PAK vs ENG: ఒరేయ్ ఆజామూ లగెత్తరో.. 3-0తో పాక్‌ను ఉతికేసిన ఇంగ్లాండ్!
PAK vs ENG: క్రికెట్ నిపుణులు ఊహించినట్లే పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటన చివరికి ముగిసింది. ఈ సిరీస్‌లో పాకిస్తాన్ ఆటగాళ్ల ప్రదర్శన అత్యంత నిరాశపరిచింది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మూడో, చివరి టెస్టులో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడో మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు కొంత పరువు నిలబెట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఫలితం మారలేదు. మ్యాచ్ గెలవడానికి ఇంగ్లాండ్‌కు రెండో ఇన్నింగ్స్‌లో 130 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. నాలుగో రోజు తొలి సెషన్‌లోనే కేవలం రెండు వికెట్ల నష్టానికి ఇంగ్లండ్ ఈ లక్ష్యాన్ని సాధించింది. పాకిస్తాన్‌ను క్లీన్ స్వీప్ చేయడం ద్వారా, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ తన ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది.
మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ చేసిన 453 పరుగులకు పాకిస్తాన్ బదులిచ్చే క్రమంలో ఆరంభంలో వారి పరిస్థితి దయనీయంగా ఉంది. స్కోరుబోర్డుపై సున్నా పరుగులకే రెండు వికెట్లు కోల్పోవడంతో పాకిస్తాన్ జట్టు లొంగిపోతుందేమో అనిపించింది. కానీ కెప్టెన్ షాన్ మసూద్ (95), అజాన్ అవైస్ (59) కలిసి 125 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును గట్టెక్కించారు. గస్ అట్కిన్సన్ బౌలింగ్‌లో డాన్ లారెన్స్‌కు అద్భుతమైన క్యాచ్ ఇవ్వడంతో మసూద్ సెంచరీకి కేవలం ఐదు పరుగుల దూరంలో ఔటయ్యాడు. ఆ తర్వాత బాబర్ ఆజం 76 పరుగుల ఇన్నింగ్స్‌తో కొంత ఆశలు రేకెత్తించాడు. కానీ జోష్ టంగ్ వేసిన ప్రమాదకరమైన బౌన్సర్‌కు అతని ఇన్నింగ్స్ ముగిసింది.

అద్భుతాలు చేసిన రజావుల్లా ఖాన్
చివరకు పాకిస్తాన్ కథ ముగిసిపోయిందనుకున్న తరుణంలో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేసిన రజావుల్లా ఖాన్ తన టెస్ట్ అరంగేట్రంలోనే ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించాడు. రజావుల్లా ఖాన్ వేగంగా 81 పరుగులు చేసి, మహమ్మద్ అబ్బాస్ (42)తో కలిసి సిక్సర్ల వర్షం కురిపించాడు. రజావుల్లా కేవలం 43 బంతుల్లోనే తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. టెస్ట్ అరంగేట్రంలో ఓ పాకిస్తానీ బ్యాటర్ చేసిన అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ ఇదే.
ఆ ఇద్దరు ఆటగాళ్లు 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి, స్కోరును 449కి చేర్చడంతో ఇంగ్లండ్ మళ్లీ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. అయితే, చివరకు జోష్ టంగ్ ఆ భాగస్వామ్యాన్ని విడగొట్టి పాకిస్థాన్ ఇన్నింగ్స్‌ను 449 పరుగుల వద్ద ముగించాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ 130 పరుగులు చేసి మ్యాచ్‌ను గెలుచుకుంది. పాకిస్థాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే ఆలౌట్ కావడం వారి ఓటమికి ఒక ప్రధాన కారణం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


