అందుకే భారత ఆటగాళ్లకు తరుచూ గాయాలు: బీసీసీఐ సెక్రటరీ
తీరిక లేని షెడ్యూల్ కారణంగానే భారత ఆటగాళ్లు తరుచూ గాయపడుతున్నారని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. ఆటగాళ్ల గాయాల విషయంలో టీమిండియా మేనేజ్‌మెంట్‌కు, సీఓఈ మధ్య సమన్వయ లోపం ఏది లేదన్నారు. బీసీసీఐలోని అన్ని విభాగాలు భారత క్రికెట్ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నాయని తెలిపారు. ఆటగాళ్లపై వర్క్‌లోడ్ తగ్గించేందుకు చర్యలు చేపడుతామని, ఓవర్‌సీస్ టూర్స్ కోసం మరింత ప్రణాళికబద్దంగా వ్యవహరిస్తామని తెలిపారు.
గత కొద్ది రోజులుగా టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాతో పాటు హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ తరుచూ గాయాల బారిన పడ్డారు. గాయాల నుంచి కోలుకోని బరిలోకి దిగిన కొన్ని మ్యాచ్‌ల్లోనే మళ్లీ గాయపడి జట్టుకు దూరమయ్యారు. ఈ గాయాలు జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపాయి. దాంతో సీఓఈ, టీమిండియా మేనేజ్‌మెంట్ మధ్య సమన్వయలోపం ఉందనే వార్తలు వచ్చాయి.
మ్యాచ్ సంఖ్య పెరగడంతోనే..
ఈ నేపథ్యంలోనే ఇటీవల టీమిండియా ప్రదర్శనపై గురువారం బీసీసీఐ సమీక్షా సమావేశం జరిగిన అనంతరం దేవజిత్ సైకియా మీడియాతో మాట్లాడారు. ' మ్యాచ్‌ల సంఖ్య పెరిగిపోవడంతోనే ఆటగాళ్లు తరుచూ గాయాలపాలవుతున్నారు. ఈ సమస్యను తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలపై దృష్టిపెట్టాం. అలాగే సేనా(సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్) పర్యటనకు వెళ్లినప్పుడు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఉండేలా చూస్తాం.

సమీక్ష సమావేశంలో కెప్టెన్ల నుంచి ఆటగాళ్లకు ఏం కావాలన్న దానిపై సమాచారం తీసుకున్నాం. అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతాం. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో సిరీస్‌లు చేజారడంపై సమీక్షించాం. ఇకపై సేన దేశాల పర్యటనకు వెళ్లినప్పుడు మరింత ప్రణాళిక బద్దంగా వ్యవహరిస్తాం.'అని దేవజిత్ సైకియా పేర్కొన్నాడు.
అందుకే అగార్కర్ రాలేదు..
ఈ సమావేశానికి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ హాజరకాకపోవడం పలు సందేహాలకు తావిచ్చింది. అయితే అగార్కర్ అందుబాటులో లేకపోవడంతోనే ఈ సమావేశానికి రాలేదని సైకియా స్పష్టం చేశాడు. అతనికి ఆలస్యంగా సమాచారమిచ్చామని, అతను ముంబైలో లేకపోవడంతోనే రాలేకపోయాడని తెలిపాడు. అజిత్ అగార్కర్ పదవి కోసం అక్టోబర్ 4న ముగియనుండగా.. అతని పొడగింపు ఉంటుందా? అనే ప్రశ్నకు.. దాని గురించి చర్చ జరగలేదని సైకియా బదులిచ్చాడు. బీసీసీఐ క్రికెట్ డైరెక్టర్‌గ వీవీఎస్ లక్ష్మణ్‌ను నియమించబోతున్నారనే ప్రచారాన్ని కూడా సైకియా కొట్టిపారేశారు.
రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై కొంత కాలంగా సాగుతున్న ఊహాగానాలకు కూడా దేవజిత్ సైకియా తెరదించారు. రోహిత్ బాగా ఆడుతున్నాడని, అతని నుంచి ఇంకేం ఆశిస్తామని తెలిపాడు. 'రోహిత్ శర్మ అన్ని మ్యాచ్‌ల్లో బాగా ఆడుతున్నాడు. అంతకంటే ఏం కావాలి? చివరగా ఇంగ్లండ్‌పై 138 పరుగులు చేశాడు. అలాంటప్పుడు రోహిత్ రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు ఎందుకు? ఈ వార్తలకు ఊతమివ్వాలని నేను అనుకోవడం లేదు.'అని సైకియా తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

