Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మయాంక్ క్యాచ్ డ్రాప్ కాదు.. అతని బౌలింగే భారత్ ఓటమిని శాసించింది: గౌతమ్ గంభీర్

వెస్టిండీస్ బౌలర్ రోస్టన్ ఛేజ్‌పై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతని అద్భుతమైన బౌలింగ్‌తో వెస్టిండీస్‌తో రెండో టీ20లో టీమిండియా ఓటమిపాలైందని చెప్పాడు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై రోస్టన్ ఛేజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని కొనియాడాడు.

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా రాంచీ వేదికగా శుక్రవారం జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. 250 పరుగుల భారీ లక్ష్యాన్ని 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది.

IND vs WI: ఇవేం పిచ్‌లు రా అయ్యా..రోత పుడుతుంది!

IND vs WI: ఇవేం పిచ్‌లు రా అయ్యా..రోత పుడుతుంది!

రోస్టన్ ఛేజ్‌ది మ్యాచ్ విన్నింగ్ స్పెల్

ఈ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న గౌతమ్ గంభీర్.. భారత్ ఓటమికి రోస్టన్ ఛేజ్ అద్భుతమైన స్పెల్ కారణమని అభిప్రాయపడ్డాడు. క్యాచ్ డ్రాప్స్ అనేవి సహజమని మయాంక్ యాదవ్‌ను వెనకేసుకొచ్చాడు. బ్యాటింగ్ పిచ్‌లతో బౌలర్లు ఇబ్బంది పడుతున్నారని తెలిపాడు.

Gautam Gambhir Blames Roston Chase s Bowling for India s Defeat Not Mayank Yadav s Dropped Catch

'ఈ మ్యాచ్ జరిగిన విధానాన్ని బట్టి చూస్తే.. రోస్టన్ ఛేజ్ వేసిన స్పెల్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. అతనిది మ్యాచ్ విన్నింగ్ స్పెల్. ఈ వికెట్‌పై అతను తన లైన్‌ అండ్ లెంగ్త్‌ను మార్చిన విధానం అమోఘం. ఒకే లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తే బ్యాటర్లు సెట్ అవుతారు. కానీ, రోస్టన్ ఛేజ్ అలా కాకుండా బ్యాటర్ల కాళ్లపైకి, వైడ్‌గా, ఫుల్ లెంగ్త్‌లో బంతులు వేస్తూ తన వ్యూహాన్ని మార్చాడు. ఇలాంటి వికెట్లపై ఆ వైవిధ్యమే చాలా కీలకం.'అని గంభీర్ విశ్లేషించాడు.

IND vs WI: వైభవ్‌తో పాటు ఆ ముగ్గురికి నిరాశే.. వెస్టిండీస్‌తో మూడో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

Also Read

IND vs WI: వైభవ్‌తో పాటు ఆ ముగ్గురికి నిరాశే.. వెస్టిండీస్‌తో మూడో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

క్యాచ్ డ్రాప్స్ సహజం..

మయాంక్ యాదవ్ కీలక క్యాచ్ నేలపాలు చేయడంపై ప్రశ్నించగా.. అది ఏ మాత్రం మ్యాచ్ ఓటమికి కారణం కాదని గంభీర్ అభిప్రాయపడ్డాడు. 'టాస్ అనేది మన చేతుల్లో ఉండదు. క్యాచ్‌లు డ్రాప్ అవ్వడం సహజం. గతంలో కూడా క్యాచ్‌లు డ్రాప్ అయ్యాయి. భవిష్యత్తులోనూ జరుగుతాయి. ఎవరూ కావాలని క్యాచ్‌లను వదిలేయరు. కాబట్టి క్యాచ్‌ డ్రాప్‌లను నిందించడం సరికాదు.'అని గంభీర్ బదులిచ్చాడు.

వెస్టిండీస్ అద్భుతంగా బ్యాటింగ్ చేసిందని గంభీర్ కొనియాడాడు. ఈ విజయానికి వారు పూర్తి అర్హులని చెప్పుకొచ్చాడు. వెస్టిండీస్ లాంటి ప్రమాదకరమైన జట్లపై భారీ స్కోర్లను కాపాడుకునే మార్గాలను తమ జట్టు కనుక్కోవాల్సి అవసరం ఉందన్నాడు. 250 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు.

పిచ్‌పై అసంతృప్తి..

పూర్తిగా బ్యాటింగ్ పిచ్‌ల‌ను తయారు చేయడంపై గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. 'బంతికి, బ్యాట్‌కు మధ్య మంచి పోటీ ఉండాలని అందరం కోరుకుంటున్నాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బౌలర్ల కెరీర్‌లు ప్రమాదంలో పడుతున్నాయి. జట్టులోకి వచ్చేందుకు వారు ఎంతో శ్రమిస్తున్నారు. కానీ, వారి శ్రమ అంతా వృథా అవుతోంది. బంతికి, బ్యాట్‌కు మధ్య మంచి పోటీ ఉన్నప్పుడే అత్యుత్తమ క్రికెట్‌ను మనం చూడగలం.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, October 10, 2026, 14:27 [IST]
Other articles published on Oct 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+