న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs AUS 2nd ODI ప్రివ్యూ: రాజ్‌కోట్‌లో రాత మారేనా?

India vs Australia 2020, 2nd ODI : Match Preview || Virat Kohli May Bat At No.3 || Oneindia Telugu
Experimenting Indias bid to salvage series against fully-armed Australia

ఊహించని ఓటమితో వాంఖడేలో తలదించుకున్న కోహ్లీసేన మరో పోరాటానికి సిద్ధమైంది. ఏకపక్ష విజయంతో తమకు షాకిచ్చిన ఆస్ట్రేలియాతో మరోసారి తలపడనుంది. గెలిస్తేనే నిలిచే పరిస్థితి తెచ్చుకున్న టీమిండియా.. గత ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలన్నా.. సిరీస్‌లో నిలవాలన్నా.. విజయం సాధించడమే ఏకైక మార్గం. చావో రేవో స్థితిలో ఉన్న కోహ్లీసేన ఏంచేస్తుందో మరి..! గెలిచి సిరీస్‌లో నిలుస్తుందా.. ఓడి మరోసారి తలదించుకుంటుందా? తేలాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే..!

రాజ్‌కోట్: బలమైన ప్రత్యర్థి ముందు ప్రయోగాల పేరిట చేతులుకాల్చుకున్న టీమిండియా రాజ్ కోట్ వేదికగా జరిగే మరో సవాల్‌కు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌లో భాగంగా శుక్రవారం జరిగే రెండో వన్డేలో ఆస్ట్రేలియాతో మరోసారి తలపడనుంది. సిరీస్ రేస్‌లో నిలవాలంటే విజయం తప్పనిసరైన పరిస్థితుల్లో కోహ్లీ సేన ఒత్తిడిలో ఉండగా.. రెట్టించిన ఉత్సాహంతో ఆసీస్ బరిలోకి దిగుతోంది.

వన్‌డౌన్‌లోనే కోహ్లీ

వన్‌డౌన్‌లోనే కోహ్లీ

సిరీస్‌ను శాసించే ఈ మ్యాచ్‌లో భారత్‌ ప్రయోగాలకు చిన్న బ్రేక్ ఇవ్వచ్చు. దీంతో కెప్టెన్ కోహ్లి మూడో స్థానంలోనే బ్యాటింగ్‌కు రావొచ్చు. కాబట్టి రెగ్యులర్‌ ఓపెనర్లయిన రోహిత్, ధావన్‌ మ్యాచ్ ప్రారంభిస్తే రాహుల్‌ నాలుగో స్థానానికి పరిమితం కావచ్చు. గాయపడిన వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ ప్లేస్‌లో కేదార్‌ జాదవ్‌, మనీష్ పాండేలో ఒకరికి తుదిజట్టులో చోటుదక్కవచ్చు. పార్ట్‌టైమ్ బౌలర్‌గా వాడుకునే అవకాశం ఉండటంతో కేదార్‌కే మొగ్గుచూపొచ్చు.

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి ధోని ఔట్

రీ ఎంట్రీ ధావన్ అదరగొడుతుండగా.. కేఎల్ రాహుల్ నిలకడైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వీరికి తోడు హిట్‌మాన్ రోహిత్‌ శర్మ తన మార్క్ పెర్ఫామెన్స్ చూపిస్తే.. వన్‌డౌన్‌లో కోహ్లీ బాధ్యత తీసుకుంటాడు. దీంతో ఇండియాకు తిరుగుండదు.

బుమ్రా మెరవాల్సిందే

బుమ్రా మెరవాల్సిందే

గత మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యం కంటే బౌలింగ్ ఫెయిల్యూరే ఇండియా విజయవకాశాలను దెబ్బకొట్టింది. పేసర్లు సహా స్పిన్నర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేదు. రీ ఎంట్రీ తర్వాత ఇప్పటిదాకా తన స్థాయిని చూపెట్టలేకపోయిన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా పూర్వపు ఫామ్ అందుకుంటే బౌలర్లలోనూ జోష్ వస్తుంది. గత వన్డేలో భారీగా రన్స్ ఇచ్చిన శార్దుల్ ఠాకుర్‌ను తీసుకుంటారో లేక నవదీప్ సైనీకి అవకాశం ఇస్తారో చూడాలి. బ్యాటింగ్‌కు స్వ్రర్గధామమైన రాజ్‌కోట్ పిచ్‌లో బుమ్రా, షమీలతో పాటు... స్పిన్నర్లు కుల్దీప్, జడేజా బాధ్యత తీసుకోని పరుగుల్ని నియంత్రించాలి. అయితే స్పిన్నర్లు సహకరించిన ఈ పిచ్‌లో కుల్దీప్, చహల్‌లో ఒకరే ఫైనల్ ఎలెవెన్‌లో ఆడే అవకాశం ఉంది.

ఫుల్ జోష్‌లో ఆసీస్‌

ఫుల్ జోష్‌లో ఆసీస్‌

అదిరిపోయే విక్టరీతో సిరీస్‌ను ఘనంగా ప్రారంభించిన ఆస్ట్రేలియా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉంది. అదే జోరును పునరావృతం చేసి ఆఖరిదాకా ఆగకముందే సిరీస్‌ను పట్టేయాలని కసిగా ఉంది. ఇండియాలో ఇండియాపై వరుసగా రెండో సిరీస్ గెలిచి రికార్డు స`ష్టించాలని పట్టుదలగా ఉంది. ఓపెనర్లు వార్నర్, ఫించ్‌ అజేయమైన సెంచరీలతో దూకుడు మీదున్నారు. మిడిలార్డర్‌ స్మిత్, లబ్‌షేన్‌లతో బాగుంది. బౌలింగ్‌ విభాగం కూడా పటిష్టంగా ఉంది. స్టార్క్, కమిన్స్, కేన్‌ రిచర్డ్‌సన్‌ భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందిపెట్టారు. మరోమారు ఆల్‌రౌండ్‌ సత్తాతో టీమిండియాపై ఆధిపత్యం చాటాలని ఆసీస్‌ ఉవ్విళ్లూరుతోంది.

సిగ్గు చేటు.. ధోనికి కాంట్రాక్ట్ ఇవ్వరా?: బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్

కలవరపెడుతున్న గత రికార్డు..

కలవరపెడుతున్న గత రికార్డు..

రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో టీమిండియాకు చెత్త రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన రెండు వన్డేల్లోనూ ఇండియా ఓడింది. 2013 జనవరిలో ఇంగ్లండ్, 2015 అక్టోబర్‌లో సౌతాఫ్రికాతో ఆడిన మ్యాచ్‌ల్లో ఇండియా ఓటమి పాలైంది. ఇక ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసారం కానుంది.

పిచ్, వాతావరణం

పిచ్, వాతావరణం

రాజ్‌కోట్ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. భారీ స్కోర్లకు అవకాశముంది. టాస్‌ నెగ్గిన జట్టు ఛేజింగ్‌కే ‌ మొగ్గుచూపుతుంది. వర్షం ముప్పులేదు.

జట్లు (అంచనా)

భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, ధావన్, రాహుల్, శ్రేయస్, జాదవ్, జడేజా, శార్దుల్, కుల్దీప్‌/చహల్, షమీ/సైనీ, బుమ్రా.

ఆస్ట్రేలియా: ఫించ్‌ (కెప్టెన్‌), వార్నర్, లబ్‌షేన్, స్మిత్, క్యారీ, టర్నర్, అగర్, కమిన్స్, స్టార్క్, రిచర్డ్‌సన్‌/హాజల్‌వుడ్, జంపా.

Story first published: Friday, January 17, 2020, 11:56 [IST]
Other articles published on Jan 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X