Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రైనా.. సాయంత్రం 4 గంటలకు కూడా స్కూల్ బంక్ కొడ్తారా?: భజ్జీ

Harbhajan hilariously trolls Suresh Raina after all-rounder bunked school to watch Tendulkars Desert Storm knock

న్యూఢిల్లీ: తన చిన్నతనంలో క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆట చూసేందుకు క్లాస్‌లు ఎగ్గొట్టేవాళ్లమని టీమిండియా బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా తాజాగా పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. 1998లో షార్జా వేదికగా జరిగిన కోకాకోలా సిరీస్‌‌లోని సచిన్ ఇసుక తుఫాన్ ఇన్నింగ్స్‌ను రైనా గుర్తు చేసుకున్నాడు.

సాయంత్రం 4 గంటలకు ఎలా?

సాయంత్రం 4 గంటలకు ఎలా?

అయితే అదే సిరీస్‌లో సచిన్‌తో కలిసి ఆడిన హర్భజన్ సింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ఆ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యాయని, అప్పుడు ఎలా బంక్‌కొట్టావని వ్యంగ్యంగా ప్రశ్నించాడు. దీనికి రైనా నుంచి సమాధానం రాకపోయినప్పటికీ ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. కొన్ని స్కూళ్లు సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయని, స్కూల్ తర్వాత అక్కడే ట్యూషన్స్ కూడా ఉంటాయని తెలిపారు. బహుషా రైనా స్కూల్ కూడా ఇలాంటిదేమోనని కామెంట్ చేసారు.

ఊరి క్రికెట్ డీఆర్ఎస్ చూశారా? కడుపుబ్బా నువ్వుతారు..!

 చివరి రెండు క్లాస్‌లు ఎగ్గొట్టాం..

చివరి రెండు క్లాస్‌లు ఎగ్గొట్టాం..

తాజాగా ఈ షార్జా కప్‌ను గుర్తు చేసుకుంటూ స్కూళ్లో చివరి రెండు క్లాస్‌లు ఎగ్గొట్టామని రైనా తెలిపాడు. ‘కోక కోలా కప్ ‌‌ఫైనల్ ‌‌చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌‌ అది. మేం స్కూల్‌‌కు వెళ్లినా మా మనసంతా మ్యాచ్‌‌పైనే ఉంది. ఎలాగైనా సచిన్ ‌‌ఆట చూడాల్సిందేనని నా ఫ్రెండ్ ‌‌అమిత్‌‌తో చెబుతున్నా. ఇక ధైర్యం చేసి చివరి రెండు క్లాస్‌ ‌ఎగ్గొట్టేశాం. నేరుగా సునీల్ ‌‌అనే ఫ్రెండ్​ ఇంటికి వెళ్లాం. అక్కడైతేనే కేబుల్ ‌‌కనెక్షన్ ‌‌ఉంది. మేమందరం సచిన్‌ ‌తుఫాన్ ‌‌కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. అనుకున్నట్లుగానే క్రీజులోకి వచ్చిన మాస్టర్‌‌ దుమ్మురేపాడు' అని రైనా పేర్కొన్నాడు.

 సచిన్ వల్లే ఫైనల్‌కు...

సచిన్ వల్లే ఫైనల్‌కు...

భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య ఈ షార్జా కప్ జరగ్గా.. ఒక్కో దేశం నాలుగు లీగ్ మ్యాచ్‌లు ఆడింది. అయితే భారత్, న్యూజిలాండ్ చెరొక విజయమే సాధించడంతో రన్ రేట్ కీలకమైంది. దీంతో ఆసీస్‌తో జరిగిన ఆఖరి లీగ్ భారత్‌కు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. కానీ సచిన్ మెరుపు ఇన్నింగ్స్ వల్ల మెరుగైన రన్‌రేట్‌తో ఫైనల్‌కు చేరి కప్‌ను ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో సచిన్ 131 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 143 పరుగులతో వీరవిహారం చేశాడు.

సెంచరీ కొట్టి.. షార్జాకప్ ముద్దాడి..

సెంచరీ కొట్టి.. షార్జాకప్ ముద్దాడి..

ఆస్ట్రేలియాతో జరిగిన నాటి ట్రై సిరీస్ ఫైనల్లో సచిన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 131 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 134 పరుగులతో వీరవిహారం చేసిన మాస్టర్.. ఒంటిచేత్తో భారత్‌ను గెలిపించాడు. అతని పోరాటం భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ ఒక్క మ్యాచ్‌లోనే కాదు సచిన్ ఆ సిరీస్‌లో మొత్తం 434 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు. అప్పట్లో తన సూపర్ బ్యాటింగ్‌ను కొనియాడుతూ క్రికెట్ విశ్లేషకులు ‘ఏడారిలో సచిన్ తుఫాన్'అంటూ అభివర్ణించారు.

విరుష్కా మీరెప్పుడంటూ.. హార్దిక్ పాండ్యా తండ్రికావడంపై పేలుతున్న జోకులు, మీమ్స్!

Story first published: Tuesday, June 2, 2020, 11:41 [IST]
Other articles published on Jun 2, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+