మా గెలుపుకు అదే కారణం.. మేం అందులో మెరుగవ్వాలి : కోహ్లీ

ఆక్లాండ్ : మిడిల్ ఓవర్లలో న్యూజిలాండ్ జోరుకు బ్రేక్‌లు వేయడంతోనే విజయం సాధించామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ 6 వికెట్లతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు వారాల కివీస్ పర్యటనను ఘనంగా ఆరంభించింది. మ్యాచ్ అనంతరం ఈ విజయంపై కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేసిన బౌలర్లను కొనియాడాడు.

టూర్ మొత్తానికి కావాల్సిన ఉత్సాహాన్నిచ్చింది
‘రెండు రోజుల క్రితమే ఇక్కడికి వచ్చినకు మాకు ఈ భారీ విజయం సంతోషాన్నిచ్చింది. టూర్ మొత్తానికి కావాల్సిన ఉత్సాహాన్నిచ్చింది. మైదానంలో మాకు లభించిన మద్దతు అద్భుతం. 80 శాతం భారత అభిమానులు మైదానానికి వచ్చి మద్దతు తెలుపడం గొప్ప విషయం.
200 పై చిలుకు టార్గెట్‌లను ఛేదించే క్రమంలో పార్ట్‌నర్ షిప్, ధైర్యంగా ఆడటం చాలా అవసరం. ఆస్ట్రేలియాపై అద్భుత విజయాన్నందుకున్న మేం అదే ఆత్మవిశ్వాసంతో ఇక్కడికి వచ్చాం. ఈ తరహా పిచ్‌పై పరుగులు నియంత్రించడం కష్టం. మిడిల్ ఓవర్లలో మేం అద్భుతంగా ఆడాం. న్యూజిలాండ్‌ను 210లోపు కట్టడి చేశాం. ఇది మా విజయానికి కలిసొచ్చింది. ఇక మా ఫీల్డింగ్‌ను మెరుగుపరుచుకోవాలి.'అని కోహ్లీ తెలిపాడు.
రోహిత్.. నువ్వు నీ క్యాచ్ కేక.. (వీడియో)

సాకు కోసం కాదు..
టైట్ షెడ్యూల్‌ను ప్రస్తావించింది ఓటమికి సాకు చూపేందుకు కాదని కోహ్లి స్పష్టం చేశాడు. ‘మేం తీవ్రంగా అలసిపోయామని ఎప్పుడూ చెప్పలేదు. ఇక దాన్ని ఓ సాకుగా చూపించి తప్పించుకునే ప్రయత్నం చేయలేదు.'టైట్ షెడ్యూల్ నేపథ్యంలో వచ్చిన విమర్శలకు కోహ్లీ కౌంటర్ ఇచ్చాడు.
ఆస్ట్రేలియా ఓపెన్ : అయ్యో.. ఒసాకా ఓడిపోయావా !

అలవోకగా..
ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ నిర్దేశించిన 204 పరుగుల భారీ టార్గెట్‌ను ఓ ఓవర్ మిగిలి ఉండగానే భారత్ ఛేదించింది. రోహిత్ శర్మ(7) విఫలమైనా కేఎల్ రాహుల్(27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 56), విరాట్ కోహ్లి( 32 బంతుల్లో 3ఫోర్లు, 1 సిక్స్‌తో 45), శ్రేయస్ అయ్యర్( 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58 నాటౌట్) లు రాణించడంతో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండో టీ20 ఆదివారం జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications