న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ రిటైర్మెంట్ నిర్ణయించడానికి మీరు ఎవరయ్యా?: టీమిండియా మాజీ కోచ్

Gary Kirsten Says No one should dictate to MS Dhoni over retirement rumours

న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ వ్యవహారంపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ టీమిండియా వరల్డ్‌కప్ విన్నింగ్ కోచ్ గ్యారీ క్రిస్టన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అసలు ధోనీ రిటైర్మెంట్‌ను నిర్ణయించడానికి మీరు ఎవరని విమర్శకులను ప్రశ్నించాడు. ధోనీ ఈ తరం అత్యుత్తమ ఆటగాడని కొనియాడిన ఈ సౌతాఫ్రికా మాజీ క్రికెటర్.. రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకొనే అధికారం మహీకే ఉందని ఆ విషయాన్ని అతనికే వదిలేయాలన్నాడు.

#DhoniRetires ట్రెండ్..

#DhoniRetires ట్రెండ్..

ఇక బుధవారం #DhoniRetires అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్‌మీడియాలో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. ఈ కల్పిత వార్తలపై ధోనీ సతీమణి సాక్షిసింగ్ కూడా అసహనం వ్యక్తం చేసింది. ధోనీ రిటైర్మెంట్ కేవలం రూమర్ మాత్రమేనని.. ఈ లాక్‌డౌన్‌లో ప్రజల మతిభ్రమించిందని ఘాటుగా ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్‌పై అభ్యంతరాలు రావడంతో వెంటనే దాన్ని తొలగించింది. కానీ అప్పటికే ఆ ట్వీట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ వైరల్ అయ్యాయి.

వారిని చంపేయాలనేంత కసిని పెంచుకున్నా: శ్రీశాంత్

#DhoniNeverTires‌తో ఫ్యాన్స్ కౌంటర్..

#DhoniNeverTires‌తో ఫ్యాన్స్ కౌంటర్..

మరోవైపు ధోనీ అభిమానులు, చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియా కూడా #DhoniNeverTires అనే యాష్ ట్యాగ్‌ను సృష్టించి ట్రెండ్ చేస్తున్నారు. ధోనీ త్వరలోనే రీ ఎంట్రీ ఇస్తాడని అతని విమర్శకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ధోనీ రిటైర్మెంట్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన గ్యారీ క్రిస్టన్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ విమర్శకులపై మండిపడ్డాడు.

ఆ లక్షణాలే అతన్ని ప్రత్యేకంగా..

ఆ లక్షణాలే అతన్ని ప్రత్యేకంగా..

‘ఎంఎస్ ధోనీ అత్యద్భుతమైన క్రికెటర్. అతని తెలివి, ప్రశాంతత, శక్తి, వేగం, మ్యాచ్ విన్నింగ్ పెర్ఫెమెన్స్.. తదితర లక్షణాలన్నీ ఈ తరం ఆటగాళ్లలో ధోనీని ప్రత్యేకమైన, అత్యుత్తమమైన ఆటగాడిగా నిలబెడుతాయి. ఆట నుంచి ఎప్పుడు తప్పుకోవాలో నిర్ణయం తీసుకొనే అధికారం ధోనీకి ఉంది. ఆ హక్కును అతను సంపాదించుకున్నాడు. ఈ విషయాన్ని అతనికి ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ ఆడటం ఓ సవాల్‌తో కూడుకున్నది. భారత జట్టుకు కోచ్ వ్యవహరించడం నాకు చాలా నచ్చుతుంది. అది నా జీవితంలో నాకు దక్కిన గొప్ప గౌరవం.'అని కిర్‌స్టన్ తెలిపాడు. గ్యారీ కిరస్టన్ పర్యవేక్షణలోనే మహేంద్రసింగ్ ధోనీ నేతృత్వంలో భారత జట్టు 2011 ప్రపంచకప్ గెలుచుకున్న విషయం తెలిసిందే.

రీఎంట్రీని అడ్డుకున్న కరోనా..

రీఎంట్రీని అడ్డుకున్న కరోనా..

ఇంగ్లండ్ వేదికగా గతేడాది జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ తర్వాత ఎంఎస్ ధోనీ క్రికెట్‌కి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. దాదాపు 11 నెలలు గడిచినా.. మహీ మైదానంలోకి దిగలేదు. తొలుత రెండు నెలల పాటు ధోనీ సెలవులో ఉంటాడని ప్రకటించినా.. ఆ తర్వాత కూడా అతను జట్టులో చేరలేదు. ఇక సెలక్షన్‌కు కూడా అందుబాటులో లేకపోవడం, ఎలాంటి క్రికెట్ ఆడకపోవడంతో బీసీసీఐ అతని సెంట్రల్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. ఇక ఐపీఎల్‌ 2020 సీజన్‌తో రీఎంట్రీ ఇవ్వాలని ధోనీ భావించినా కరోనా అతనిపై ఆశలపై నీళ్లు చల్లింది. ఈ మహమ్మారి కారణంగా లీగ్ నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.

ఖబర్దార్ అఫ్రిది.. త్వరలోనే పీఓకేను స్వాధీనం చేసుకుంటాం

Story first published: Thursday, May 28, 2020, 18:27 [IST]
Other articles published on May 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X