Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అజిత్ భాయ్.. మిమ్మల్ని ఈ చరిత్ర మరువదు: గంభీర్

భారత పురుషుల క్రికెట్ టీమ్ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌పై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. చీఫ్ సెలెక్టర్‌గా అతని సేవలను కొనియాడాడు. ఈ చరిత్ర ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందని ప్రశంసించాడు. అక్టోబర్ 4తో చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ పదవి కాలం ముగిసిన సంగతి తెలిసిందే. అతని పదవి కాలాన్ని పొడగించని బీసీసీఐ.. కొత్త సెలెక్టర్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. సౌత్ జోన్ సెలెక్టర్ ప్రజ్ఞాన్ ఓజా తాత్కలిక చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

IND vs WI: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. తొలి కెప్టెన్‌గా రికార్డ్!

IND vs WI: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. తొలి కెప్టెన్‌గా రికార్డ్!

అజిత్ భాయ్.. మీరు భయపడలేదు..

అజిత్ అగార్కర్ పదవి కాలం ముగిసిన నేపథ్యంలో గంభీర్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఓ భావోద్వేగపూరితమైన పోస్ట్‌ను పంచుకున్నాడు. 'డియర్ అజిత్ భాయ్.. మీతో కలిసి పనిచేయడం గొప్ప గౌరవం. ఈ మూడు ఐసీసీ ట్రోఫీలు మీ దృఢమైన నమ్మకానికి నిదర్శనం.

Gautam Gambhir Bids Farewell to Ajit Agarkar With Emotional Post History Will Be Kinder to You

ఎల్లవేళలా జట్టుకు తొలి ప్రాధాన్యత ఇస్తారు. చరిత్ర మిమ్మల్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకొని గౌరవిస్తుంది. జట్టు ఎంపిక సమయంలో ఎదురైన విమర్శలకూ భయపడలేదు. మీ భవిష్యత్తు మరింత ఉన్నతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా.'అని గౌతమ్ గంభీర్ ట్వీట్ చేశాడు.

చేతన్ శర్మ రాజీనామాతో..

జట్టు అంతర్గత విషయాలను బహిర్గతం చేసిన చేతన్ శర్మ ఆకస్మిక రాజీనామాతో అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతని హయాంలో భారత్ 2024 టీ20 ప్రపంచకప్‌తో పాటు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్‌లను గెలుచుకుంది. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో అనూహ్యంగా ఓటమిపాలైంది. వైట్ బాల్ క్రికెట్‌లో అద్భుత ఫలితాలు సాధించినా.. టెస్ట్‌ల్లో మాత్రం ఘోర పరాజయాలను మూటగట్టుకుంది.

రోహిత్‌తో పెట్టుకున్న అగార్కర్ ఇప్పుడు రిగ్రెట్ అవుతుండొచ్చు: మాజీ క్రికెటర్

Also Read

రోహిత్‌తో పెట్టుకున్న అగార్కర్ ఇప్పుడు రిగ్రెట్ అవుతుండొచ్చు: మాజీ క్రికెటర్

రోహిత్‌తో పెట్టుకోవడంతో..

సొంతగడ్డపై న్యూజిలాండ్, సౌతాఫ్రికా చేతుల్లో సిరీస్‌లు క్లీన్ స్వీప్ అయ్యింది. ఆస్ట్రేలియా చేతిలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓడిపోయింది. 2027 వన్డే ప్రపంచకప్ వరకు అగార్కర్ చీఫ్ సెలెక్టర్‌‌గా కొనసాగుతాడని భావించినా.. రోహిత్ శర్మతో పెట్టుకొని మూల్యం చెల్లించుకున్నాడు. ప్రపంచకప్ ప్రణాళికల నుంచి రోహిత్ తప్పించాలని అగార్కర్ భావించగా.. బీసీసీఐ వ్యతిరేకించింది. దాంతో అతను తన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

Story first published: Wednesday, October 7, 2026, 14:42 [IST]
Other articles published on Oct 7, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+