Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

షేన్‌ వాట్సన్‌ను మోచేతితో ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టలేదు: గంభీర్

Gautam Gambhir reveals On His Altercations With Shane Watson In 2008

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ముక్కోపి అని అందరికి తెలిసిందే. తాను క్రికెట్ ఆడే రోజుల్లో ప్రత్యర్థి ఆటగాళ్లు ఏమాత్రం కవ్వింపులకి దిగినా ఈ ఢిల్లీ ఆటగాడు వారిపైకి దూసుకెళ్లిపోయేవాడు. అలా చాలా మంది ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగాడు. ఆఖరికి ప్రస్తుత భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో కూడా గొడవపడ్డాడు.

ఇక 2008లో ఆస్ట్రేలియాతో జరిగిన ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో ఆ జట్టు ఆల్‌రౌండర్ షేన్‌వాట్సన్‌ను మోచేతితో ఢీకొట్టి ఓ మ్యాచ్ నిషేధానికి కూడా గురయ్యాడు. అయితే ఆ మ్యాచ్‌లో తాను ఉద్దేశపూర్వంగా వాట్సన్‌ను తాకలేదని గంభీర్ తాజాగా చెప్పుకొచ్చాడు.

క్రిస్టన్ చెప్పడంతోనే..

క్రిస్టన్ చెప్పడంతోనే..

నాటి కోచ్ గ్యారీ క్రిస్టన్ చెప్పడంతోనే తాను తప్పు చేసినట్లు ఓప్పుకున్నానని వెల్లడించాడు. స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షో‌లో మాట్లాడుతూ.. నాటి మ్యాచ్ క్షణాలను నెమరువేసుకున్నాడు. మ్యాచ్ రిఫరీ క్రిస్ బోర్డ్‌ ‌‌అని తప్పును అంగీకరిస్తే సానుభూతితో వదిలేస్తాడని క్రిస్టన్ చెప్పాడని, దాంతో తాను తప్పు చేసినట్లు అంగీకరించానన్నాడు. కానీ క్రిస్ బోర్డ్ తనపై ఓ మ్యాచ్ నిషేధం విధించాడని గుర్తు చేసుకున్నాడు.

‘ఆ మ్యాచ్‌లో షేన్‌ వాట్సన్‌ను నేను ఉద్దేశపూర్వంగా ఢీకొట్టలేదు. ఆ మ్యాచ్ తర్వాత నాపై నిషేధం కూడా విధించారు. చాలా మంది నేను కావాలనే వాట్సన్ డొక్కలో మోచేతితో గుద్దానని అనుకున్నారు. కానీ నేను మాత్రం కావాలని అలా చేయలేదు.'అని గంభీర్ స్పష్టం చేశాడు.

ఓ మ్యాచ్ నిషేధం విధించాడు..

ఓ మ్యాచ్ నిషేధం విధించాడు..

‘మ్యాచ్ రిఫరీ ముందు విచారణకు హాజరయ్యేటప్పుడు.. అక్కడ క్రిస్ బోర్డ్ ఉన్నాడని చెబుతూ తప్పును అంగీకరించమని గ్యారీ క్రిస్టన్ చెప్పాడు. సానుభూతితో నిషేధం విధించకుండా వదిలేస్తాడని కూడా అన్నాడు. నేను క్రిస్టన్‌తో కలిసే మ్యాచ్ రిఫరీ ముందుకు వెళ్లా. అతను నీ తప్పును అంగీకరిస్తున్నావా? అని ప్రశ్నించాడు. నేను అవునని సమాధానం ఇచ్చా. వెంటనే అతను నాపై ఓ మ్యాచ్ నిషేధం విధించాడు.'అని గంభీర్ తెలిపాడు.

సుశాంత్ హెలికాప్టర్ షాట్ చూసి ధోనీ ఏమన్నాడో తెలుసా?

గంభీర్ డబుల్ సెంచరీ..

గంభీర్ డబుల్ సెంచరీ..

ఆస్ట్రేలియా 2008 భారత పర్యటనలో ఢిల్లీ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో ఈ వివాదం నెలకొంది. ఆ మ్యాచ్‌ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో గంభీర్(206) డబుల్ సెంచరీతో చెలరేగాడు. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 36 పరుగులతో సరిపెట్టుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. ఈ నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. ఇక 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన గంభీర్.. 2019లో బీజేపీ పార్టీలో చేరి ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే.

అబ్బే.. మా మధ్య గొడవలా?

అబ్బే.. మా మధ్య గొడవలా?

ఇక అదే షోకు గంభీర్‌తో హాజరైన ఇర్ఫాన్ పఠాన్‌ను ఈ ఢిల్లీ ఆటగాడితో ఎప్పుడైన వాగ్వాదం జరిగిందా? అని షో హోస్ట్ ప్రశ్నించాడు. దీనికి అలాంటిదేం లేదని, గంభీర్‌తో ఎప్పుడూ అంత సీరియస్‌గా వాదులాడుకోలేదని పఠాన్ బదులిచ్చాడు. ఇక గంభీర్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు. తాను ఎవరెవరితో వాగ్వాదానికి దిగానో అనే విషయం క్రికెట్ ప్రపంచానికి తెలుసని, మైదానంలో నా గొడవలన్నిటినీ వారు చూశారని ఈ మాజీ ఓపెనర్ చెప్పుకొచ్చాడు. పఠాన్‌తో ఎలాంటి వాగ్వాదం జరగలేదని స్పష్టం చేశాడు. ఇక నాటి మ్యాచ్‌లో షేన్‌వాట్సన్‌కు కూడా 10శాతం మ్యాచ్ ఫీజు కోత విధించారు.

ఏడు నిమిషాల్లోనే టీమిండియాకు కోచ్‌నయ్యా: గ్యారీ క్రిస్టన్‌

Story first published: Tuesday, June 16, 2020, 14:13 [IST]
Other articles published on Jun 16, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+