Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లండ్ చేతిలో పాకిస్థాన్ చిత్తు.. 138 ఏళ్లలో ఇదే తొలిసారి!

ఇంగ్లండ్ గడ్డపై బాబర్ ఆజామ్ సారథ్యంలోని పాకిస్థాన్ జట్టు వైట్ వాష్ అయ్యింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆదివారం జరిగిన మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను 3-0తో గెలుచుకుంది.

తొలి రెండు టెస్ట్‌లతో పోల్చితే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ పర్వాలేదనిపించింది. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనా.. రెండో ఇన్నింగ్స్‌లో 449 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ పర్యటనలో పాకిస్థాన్ చేసిన అత్యధిక స్కోర్ ఇదే. తొలి 4 ఇన్నింగ్స్‌ల్లో ఆ జట్టు కనీసం 200 పరుగులు కూడా చేయలేదు.

PAK vs ENG: ఒరేయ్ ఆజామూ లగెత్తరో.. 3-0తో పాక్‌ను ఉతికేసిన ఇంగ్లాండ్!

PAK vs ENG: ఒరేయ్ ఆజామూ లగెత్తరో.. 3-0తో పాక్‌ను ఉతికేసిన ఇంగ్లాండ్!

138 ఏళ్లలో ఇదే తొలిసారి..

అయితే ఈ మూడు టెస్ట్‌ల సిరీస్‌లో ఇరు జట్ల నుంచి ఏ ఒక్క బ్యాటర్ కూడా సెంచరీ చేయలేదు. ఇలా ఇంగ్లండ్ గడ్డపై ఓ టెస్ట్ సిరీస్‌లో సెంచరీ నమోదు కాకపోవడం 138 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారిగా 1888లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన యాషెస్ సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో సెంచరీ నమోదు కాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ చెత్త ఫీట్ నమోదు అయ్యింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఇలా జరగడం ఇది 8వ సారి మాత్రమే.

England vs Pakistan Rare Test Cricket Feat Happens for First Time in 138 Years

ఈ సిరీస్‌లో పాకిస్థాన్ తరఫున సౌద్ షకీల్(97), షాన్ మసూద్(95) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కొల్పోయాడు. ఇంగ్లండ్ తరఫున హ్యారీ బ్రూక్(91) సెంచరీని అందుకోలేకపోయాడు. ఈ సిరీస్‌లో పాకిస్థాన్ బ్యాటర్లు తీవ్రంగా తడబడినప్పటికీ.. వారి బౌలర్లు ఇంగ్లండ్ బ్యాటర్లను సెంచరీ చేయకుండా అడ్డుకున్నారు.

72 ఏళ్ల తర్వాత క్లీన్ స్వీప్..

ఈ సిరీస్‌లో జోరూట్ టెస్ట్ క్రికెట్‌లో 69 శతకాలు నమోదు చేసి అత్యధిక టెస్ట్ హాఫ్ సెంచరీలు నమోదు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ను అధిగమించాడు. అంతేకాకుండా అత్యధిక టెస్ట్ పరుగుల జాబితాలో రికీ పాంటింగ్‌ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. 1954 నుంచి ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న పాకిస్థాన్.. తన 72 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంగ్లీష్ గడ్డపై ఒక సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌ల్లో ఓడిపోయి వైట్‌వాష్‌కు గురవ్వడం ఇదే తొలిసారి.

ENG vs PAK: పాక్ అరంగేట్ర బౌలర్ చెత్త రికార్డ్!

Also Read

ENG vs PAK: పాక్ అరంగేట్ర బౌలర్ చెత్త రికార్డ్!

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే ఆలౌటైంది. సౌద్ షకీల్(43), మహమ్మద్ అబ్బాస్(21), రజౌల్లా(11) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 453 పరుగుల భారీ స్కోర్ చేసింది. దాంతో ఆ జట్టుకు 320 పరుగుల ఆధిక్యం లభించింది. హ్యారీ బ్రూక్(75), డాన్ లారెన్స్(65), జేమీ స్మిత్(69), ఓలీ రాబిన్సన్(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో రజౌల్లా(4/148) నాలుగు వికెట్లు తీసాడు.

అనంతరం పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 449 పరుగుల భారీ స్కోర్ చేసింది. అజాన్ అవైస్(59), షాన్ మసూద్(95), బాబర్ ఆజామ్(76), రజౌల్లా(81), మహమ్మద్ అబ్బాస్(42) రాణించారు. దాంతో ఇంగ్లండ్ ముందు 130 పరుగుల లక్ష్యం నమోదు కాగా.. ఆ జట్టు 24.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జోర్డాన్ కాక్స్(59 నాటౌట్), జోరూట్(62 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో రాణించారు.

Story first published: Sunday, September 13, 2026, 9:48 [IST]
Other articles published on Sep 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+