ఆ రోజు కోహ్లీ మొండి పట్టుదలతో ఎవరైనా చనిపోతారనుకున్నా: ఫాఫ్ డుప్లెసిస్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మొండి పట్టుదల గురించి సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ రోజు మైదానంలో కోహ్లీ పంతానికి ఎవరైనా చనిపోతారేమోనని భయపడ్డానని డుప్లెసిస్ గుర్తు చేసుకున్నాడు. 2018లో సౌతాఫ్రికా పర్యటనలో జోహన్నస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియం వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుందని డుప్లెసిస్ తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో వాండరర్స్ పిచ్ ప్రమాదకరంగా మారిందని, అనూహ్య బౌన్స్‌తో ఆటగాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని చెప్పాడు. పిచ్ ప్రమాదకరంగా మారడంతో ఆటను రద్దు చేసుకోవాలని అంపైర్లు కోరగా.. విరాట్ కోహ్లీ నిరాకరించాడని డుప్లెసిస్ తెలిపాడు. అంతేకాకుండా గాయాలైనా భరించాలని, నొప్పిని బయటకు చెప్పవద్దని తమ బ్యాటర్లకు సూచించాడని గుర్తు చేసుకున్నాడు.
ఆ మ్యాచ్ మర్చిపోను..
ఓ యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఫాఫ్‌డుప్లెసిస్.. ప్రమాదకర వాండరర్స్ పిచ్ నాటి విషయాలను నెమరువేసుకున్నాడు. 'ఆ వాండరర్స్ టెస్ట్ మ్యాచ్‌ను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే ఆ పిచ్ అంత ప్రమాదకరంగా ఉంది. బంతులు అనూహ్యంగా బౌన్స్ అయ్యి బ్యాటర్లను గాయపర్చాయి. మా టీమ్ ఓపెనర్ డీన్ ఎల్గార్ తకు బంతి బలంగా తాకింది. ఆ పిచ్‌ను చూసిన తర్వాత మైదానంలో ఎవరైనా చనిపోతారేమోనని భయపడ్డాను. బంతి మెడవైపు బలంగా దూసుకొచ్చాయి.

మ్యాచ్‌లో వెనుకంజలో నిలిచిన జట్టు అయితే ఆటను రద్దు చేయాలని కోరుతుంది. కానీ భారత్ స్వల్ప తేడాతో వెనుకంజలో ఉన్నా.. పిచ్ ప్రమాదకరంగా మారినా ఆటను కొనసాగించింది. ముఖ్యంగా నాటి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటను రద్దు చేసేందుకు అంగీకరించలేదు. ఏది ఏమైనా బ్యాటింగ్ కొనసాగించాలని, గాయాలైనా బయటకు చెప్పకూడదని బ్యాటర్లను ఆదేశించాడు. గాయాలకు విలవిలలాడితే పిచ్ బాగాలేదని చెబుతూ అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తారని హెచ్చరించాడు. కోహ్లీ మాటలను గౌరవించిన బ్యాటర్లు దెబ్బలు తగిలినా నొప్పిని భరిస్తూ మైదానంలో నిలబడ్డారు.'అని ఫాఫ్ డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.
కోహ్లీ రిస్క్‌తో గెలిచిన భారత్..
విరాట్ కోహ్లీ భారత అత్యుత్తమ టెస్ట్ కెప్టెన్ అని, అతని పోరాట స్ఫూర్తి అద్భుతమని డుప్లెసిస్ కొనియాడాడు. విరాట్ కోహ్లీ 68 టెస్ట్‌ల్లో సారథ్యం వహించి 40 విజయాలు అందించాడు. ఈ ప్రమాదకర వాండరర్స్ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 63 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 187 పరుగులకే ఆలౌటైంది. కోహ్లీ(54), పుజారా(54) హాఫ్ సెంచరీలతో రాణించారు.
అనంతరం సౌతాఫ్రికా 194 పరుగులకు ఆలౌటైంది. బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 247 పరుగులకు ఆలౌటవ్వగా.. సౌతాఫ్రికా 177 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్ సందర్భంగానే పిచ్ ప్రమాదకరంగా మారింది. అయినా భారత్ ఆటను కొనసాగించింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచినా సిరీస్‌ను మాత్రం 2-1తో కోల్పోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


