మా మధ్య భేదాభిప్రాయాలు ఉండొచ్చు.. కానీ అఫ్రిది త్వరగా కోలుకోవాలి: గంభీర్

న్యూఢిల్లీ: కరోనా వైరస్ బారిన పడిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది త్వరగా కోలుకోవాలని భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఆకాంక్షించాడు. అటు మైదానంలో.. ఇటు సోషల్ మీడియాలో ఉప్పు-నిప్పుగా ఉండే ఈ మాజీ ఆటగాళ్లు తరుచూ వాదులాడుకుంటారనే విషయం తెలిసిందే. ఇటీవల కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ అఫ్రిది చేసిన అనుచిత వ్యాఖ్యలను కూడా గంభీర్ తనదైన శైలిలో తిప్పికొట్టాడు.

రాజకీయా విభేదాలు ఉండొచ్చు..
ఇక గత రెండు రోజులుగా అస్వస్థతకు లోనైన అఫ్రిదికి శనివారం కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. ఇక ఈ వార్త తెలుసుకున్న గౌతమ్ గంభీర్ అఫ్రిది త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. తనకు అఫ్రిదితో రాజకీయ విభేదాలు ఉండొచ్చని, అది వ్యక్తిగత వైరం కాదని చెప్పాడు. ఏ ఒక్కరూ వైరస్ భారిన పడవద్దనేది తన అభిమతమని తెలిపాడు. త్వరలోనే అఫ్రిది సంపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడని ఇండియా టుడే సలామ్ క్రికెట్ 2020 కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు.
‘ఏ ఒక్కరూ కరోనా వైరస్ భారిన పడకూడదు. షాహిద్ అఫ్రిదితో నాకు రాజకీయ విభేదాలు ఉండొచ్చు. కానీ అతను త్వరగా కోలుకోవడమే నాకు కావాలి. అఫ్రిదనే కాదు ఈ వైరస్ భారిన పడిన ప్రతీ ఒక్కరూ వీలైనంత త్వరగా కోలుకోవాలి.'అని గంభీర్ తెలిపాడు.

ముందు మీ దేశప్రజలను చూసుకోండి..
భారత్‌లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న క్రమంలో అవసరమైతే తమ సాయం అందిస్తామని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై గంభీర్ తనదైన శైలిలో స్పందించాడు. సాయం చేయడానికి ముందుకొచ్చిన ఇమ్రాన్ ఖాన్‌కు ధన్యవాదాలు చెబుతూనే.. ముందుగా కరోనాతో అల్లాడుతున్న పాక్ ప్రజలను ఆదుకోవాలని చురకలంటించాడు.
తప్పుగా అర్థం చేసుకోవద్దు.. స్వరాభాస్కర్ ట్వీట్‌కు స్పందించిన సామీ

ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి..
అలాగే ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని సూచించాడు. ‘నేను నా దేశ ప్రజల గురించి ఆందోళన చెందాలి. భారత్‌కు సాయం చేయడానికి పాకిస్థాన్ ముందుకొచ్చింది. కానీ వారి దేశంలోని ప్రజలను ఆదుకోవాలి. సాయం చేయడానికి ముందుకొచ్చిన వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. కానీ వారు మొదట సరిహద్దు ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి'అని గంభీర్ సూచించాడు.

అఫ్రిది ఆ అల్లా దయ నీకుంది..
కరోనా నుంచి అఫ్రిది త్వరగా కోలుకోంటాడని పాకిస్థాన్ క్రికెట్ టీమ్ హెడ్ కోచ్, కమ్ సెలెక్టర్ మిస్బా ఉల్ హక్ తెలిపాడు. అతను చేసిన సాయమే అతన్ని రక్షిస్తుందన్నాడు. ‘షాహిద్ అఫ్రిదికి ఆ అల్లా దయ ఉంది. అతను త్వరగా కోలుకుంటాడు. విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశం మొత్తం తిరుగుతూ పేద ప్రజలకు సాయం చేశాడు. తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. అతనికేం కాదు'అని తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
అఫ్రిది పాపం పండింది.. అందుకే కరోనా సోకింది!