వాడితోనే పాకిస్థాన్ జట్టు నాశనం.. నా జీతం కూడా ఇవ్వలేదు: మాజీ కోచ్ జేసన్ గెలెస్పీ
పాకిస్థాన్ చీఫ్ సెలెక్టర్ అకిబ్ జావేద్ కారణంగానే ఆ జట్టు నాశనమైందని మాజీ కోచ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జేసన్ గిలెస్పీ ఆరోపించాడు. అన్నింట్లో పెత్తనం చెలాయించి పాకిస్థాన్ జట్టుకు తీవ్ర నష్టం చేశాడని మండిపడ్డాడు. తనను కూడా అగౌరవపరిచి కోచింగ్‌పైనే విరక్తి కలిగించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు పీసీబీ కూడా కోచ్‌గా తన జీతాన్ని పూర్తిగా చెల్లించలేదని పేర్కొన్నాడు.
2024లో పాకిస్థాన్ టెస్ట్ కోచ్‌గా జేసన్ గిలెస్పీ పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే తన పదవి కాలం పూర్తి కాకముందే అతను ఈ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు తీవ్ర సంక్షోభం ఎదుర్కుంటుంది. ఈ పరిస్థితికి మాజీ కోచ్‌లే కారణమని అకిబ్ జావేద్ ఆరోపించాడు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గిలేస్సి.. అతనిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు.

'అకిబ్ జావేద్‌ను చీఫ్ సెలెక్టర్‌గా నియమించడంతోనే పాకిస్థాన్ జట్టుకు ఈ గతి పట్టింది. అతను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే పాకిస్థాన్ క్రికెట్‌తో నాకున్న సంబంధం పూర్తిగా మారిపోయింది. ప్రతీ విషయంలోనూ ఆయన పెత్తనమే కొనసాగింది. టెస్ట్ బాధ్యతలు చూడటం, ఆటగాళ్లు, సిబ్బంది పర్యవేక్షించడం, జట్టు ఎంపిక ప్రతీ విషయంలోనూ అతనే జోక్యం చేసుకున్నాడు. అది నన్ను తీవ్రంగా నిరాశపర్చింది. కోచింగ్‌పై విరక్తి కలిగించింది. అది నాపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపింది. నన్ను నేను సందేహించుకునేలా చేసింది.
అకిబ్ జావేద్ నాకు ఏ మాత్రం గౌరవం ఇవ్వలేదు. అతనికి బోర్డు మద్దతు ఉండటంతో ఎవరూ ఏమి చేయలేరని విర్రవీగుతున్నాడు. ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలను చూస్తుంటే చాలా బాధగా ఉంది. దీనికి అసలు కారకుడు అకిబ్ జావేద్. అతను అక్కడ ఉన్నంత కాలం పాకిస్థాన్ క్రికెట్ బాగుపడదు. కోచ్‌లకు స్వేచ్ఛనిస్తేనే పాక్ క్రికెట్ బాగుపడుతుంది.
పీసీబీ నాకు ఇంకా వేల డాలర్లు బాకీ ఉంది. కానీ నేను ఎప్పటికీ లవంచేవాడిని కాను. నా సూత్రాల విషయంలో నేను రాజీపడను. నా కెరీర్ మొత్తంలో ఎప్పుడూ అలా చేయలేదు. భవిష్యత్తులోనూ అలా చేయను.'అని జేసన్ గిలేస్పీ చెప్పుకొచ్చాడు. మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ వరుసగా రెండు టెస్ట్‌ల్లో ఘోర పరాజయాలను మూటగట్టుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


