Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: వైభవ్‌తో పాటు ఆ ముగ్గురికి నిరాశే.. వెస్టిండీస్‌తో మూడో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో ఒకటి గెలిచి.. మరొకటి ఓడిన టీమిండియా.. మరో కీలక పోరుకు సిద్దమైంది. ఇండోర్ వేదికగా ఆదివారం జరిగే మూడో టీ20లో పర్యాటక వెస్టిండీస్‌తో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. తొలి టీ20లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన టీమిండియా.. రెండో టీ20లో వెస్టిండీస్ అద్భుత బ్యాటింగ్‌ ప్రదర్శనతో ఖంగుతిన్నది. ఎలాగైనా మూడో టీ20 గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలనే పట్టుదలతో టీమిండియా ఉంది.

మరోవైపు అద్భుత ప్రదర్శనతో రెండో టీ20లో విజయం సాధించిన వెస్టిండీస్.. అదే జోరు కొనసాగించాలనే పట్టుదలతో ఉంది.దాంతో ఈ మూడో టీ20పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మంచుతో పాటు ఆ ఇద్దరే మా ఓటమిని శాసించారు: శ్రేయస్ అయ్యర్

మంచుతో పాటు ఆ ఇద్దరే మా ఓటమిని శాసించారు: శ్రేయస్ అయ్యర్

వైభవ్‌‌ సూర్యవంశీకి నిరాశే

మూడో టీ20లో టీమిండియా కాంబినేషన్‌లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం కనిపించడం లేదు. తొలి రెండు టీ20ల్లో కొనసాగించిన కాంబినేషన్‌తో టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమైన సంజూ శాంసన్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో ఫామ్‌లోకి వచ్చాడు. కాబట్టి వైభవ్ సూర్యవంశీకి మరోసారి నిరాశే ఎదురవ్వనుంది. సిరీస్ గెలిచే వరకు అతను బెంచ్‌కే పరిమితం కానున్నాడు.

IND vs WI India Stick With Unchanged Playing XI for 3rd T20I No Place for Vaibhav Sooryavanshi


నితీష్ కుమార్ రెడ్డికి చోటు..?

మిగతా కాంబినేషన్‌లో కూడా పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్‌నే పేసర్లుగా కొనసాగించనుడగా.. నమన్ ధీర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. అయితే తొలి రెండు టీ20ల్లో నిరాశపర్చిన శివమ్ దూబే స్థానంలో నితీష్ కుమార్ రెడ్డిని తీసుకోవచ్చు. బ్యాట్‌తో పాటు బంతితో తేలిపోతున్న శివమ్ దూబే‌ను పక్కన పెట్టాలనుకుంటే నితీష్ రెడ్డికి అవకాశం దక్కుతుంది. లేదంటే నితీష్‌‌తో పాటు రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్‌లకు మరోసారి నిరాశే ఎదురుకానుంది.

తొలి టీ20లో మయాంక్ యాదవ్ నిరాశపర్చినా.. రెండో టీ20లో ఆకట్టుకున్నాడు. మూడు వికెట్లతో అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. కానీ మిగతా బౌలర్లు ఆశించిన రీతిలో రాణించలేకపోయారు. విపరీతమైన డ్యూ కారణంగా చేతులెత్తేసారు. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేయనుండగా.. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, తిలక్ వర్మ, నమన్ ధీర్, అక్షర్ పటేల్ మిడిలార్డర్‌లో ఆడనున్నారు.

వారి వల్లే ఈ విజయం.. ఈ గెలుపును తలకెక్కించుకోను: వెస్టిండీస్ కెప్టెన్

Also Read

వారి వల్లే ఈ విజయం.. ఈ గెలుపును తలకెక్కించుకోను: వెస్టిండీస్ కెప్టెన్

వెస్టిండీస్‌తో రెండో టీ20కి భారత తుది జట్టు(అంచనా)

సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), శివమ్ దూబే/నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు

వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నమన్ ధీర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్, నితీష్ కుమార్ రెడ్డి.

Story first published: Saturday, October 10, 2026, 10:37 [IST]
Other articles published on Oct 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+