న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీసీసీఐ.. ధోనీ మాకు కావాలి.. టీ20 ప్రపంచకప్ ఆడాలి!!

Fans react as BCCI shares MS Dhonis throwback picture

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ వన్డే వరల్డ్‌కప్ ఓటమి అనంతరం మైదానానికి దూరమైన విషయం తెలిసిందే. సుమారు 8 నెలల పాటు బ్యాట్‌ పట్టని మహీ.. ఐపీఎల్ 2020 సీజన్‌ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ సెషన్‌లో మాత్రం పాల్గొన్నాడు.

తనకు నచ్చినట్టు..

ఈ 8 నెలల ఖాళీ సమయంలో తనకు నచ్చినట్టు ఉన్న ధోనీ.. తొలి రెండు నెలలు ఆర్మీ జవాన్‌గా పనిచేసి సైనికుడిగా సేవలందించాలనే కోరికను తీర్చుకున్నాడు. అనంతం జనవరి వరకు క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలు అడగవద్దని మీడియాకు సూచించాడు. కుటుంబంతో విహారయాత్రలు చేస్తూ వైల్డ్‌గ్రాఫ్ ఫొటోగ్రాఫర్.. రైతుగా ఇలా తన అభిరుచిలన్నిటినీ తీర్చుకున్నాడు.

సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన వార్నర్ మేనేజర్

భవితవ్యంపై తీవ్ర చర్చ..

ఈ నేపథ్యంలోనే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాడు. దీంతో ధోనీ కథ ముగిసిందని, ఇక పునరాగమనం కష్టమేననే ప్రచారం ఊపందుకుంది. ఐపీఎల్‌తోనే అతని భవితవ్యం తేలనుందనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ ఇవేవి పట్టించుకోని ఈ జార్ఖండ్ డైనమైట్.. ఐపీఎల్ సమీపిస్తుందనగా జార్ఖండ్ జట్టుతో చేరి ప్రాక్టీస్ మొదలు పెట్టాడు.

టీమిండియాకు ఇద్దరు కెప్టెన్లు అవసరమా? పరిమిత ఓవర్ల పగ్గాలు రోహిత్‌కు ఇవ్వాలా?

పాడు కరోనా..

చెన్నై సూపర్ కింగ్స్ శిక్షణ శిభిరంలో పాల్గొని తన ఆటకోసం పరితపిస్తున్న అభిమానులను అలరించాడు. ఇక మార్చి 29న గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడనగా.. పాడు కరోనా అభిమానులను ఆశలపై నీళ్లు చల్లింది. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా క్యాష్ రిచ్ లీగ్ ఏప్రిల్ 15కు వాయిదా పడింది. అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతుందో లేదోననే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో ధోనీ భవితవ్యంపై మరోసారి గందరగోళం నెలకొంది. ధోనీ రీ ఎంట్రీ కష్టమేనని సెహ్వాగ్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు కామెంట్ చేయడం మహీ ఫ్యాన్స్‌కు మింగుడు పడటం లేదు.

బీసీసీఐ షేక్..

అయితే అనూహ్యంగా బీసీసీఐ గురువారం ధోనీ నవ్వుతూ ఉన్న ఫొటోను ట్వీట్ చేసింది. దీనికి ‘నవ్వడం మార్గం'అనే క్యాప్షన్ ఇచ్చింది. ఇంకేముంది ధోనీ రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న అభిమానులు బీసీసీఐ ట్విటర్ హ్యాండిల్‌పై కామెంట్లతో దండయాత్ర మొదలుపెట్టారు. ‘మాకు ధోనీ కావాలి.. వీ వాంట్ మహీ.. మీరేం అన్నా చేసుకోండి ధోనీ పునరాగమనం చేయాల్సిందే.. భారత జట్టులో ఉండాల్సిందే.'అనే కామెంట్లతో తమ అభిమానాన్నిచాటుకుంటున్నారు. టీ20 ప్రపంచకప్ జట్టులో మహీ ఉండాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

Story first published: Thursday, March 19, 2020, 19:55 [IST]
Other articles published on Mar 19, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X