Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విభేదాలా? రోహిత్ శర్మ‌తో బంధం ఈ రోజుది కాదు: గౌతమ్ గంభీర్

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో తనకు ఉన్న బంధం ఈ రోజు కొత్తగా ఏర్పడింది కాదని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అన్నాడు. తామిద్దరి మధ్య సుదీర్ఘ కాలంగా మంచి రిలేషన్ ఉందని స్పష్టం చేశాడు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నాడు. తామిద్దరం కలిసి టీమిండియాకు ఆడుతున్న రోజుల నుంచే బలమైన బంధం ఉందని చెప్పాడు.

జట్టు అభివృద్ధికి కోచ్, కెప్టెన్ మధ్య బలమైన బంధం ఉండటం చాలా ముఖ్యమని గంభీర్ అభిప్రాయపడ్డాడు. అప్పుడే ఇద్దరూ ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకోగలరని తెలపాడు. తాజాగా జియో‌హాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మతో ఉన్న తన స్నేహం గురించి గంభీర్ ప్రత్యేకంగా మాట్లాడాడు. తమ మధ్య విభేదాలు అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు.

IND vs JPN: ఇషాన్ కిషన్ కళ్లు చెదిరే త్రో.. బిత్తరపోయిన జపాన్ బ్యాటర్!(వీడియో)

IND vs JPN: ఇషాన్ కిషన్ కళ్లు చెదిరే త్రో.. బిత్తరపోయిన జపాన్ బ్యాటర్!(వీడియో)

మా బంధం ఈ రోజుది కాదు..

'రోహిత్ శర్మతో నాకున్న బంధం కేవలం కెప్టెన్, కోచ్‌ల మధ్య ఉండే రిలేషన్ మాత్రమే కాదు. రోహిత్ శర్మ భారత జట్టులోకి వచ్చినప్పుడు నేను సీనియర్ ఆటగాడిగా ఉన్నా. అప్పటి నుంచే మా మధ్య స్నేహం మొదలైంది. రోహిత్‌కు నేను చాలా కాలంగా తెలుసు. నేను విదేశాల నుంచి వచ్చిన కొత్త కోచ్‌ను కాదు. రోహిత్ ఆటను గానీ, వ్యక్తిగతంగా అతను ఎలాంటివాడో గానీ నేను ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మేమిద్దరం కలిసి ఆడాం కాబట్టి, ఒకరి ఆలోచనలను మరొకరం సులువుగా అర్థం చేసుకోగలం.

Gautam Gambhir Opens Up About His Relationship With Rohit Sharma He Knows My Thinking I Know His

భారత క్రికెట్‌‌ అభివృద్ధే మా లక్ష్యం

నా ఆలోచన విధానం అతనికి తెలుసు. అతని ఆలోచనా విధానం నాకు బాగా తెలుసు. కొన్నిసార్లు మా మధ్య భిన్నాభిప్రాయాలు రావచ్చు. కానీ అంతిమంగా జట్టు శ్రేయస్సుకు ఏది మంచిదో అదే తుది నిర్ణయం అవుతుంది. ఇప్పటి వరకు నేను పనిచేసిన కెప్టెన్లందరికీ ఇదే భావన ఉంది.

IND vs JPN: ఓడినా.. వరల్డ్ బెస్ట్ టీమ్‌ను వణికించాం: జపాన్ కెప్టెన్

Also Read

IND vs JPN: ఓడినా.. వరల్డ్ బెస్ట్ టీమ్‌ను వణికించాం: జపాన్ కెప్టెన్

భారత క్రికెట్‌ను తదుపరి స్థాయికి తీసుకెళ్లడమే మా అందరి ఏకైక లక్ష్యం. 'అని గంభీర్ చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మతో తనకు విభేదాలున్నాయనే వాదనను కొట్టిపారేస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ మాటలు..కోహ్లీ, రోహిత్ 2027 వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగుతారనే విషయాన్ని సూచిస్తున్నాయి.

Story first published: Thursday, September 24, 2026, 15:16 [IST]
Other articles published on Sep 24, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+