For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్.. నువ్వు నీ క్యాచ్ కేక.. (వీడియో)

IND VS NZ 2020,1st T20I : Rohit Sharma Takes A Stunning Catch To Dismiss Martin Guptill
Rohit Sharma stunner sends Martin Guptill back

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత క్యాచ్‌తో ఔరా అనిపించాడు. బ్యాట్‌తో బంతులను అలవోకగా బౌండరీలు ధాటించే హిట్ మ్యాన్.. ఫీల్డింగ్‌లో సూపర్ మ్యాన్‌ను తలపించాడు. శివం దూబే వేసిన 8వ ఓవర్‌ ఐదో బంతికి మార్టిన్‌ గప్టిల్‌ డీప్‌ స్వ్కేర్‌ లెగ్‌ మీదుగా భారీ షాట్‌ కొట్టాడు. అయితే అక్కడే బౌండరీ దగ్గర ఫీల్డింగ్‌ చేస్తున్న రోహిత్‌ శర్మ అదుపు తప్పకుండా అద్భుతంగా అందుకున్నాడు.

బంతి గమనాన్ని అంచనా వేసిన రోహిత్‌.. అదే సమయంలో బౌండరీ లైన్‌ తొక్కకుండా సమన్వయపరుచుకున్న తీరు అత్యుద్భుతం. బౌండరీ లైన్‌ తాకే క్రమంలో బంతిని మైదానంలోకి మెల్లగా విసిరిన రోహిత్.. మళ్లీ తిరగొచ్చి అంతే వేగంతో ఒడిసి పట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ఈ క్యాచే హైలైట్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ క్యాచ్‌తో శివమ్ దూబే అవే సిరీస్‌ల్లో వికెట్ల ఖాతా తెరిచాడు.

ఇక ఈ సూపర్ మ్యాన్ క్యాచ్‌తో హిట్ మ్యాన్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 'రోహిత్ నువ్వు.. నీ క్యాచ్ కేక' అని ఒకరంటే.. బ్యాటింగ్ అయినా.. ఫీల్డింగైనా రోహిత్‌కు సాటిలేరవ్వరని ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు. టీవీల్లో వచ్చిన ఈ క్యాచ్ రిప్లేను మొబైల్‌లో షూట్ చేసి ట్వీట్ చేస్తున్నారు.

ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కోహ్లీసేన ముందుగా ఫీల్డింగ్‌ తీసుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు గప్టిల్‌- మున్రోలు శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరూ రన్‌రేట్ పది తగ్గకుండా స్కోరు బోర్డును పరుగెత్తించారు. భారీ సిక్సర్లతో భారత్‌ బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగారు. స్టేడియం చిన్నది కావడం.. పైగా బ్యాటింగ్ పిచ్ కావడంతో ఆతిథ్య బ్యాట్స్‌మన్‌కు బౌండరీలు బాదడం సులువైంది. మధ్యలో భారత బౌలర్లు వికెట్లు తీసినా ఆతిథ్య జట్టు జోరు ఆగలేదు.

గప్టిల్‌(30) పెవిలియన్‌ చేరినా.. మున్రో(59) వరుస బౌండరీలతో చెలరేగాడు. ఈ క్రమంలో 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అర్థ శతకం సాధించాడు. అయితే ధాటిగా ఆడే క్రమంలో పేసర్ శార్దూల్ ఠాకూర్ వేసిన 12వ ఓవర్ చివరి బంతికి క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే భారీ హిట్టర్ కోలిన్ డి గ్రాండ్‌హోమ్ డకౌట్ కాగా.. రాస్ టేలర్(54 నాటౌట్) అండతో కెప్టెన్ కేన్ విలియమ్సన్‌(51) విరుచుకుపడటంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసింది.

Story first published: Friday, January 24, 2020, 14:29 [IST]
Other articles published on Jan 24, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+