మ్యాచ్‌కు రూ.1.2 కోట్లు.. బీసీసీఐ స్పాన్సర్‌గా ఏఐ దిగ్గజం చాట్‌జీపీటీ!
ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి)అసోసియేట్ స్పాన్సర్‌షిప్‌ను దిగ్గజ ఏఐ ఫ్లాట్‌ఫామ్ చాట్‌జీపీటీ దక్కించుకుంది. సొంతగడ్డపై జరిగే భారత ద్వైపాక్షిక మ్యాచ్‌లకు చాట్‌జీపీటీ అసోసియేట్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది.
మ్యాచ్‌కు రూ.1.2 కోట్లు చెల్లించేలా ఈ ప్రముఖ ఏఐ ఫ్లాట్‌ఫామ్ బీసీసీఐతో డీల్ కుదుర్చుకుంది. 2028 మార్చి వరకు భారత్ వేదికగా జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లకు చాట్‌జీపీటీ అసోసియేట్ పార్ట్‌నర్‌గా వ్యవహరించనుంది. చాట్‌జీపీటీతో పాటు రిలయన్స్‌కు చెందిన క్యాంపా కోలా, ఎస్‌బీఐ లైఫ్ కూడా అసోసియేట్ పార్టనర్ డీల్స్‌ను సొంతం చేసుకున్నాయి.
బిస్లరీ, ఐఓసీ ఔట్..
ఈ అసోసియేట్ పార్టనర్ ఎంపికకు సంబంధించి బీసీసీఐ నిర్వహించిన వేలం హోరాహోరీగా సాగినట్లు తెలుస్తోంది. ఈ వేలంలో క్యాంపా కోలా ఒక్కో మ్యాచ్‌కు రూ.1.31 కోట్లతో వేలంలో అగ్రస్థానంలో నిలిచింది. బిస్లరీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లను రూ.1.2 కోట్ల వరకు వేలం వేసినా క్యాంపా కోలా దెబ్బకు వెనుకంజలో నిలిచాయి. చాట్‌జీపీటీ, ఎస్‌బీఐ లైఫ్ రూ.1.2 కోట్ల బిడ్‌తో స్పాన్సర్‌షిప్ డీల్స్‌ను సొంతం చేసుకున్నాయి.

బీసీసీఐకి బిగ్ డీల్ కాదు.. కానీ
ఈ 'అసోసియేట్ పార్ట్‌నర్' ప్యాకేజ్ అనేది బోర్డుకు అంత కీలకమైన డీల్ ఏం కాదు. టైటిల్ స్పాన్సర్‌షిప్ బీసీసీఐకి ప్రధానమైనది. కానీ గత టైటిల్ స్పాన్సర్‌షిప్ డీల్ ఆగస్ట్ 2026లోనే ముగిసింది. టైటిల్ స్పాన్సర్ వేట ఆలస్యమవుతోందని గ్రహించిన బీసీసీఐ.. ముందుగా అసోసియేట్ పార్ట్‌నర్స్‌ను ఎంపిక చేసింది. టైటిల్ స్పాన్సర్ కోసం మరోవైపు చర్చలు కొనసాగిస్తూనే.. స్పాన్సర్‌షిప్ ఆదాయం తగ్గిపోకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించింది.
క్రికెట్ మ్యాచ్‌ల ప్రసారాల్లో కూల్ డ్రింక్స్, ఇన్సూరెన్స్ కంపెనీల యాడ్స్ కనిపించడం సాధారణ విషయమే. కానీ ఒక AI ప్లాట్‌ఫామ్ ప్రకటనల కోసం మ్యాచ్‌కు రూ.1.2 కోట్లు చెల్లించేందుకు ముందుకు రావడం చర్చనీయాంశమైంది. ఏఐ రంగంలో భారత్‌ను శాసించాలనే లక్ష్యంతో చాట్‌జీపీటీ ఈ డీల్ కుదుర్చుకున్నట్లు అర్థమవుతుంది. అసోసియేట్ పార్ట్‌నర్స్ దొరికినా.. బీసీసీఐ ముందున్న అతిపెద్ద సవాల్ టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను ఎంచుకోవడమే. ఈ మూడు బ్రాండ్స్ చెల్లించిన కంటే మొత్తాన్ని టైటిల్స్ స్పాన్సర్ చెల్లించాల్సి ఉంటుంది. టైటిల్స్ స్పాన్సర్ ద్వారా వచ్చే ఆదాయం బోర్డుకు అత్యంత కీలకం.
3 విభాగాలుగా బీసీసీఐ స్పాన్సర్‌షిప్స్..
బీసీసీఐ తమ స్పాన్సర్‌షిప్ స్ట్రక్చర్‌ను ప్రధానంగా మూడు విభాగాలుగా విభజించింది. మొదటిది టైటిల్ స్పాన్సర్. ఇది బీసీసీఐ ప్రధాన స్పాన్సర్‌షిప్. సిరీస్, మ్యాచ్‌లకు ఈ స్పాన్సర్ పేరే ప్రధానంగా ఉంటుంది. అయితే టైటిల్ స్పాన్సర్ ఒకే బ్రాండ్‌కు మాత్రమే ఇస్తారు. రెండోది అఫీషియల్ జెర్సీ పార్టనర్. ఆటగాళ్ల జెర్సీలపై కనపించే బ్రాండ్. మూడోది అసోసియేట్ పార్ట్‌నర్లు. మైదానంలోని బౌండరీ బోర్డులు, డిజిటల్ స్క్రీన్లు, పోస్ట్-మ్యాచ్ ప్రెజెంటేషన్ బ్యాక్‌డ్రాప్‌లో కనిపించే బ్రాండ్స్.
అయితే టైటిల్ స్పాన్సర్‌షిప్, అసోసియేట్ స్పాన్సర్‌షిప్స్ డీల్స్ బీసీసీఐ ఒకేసారి పూర్తి చేస్తుంది. కానీ ఈ సారి మాత్రం విభిన్నంగా అసోసియేట్ పార్ట్‌నర్స్‌ను ఎంచుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


