న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి ధోని ఔట్

MS Dhoni out of Bcci Central contracts list

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అభిమానులకు బ్యాడ్ న్యూస్. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) గురువారం ప్రకటించిన 2019-20 సెంట్రల్ కాంట్రాక్టు జాబితాలో ఈ సీనియర్ క్రికెటర్ కమ్ వికెట్ కీపర్‌కు చోటు దక్కలేదు.

వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో ఓటమి అనంతరం ధోని మళ్లీ బ్యాట్ పట్టలేదు. మొదట్లో ఆర్మీలో పనిచేసేందుకు ఆటకు విశ్రాంతి తీసుకున్నానని తెలిపిన ధోని.. అనంతరం తన భవిష్యత్తు కార్యచరణ ఏంటో చెప్పలేదు. పైగా జనవరి వరకు తన క్రికెట్ కెరీర్ గురించి ప్రశ్నించవద్దని తెలిపాడు.

ధోనికి షాకిచ్చిన బీసీసీఐ: సెంట్రల్ కాంట్రాక్టులో చోటు దక్కించుకున్న మొత్తం ఆటగాళ్లు వీరే!ధోనికి షాకిచ్చిన బీసీసీఐ: సెంట్రల్ కాంట్రాక్టులో చోటు దక్కించుకున్న మొత్తం ఆటగాళ్లు వీరే!

అటు బీసీసీఐ కూడా ఎలాంటి స్పష్టతనివ్వకుండా యువ ఆటగాళ్లతో ప్రయోగాలు చేస్తుంది. అయితే ఆటకు దూరమైన ధోనిని సెంట్రల్ కాంట్రాక్టు జాబితా నుంచి బీసీసీ తొలిగించింది. గతేడాది ధోని గ్రేడ్-ఎలో ఉండగా.. ఈ సారి ఎలాంటి గ్రేడ్‌లో చోటు కల్పించలేదు.

ఇప్పటికే ఈ జార్ఖండ్ డైనమైట్ కెరీర్‌పై తీవ్ర చర్చజరుగుతుండగా బీసీసీఐ తాజా నిర్ణయం అతని రీ ఎంట్రీపై సందేహాలను రేకిత్తిస్తోంది. 2014 డిసెంబర్‌‌లో టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌పై చెప్పిన ధోని అనంతరం కెప్టెన్సీ కోల్పోయినా.. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో కొనసాగుతూ 90 మ్యాచ్‌లు ఆడాడు. అయితే ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు ధోని అందుబాటులో ఉంటాడని భావించిన అతని అభిమానులకు బీసీసీఐ తాజా నిర్ణయం మింగుడుపడటం లేదు.

ఐపీఎల్‌తో తమ అభిమాన క్రికెటర్ రీ ఎంట్రీ ఇస్తాడని వారంతా భావించారు. కోచ్ రవిశాస్త్రి, మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం ధోని ఐపీఎల్ ఫామ్ అతని భవిష్యత్తుని నిర్ణయిస్తుందన్నారు. కానీ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను తొలగించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అతని కెరీర్‌కు ముగింపుపలికే కార్యచరణనేనా అనే సందేహం కలుగుతోంది.

ఇక బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో ఏ+ గ్రేడ్‌లో ఉన్నా ఆటగాళ్లకు రూ.7 కోట్ల వార్షిక వేతనం అందుతుండగా.. ఎ గ్రేడ్‌లో ఉన్న ప్లేయర్లకు రూ. 5 కోట్లు, బీ గ్రేడ్ వారికి రూ. 3 కోట్లు, సీ గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లకు కోటీ రూపాయల జీతం వస్తోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా ఏ గ్రేడ్‌లో ఉండగా..శ్రేయస్, నవ్‌దీప్ సైనీ, దీపక్ చహర్,మయాంక్, వాషింగ్టన్ సుంధర్‌లు కొత్తగా కాంట్రాక్టులు పొందారు.

Story first published: Thursday, January 16, 2020, 16:27 [IST]
Other articles published on Jan 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X