దేశం ముందు క్రికెట్ చాలా చిన్నది : హర్భజన్ సింగ్

ముంబై: దేశం ముందు క్రికెట్ చాలా చిన్నదని, ప్రస్తుత పరిస్థితుల్లో తాను క్రికెట్ గురించి ఏమాత్రం ఆలోచించట్లేదని టీమిండియా సీనియర్ స్పిన్నర్ హర్భజన్‌సింగ్ తెలిపాడు. ఇక లాక్‌డౌన్ ప్రకటించే ముందు ప్రభుత్వం వలస కూలీల గురించి ఆలోచించాల్సిందని భజ్జీ అభిప్రాయపడ్డాడు. ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ.. దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై స్పందించాడు.

స్వార్థపరుడిని అవుతా..
దేశంలో నెలకొన్న దుర్భర పరిస్థితుల్లో తాను క్రికెట్ గురించి కానీ, ఐపీఎల్ గురించి కానీ ఆలోచిస్తే స్వార్థపరుడిని అవతానని హర్భజన్ తెలిపాడు. ‘నిజంగా ఇప్పుడు నేను క్రికెట్ గురించి ఆలోచించట్లేదు. గత 15 రోజులుగా దాని ధ్యాసేలేదు. దేశం ముందు అది చాలా చిన్నది. ఒకవేళ ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో నేను క్రికెట్, ఐపీఎల్ గురించి ఆలోచిస్తే స్వార్థపరుడిని అవుతా. సంపూర్ణ ఆరోగ్య భారత దేశమే ఇప్పుడు మన ప్రధాన కర్తవ్యం. మనమంతా ఆరోగ్యంగా, జాగ్రత్తగా ఉంటేనే క్రీడలు జరుగుతాయి. ఇప్పుడైతే క్రికెట్ నా ఆలోచనల్లో కూడా లేదు' అని భజ్జీ స్పష్టం చేశాడు.
ముల్తాన్ సుల్తాన్ సెహ్వాగ్.. అరుదైన రికార్డుతో పాటు ఆ వివాదానికి 16 ఏళ్లు.!!

సాయం చేయాలి..
కొవిడ్ 19 వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండాలని, తోచిన సాయం చేసి దేశాన్ని తిరిగి యథాస్థితికి తీసుకురావాలని ఈ సీనియర్ స్పిన్నర్ పిలుపునిచ్చాడు. ఇక వలసకూలీల దయనీయ స్థితిపై భజ్జీ ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించేముందే వారి గురించి ఆలోచించాల్సిందన్నాడు. వాళ్లకి ఉండడానికి వసతి, తినడానికి తిండి, సంపాదించడానికి ఉద్యోగం లేదని గుర్తుచేశాడు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొని వారికి భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశాడు. ఇప్పుడు ఆ కూలీలకు స్వస్థలాలకు వెళ్లాలనిపిస్తోందని, ఈ పరిస్థితులను చూస్తుంటే ఆందోళన కలుగుతోందన్నాడు.
ఇల్లు క్లీనింగ్ అంత ఈజీ కాదు బ్రో : రోహిత్

ఇప్పుడు అర్థమైంది..
'ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురౌతాయని ఎవరూ ఊహించలేదు. నగరాలు, పట్టణాలు లాక్‌డౌన్ అవుతాయనుకోలేదు. చాలా త్వరగా పరిస్థితులు మారిపోయాయి. వలస కూలీల గురించి ఆలోచించే సమయం కూడా ప్రభుత్వానికి లేకపోయింది. ప్రజల భద్రత కోసం సరైన నిర్ణయాలు తీసుకునే సమయం ఇంకా ఉందని ఆశిస్తున్నా. అందరూ ఇప్పుడు ఎందుకు ఇళ్లకు వెళ్లాలనుకుంటున్నారో అర్థమైంది. ఎందుకంటే వారికి తమ సన్నిహితులతో ఉండాలనిపిస్తోంది' అని హర్భజన్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications