు ‘పేపర్, కత్తెర, బండరాయి'అనే క్యాప్షన్‌తో ట్వీట్ చేశాడు.

అప్పుడే తేల్చుకుందాం..
ఇక జిమ్మీ ట్వీట్‌కు రాహుల్ కూడా సరదాగా స్పందించాడు. ‘ఈ గొడవను ఏప్రిల్‌లో పరిష్కరించుకుందాం.. సీ యూ'అంటూ ట్వీట్ చేశాడు. మైదానంలో ఒకరిపై ఒకరు నోరుపారేసుకున్న ఆటగాళ్లు మ్యాచ్ అనంతం సరదాగా సంభాషించుకోవడంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ట్వీట్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఫన్నీ కామెంట్స్‌తో ఇద్దరిని ఆటపట్టిస్తున్నారు.

జిమ్మీ అందుకే కదా..
ఈ సీజన్ ఐపీఎల్‌లో జేమ్స్ నీషమ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరుపున బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే. వేలంలో కింగ్స్ పంజాబ్ నీషమ్‌ను రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. సూపర్ ఫామ్‌లో ఉన్న రాహుల్ ఈ సీజన్‌లో కింగ్స్ పంజాబ్ జట్టును నడిపించనున్నాడు. దీంతో ఈ విషయాన్ని గుర్తు చేస్తూ నీషమ్‌ను అభిమానులు ఆడుకుంటున్నారు. ‘జిమ్మీ.. ఐపీఎల్ కోసమే ఈ ట్వీట్ చేశావ్ కదా.. కెప్టెన్ మెప్పు కోసమే కదా'అంటూ సెటైర్లు వేస్తున్నారు.
త్వరలోనే టీ20 ఫార్మాట్‌కు డెవిడ్ వార్నర్ గుడ్‌బై!!

రాహుల్ సెంచరీ వృథా..
ఆఖరి వన్డేలో భారత్ ఐదు వికెట్లతో ఓడి 0-3తో క్లీన్‌స్వీప్ అయిన విషయం తెలిసిందే. ఫలితంగా 23 ఏళ్ల తర్వాత వన్డేల్లో వైట్ వాష్ అయిన జట్టుగా కోహ్లీ సేన అప్రతిష్టను మూటగట్టుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. 62 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను రాహుల్ సెంచరీతో ఆదుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 297 పరుగుల లక్ష్యాన్ని 47.1 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది.


Click it and Unblock the Notifications












