
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్‌లో 15 ఏళ్ల అమెరికా సంచలనం కోరి గాఫ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఏడు గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత వీనస్ విలియమ్స్‌ను తొలి రౌండ్‌లోనే మట్టికరిపించిన ఈ అమెరికా టీనేజ్ గర్ల్.. తాజాగా డిఫెండింగ్ చాంపియన్ నవోమి ఒసాకాకు షాకిచ్చింది.
శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్‌లో గాఫ్ 6-3,6-4తో వరల్డ్ నెంబర్ 3 ఒసాకా(జపాన్) వరుస సెట్లలో విజయం సాధించి నాలుగో రౌండ్‌కు ప్రవేశించింది. ఈ గెలుపుతో గతేడాది యూఎస్ ఓపెన్ వేదికగా ఒసాకా ఎదురైన పరాభావానికి గాఫ్ ప్రతీకారం తీర్చుకుంది.
గంటా 32 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో గాఫ్ ఆద్యాంతం ఆకట్టుకుంది. హోరాహోరిగా సాగిన తొలి సెట్‌లో తొలి గేమ్‌ను గెలచుకొని ఆధిక్యంలో నిలిచిన గాఫ్.. అదే జోరును కొనసాగిస్తూ 6-3తో సెట్‌ను సొంతం చేసుకుంది. సెకండ్ సెట్‌లో ఓదశలో 2-1తో వెనుకంజలో నిలిచిన అమెరికా టీనేజ్ గర్ల్.. ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి రేసులోకి దూసుకొచ్చింది. అనంతరం వరుస గేమ్‌లు గెలిచి సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంపై గాఫ్ సంతోషం వ్యక్తం చేసింది.
ఇక ఆస్ట్రేలియా ఓపెన్‌లో తొలిసారి ఆడుతున్న గాఫ్ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటుంది. తొలి రౌండ్‌లో 7-6(5),6-3తో దిగ్గజ ప్లేయర్ వీనస్ విలియమ్స్‌ను ఓడించిన గాఫ్ రెండో రౌండ్‌లో 4-6, 6-3, 7-5తో క్రిస్టీ (రొమేనియా)ను ఓడించి మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది.
సెరీనాకు చుక్కెదురు...
గతంలో ఏడు సార్లు చాంపియన్‌గా నిలిచిన సెరీనా విలియమ్స్‌కు మూడవ రౌండ్‌లో చుక్కెదురైంది. చైనాకు చెందిన వాంగ్ కియాంగ్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. రెండు గంటల 43 నిమిషాల పాటు జరిగిన ఈ హోరాహోరి పోరులో వాంగ్ కియాంగ్ 6-4, 6-7, 7-5 తేడాతో సెరెనాను ఓడించింది. ఫలితంగా అత్యధికంగా సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను గెలుచుకున్న మార్గరెట్ కోర్టు రికార్డును సమం చేసేందుకు సెరీనా విలియమ్స్ మరో గ్రాండ్ స్లామ్ టోర్నీ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.