Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైభవ్ సూర్యవంశీ ఇంకొన్నాళ్లు డ్రింక్స్ మోయాల్సిందే: గౌతమ్ గంభీర్

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ.. తన అవకాశాల కోసం ఎదురు చూడాల్సిందేనని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మరోసారి స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని వైభవ్ సూర్యవంశీకి అర్థమయ్యేలా తాను చెప్పానని వెల్లడించాడు. వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో గెలుచుకున్న భారత్.. మంగళవారం నుంచి ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్‌ లక్నో వేదికగా జరగనుంది.

ఈ మ్యాచ్ నేపథ్యంలో అధికారిక బ్రాడ్‌కాస్టర్ జియో‌హాట్‌స్టార్‌తో మాట్లాడిన గంభీర్.. వైభవ్ గురించి ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతను ఇంకొన్నాళ్లు డ్రింక్స్ అందించాల్సిందేనని పరోక్షంగా వెల్లడించాడు.

వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తుపై శ్రేయస్ అయ్యర్ బిగ్ స్టేట్‌మెంట్!

వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తుపై శ్రేయస్ అయ్యర్ బిగ్ స్టేట్‌మెంట్!

వైభవ్‌కు నో ఛాన్స్..

'వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించడం కష్టమవుతోంది. అతను ఫామ్‌లో ఉన్న మాట వాస్తవమే. కానీ, జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదనేది అతనికి అర్థమయ్యేలా చెప్పాను. కొన్నిసార్లు అత్యుత్తమ ప్రదర్శన చేసే ఆటగాడైనా సరే.. అవకాశాల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది.

Gautam Gambhir Says I Made Him Understand After Question on Vaibhav Sooryavanshi s T20I Snub

ఇక, తుది జట్టులో ఎవరూ ఉండాలి అనేది సోషల్ మీడియా చర్చతోనో.. ఇతర వ్యక్తుల అభిప్రాయాల మీదనో ఆధారపడి ఉండదు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఎవరు ఉన్నారు..? పరిస్థితులు ఎలా ఉన్నాయి? మ్యాచ్‌ను ఎవరు గెలిపించగలరు? అనే అంశాలను పరిగణనలోకి తీసుకొని కెప్టెన్, కోచ్ తుది జట్టు ఎంపికపై నిర్ణయం తీసుకుంటారు.

వైభవ్ సూర్యవంశీ గొప్పతనమే అది: శ్రేయస్ అయ్యర్

Also Read

వైభవ్ సూర్యవంశీ గొప్పతనమే అది: శ్రేయస్ అయ్యర్

వైభవ్ కోసం వారిని తప్పించలేం..

ఒకవేళ వైభవ్‌ను ఆడిస్తే.. అభిషేక్, సంజూ శాంసన్‌లలో ఎవర్ని తప్పించాలనేది కష్టమవుతుంది. గత కొంతకాలంగా మెరుగ్గా రాణిస్తున్న ఈ కాంబినేషన్‌ను ఉన్నట్టుండి మార్చలేం. రెండు, మూడు వైఫల్యాలకే .. సీనియర్ ఆటగాళ్లను పక్కనపెట్టి కుర్రాళ్లను ఆడించడం సరికాదు. పాపులర్ అయ్యే నిర్ణయాలు తీసుకోవడం సరైన నిర్ణయమే. కానీ సరైన నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమైన పని. సంజూ-అభిషేక్ జోడీని కొనసాగించి మేం మంచి నిర్ణయమే తీసుకున్నామని అనిపిస్తోంది.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

ఇంగ్లండ్ పర్యటనలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వైభవ్.. జింబాబ్వే పర్యటనలో అదరగొట్టాడు. సొంతగడ్డపై అఫ్గాన్‌తో జరిగిన సిరీస్‌లో అతనికి ఒక్క అవకాశం రాలేదు. ఆసియా గేమ్స్‌లో ఓపెనర్‌గా అవకాశం ఇవ్వగా సత్తా చాటాడు. శ్రీలంకతో సెమీఫైనల్లో 21 బంతుల్లో 38 పరుగులు చేసిన వైభవ్.. పాకిస్థాన్‌పై ఫైనల్లో 15 పరుగులు చేశాడు. వెస్టిండీస్‌తో సిరీస్‌లోనూ ఆరంభంలో అతనికి అవకాశాలు దక్కేలా లేవు.

Story first published: Monday, October 5, 2026, 15:27 [IST]
Other articles published on Oct 5, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+