Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2026: బంగ్లాదేశ్‌పై విజయం.. పాకిస్థాన్‌కు కాంస్యం!

ఆసియా గేమ్స్ 2026లో పాకిస్థాన్ మహిళల క్రికెట్ టీమ్ బ్రాంజ్ మెడల్ సాధించింది. బంగ్లాదేశ్‌తో మంగళవారం జరిగిన కాంస్య పోరులో సమష్టిగా రాణించిన పాకిస్థాన్ 31 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ మహిళల టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 145 పరుగులు చేసింది.

భారత్ X జపాన్ ఏకైక టీ20కి అంతరాయం!

భారత్ X జపాన్ ఏకైక టీ20కి అంతరాయం!

కెప్టెన్ ఫాతిమా సనా(30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45), గుల్ ఫెరోజా(23 బంతుల్లో 6 ఫోర్లతో 31), అలియా రైజ్(22 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 25), షావాల్ జుల్ఫికర్(27 బంతుల్లో 17) డబుల్ డిజిట్ స్కోర్ చేయగా.. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో నహిదా అక్తర్(2/21), షోర్నా అక్తర్(2/16), రితు మోని(2/27) రెండేసి వికెట్లు తీయగా.. సంజిదా అక్తర్(1/28) ఒక వికెట్ పడగొట్టింది.

Pakistan Women Beat Bangladesh to Win Bronze Medal at Asian Games 2026

అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 114 పరుగులు చేసి ఓటమిపాలైంది. షార్మిన్ అక్తర్(45 బంతుల్లో 4 ఫోర్లతో 46 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. కెప్టెన్ నిగర్ సుల్తాన(30 బంతుల్లో 3 ఫోర్లతో 25) జిడ్డుగా ఆడింది. పాకిస్థాన్ బౌలర్లలో ఉమ్ ఈ హని(3/10) మూడు వికెట్లతో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించగా.. తస్మియా రుబాబ్, ఫాతిమాసనా, నష్రా సంధు, ఆయేషా జఫార్ తలో వికెట్ తీసారు.

Asian Games 2026: వైభవ్ సూర్యవంశీని ఊరిస్తున్న చారిత్రాత్మక రికార్డ్!

Also Read

Asian Games 2026: వైభవ్ సూర్యవంశీని ఊరిస్తున్న చారిత్రాత్మక రికార్డ్!

సెమీఫైనల్లో శ్రీలంక చేతిలో పాకిస్థాన్, భారత్ చేతిలో బంగ్లాదేశ్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. కాంస్య పోరులో గెలిచిన పాకిస్థాన్ మూడో స్థానంలో నిలిచింది. భారత్, శ్రీలంక మధ్య ఫైనల్ జరుగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

గెలిపించిన ఫాతిమా సనా..

పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా చేసిన 45 పరుగులు ఆ జట్టుకు విజయాన్నందించాయి. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఫాతిమా సనా.. టెయిలండర్లతో కలిసి విలువైన భాగస్వామ్యాన్ని అందించింది. బౌలింగ్‌లో ఉమ్ ఈ హని తీన్మార్ బౌలింగ్‌తో బంగ్లా పతనాన్ని శాసించింది.

Story first published: Tuesday, September 22, 2026, 10:55 [IST]
Other articles published on Sep 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+