ENG vs PAK: పాక్ అరంగేట్ర బౌలర్ చెత్త రికార్డ్!
పాకిస్థాన్ అరంగేట్ర బౌలర్, నయా పేస్ సెన్సేషన్ రజవుల్లా చెత్త రికార్డ్ నమోదు చేశాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే అత్యధిక ఎకానమీతో పరుగులు సమర్పించుకున్న రెండో పాకిస్థాన్ బౌలర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన రజవుల్లా.. గంటలకు 145 కిలో మీటర్ల పైగా వేగంతో బంతులు సంధించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
రజావుల్లా వేగం చూసి అభిమానులు పాకిస్థాన్ దిగ్గజం వకార్ యూనిస్‌ను గుర్తు చేసుకున్నారు. కానీ ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లు బౌలింగ్ చేసిన రజావుల్లా.. 4 వికెట్లు తీసాడు. కానీ 6.40 ఎకానమీతో ఏకంగా 148 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో పాకిస్థాన్ తరఫున టెస్ట్ అరంగేట్రంలో అత్యధిక ఎకానమీతో పరుగులు సమర్పించుకున్న బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.

ఈ జాబితాలో జాహిద్ మహ్మద్ తొలిస్థానంలో ఉన్నాడు. అతను 2022లో ఇంగ్లండ్‌పైనే తన టెస్ట్ అరంగేట్రం చేసి, ఆ మ్యాచ్‌లో ఏకంగా 7.3 ఎకానమీతో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఓవరాల్‌గా చూసినా టెస్ట్ అరంగేట్రంలో ఇదే అత్యంత చెత్త ఎకానమీగా రికార్డుగా ఉంది. ధారళంగా పరుగులిచ్చుకున్నా.. ఎమిలియో గే, జో రూట్, జేమీ స్మిత్, రాబిన్సన్ వంటి కీలక బ్యాటర్లను ఔట్ చేశాడు.
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ టీమ్ తమ పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమవడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) సంచలన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ టెస్ట్ టీమ్ హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్‌తో పాటు బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఏడుగురు ఆటగాళ్లపై వేటు వేసి ఆఖరి టెస్ట్‌కు యువ ఆటగాళ్లను ఎంపిక చేసింది. వైట్ బాల్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్‌ను తాత్కలిక టెస్ట్ టీమ్ హెడ్ కోచ్‌గా నియమించింది. దాంతో రజవుల్లాకు పాకిస్థాన్ జట్టులో చోటు దక్కింది.
మూడో టెస్ట్‌లోనూ పాకిస్థాన్ ఘోర పరాజయం దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 133 పరుగులకు ఆలౌట్ అయిన పాకిస్థాన్.. ఇంగ్లండ్‌కు 453 పరుగుల సమర్పించుకుంది. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆలౌట్ దిశగా సాగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


