Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాక్ కెప్టెన్‌గా కొనసాగుతా.. కానీ ఓ కండీషన్: బాబర్ ఆజామ్

ఇంగ్లండ్ గడ్డపై మూడు టెస్ట్‌ల సిరీస్‌లో క్లీస్ స్వీప్ అయినా పాకిస్థాన్ కెప్టెన్‌గా కొనసాగుతానని బాబర్ ఆజామ్ స్పష్టం చేశాడు. కానీ పిచ్ పరిస్థితులు, సిరీస్‌లకు తగ్గట్లు ఆటగాళ్లు ఇవ్వాలని కండిషన్ పెట్టాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆదివారం జరిగిన మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను 3-0తో గెలుచుకుంది.

ఆఖరి టెస్ట్ పరాజయం అనంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన బాబర్ ఆజామ్.. జట్టులోకి వచ్చిన కొత్త కుర్రాళ్లు అదరగొట్టారని కితాబిచ్చాడు. ముఖ్యంగా రజౌల్లా అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడని కొనియాడాడు. ఓ దశలో ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తామని భావించామని, కానీ ఇంగ్లండ్ అద్భుతంగా ఆడిందని పేర్కొన్నాడు.

వావ్ బాబర్.. ఒకే మ్యాచ్‌లో డబుల్ రికార్డు!

వావ్ బాబర్.. ఒకే మ్యాచ్‌లో డబుల్ రికార్డు!

రజౌల్లా అదరగొట్టాడు..

'తొలి ఓవర్‌లోనే ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయేసరికి మాలో గెలుపుపై నమ్మకం పెరిగింది. కానీ వాళ్లు చాలా బాగా ఆడారు. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ లోటు ఏం కనిపించలేదు. పిచ్‌పై మంచి గడ్డి ఉండటంతో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాం. రజౌల్లా అదరగొట్టాడు. అతని ఆట మాకు బాగా నచ్చింది. అతనొక నైపుణ్యమైన ఆటగాడు. అతని రాక మా జట్టుకు కలిసొచ్చే అంశం.

Babar Azam Confirms He Will Continue as Pakistan Captain Calls for New Players After England Whitewash

నిజాయితీగా చెప్పాలంటే.. రజౌల్లా గురించి మాకు అంతగా తెలియదు. పెషావర్ తరఫున ఓపెనర్‌గా వచ్చేవాడు కాబట్టి అతని బ్యాటింగ్ గురించి కాస్త తెలుసుకున్నాను. ఇక్కడికి వచ్చే ముందే జట్టు గురించి ఆలోచించి కొన్ని మార్పులు చేశాం. ఇంగ్లండ్‌కు వచ్చి ఆడటం బ్యాటర్లకు, ఫాస్ట్ బౌలర్లకు అంత తేలికేం కాదు.

కెప్టెన్‌గా కొనసాగుతా..

మేం కూర్చొని మా తప్పులను చర్చించుకోవాలి. అలాగే మా అత్యుత్తమ తుది జట్టు ఏంటో తేల్చుకోవాలి. ఈ సిరీస్‌లో ఓడినా కెప్టెన్‌గా కొనసాగుతా.. కాకపోతే వేర్వేరు సిరీస్‌ల్లో పరిస్థితులకు తగ్గట్టు ఆటగాళ్లు కావాలి. ఏది ఏమైనా కొత్తగా వచ్చిన కుర్రాళ్లు మాత్రం అదరగొట్టారు.'అని బాబర్ ఆజామ్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే ఆలౌటైంది. సౌద్ షకీల్(43), మహమ్మద్ అబ్బాస్(21), రజౌల్లా(11) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 453 పరుగుల భారీ స్కోర్ చేసింది. దాంతో ఆ జట్టుకు 320 పరుగుల ఆధిక్యం లభించింది. హ్యారీ బ్రూక్(75), డాన్ లారెన్స్(65), జేమీ స్మిత్(69), ఓలీ రాబిన్సన్(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో రజౌల్లా(4/148) నాలుగు వికెట్లు తీసాడు.

కలిసొచ్చిన మార్పులు..

అనంతరం పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 449 పరుగుల భారీ స్కోర్ చేసింది. అజాన్ అవైస్(59), షాన్ మసూద్(95), బాబర్ ఆజామ్(76), రజౌల్లా(81), మహమ్మద్ అబ్బాస్(42) రాణించారు. దాంతో ఇంగ్లండ్ ముందు 130 పరుగుల లక్ష్యం నమోదు కాగా.. ఆ జట్టు 24.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జోర్డాన్ కాక్స్(59 నాటౌట్), జోరూట్(62 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో రాణించారు.

ENG vs PAK: ఒరేయ్ ఆజామూ! ఏమిరా మీ వల్ల ఉపయోగం?

Also Read

ENG vs PAK: ఒరేయ్ ఆజామూ! ఏమిరా మీ వల్ల ఉపయోగం?

తొలి రెండు టెస్ట్‌ల పరాజయం అనంతరం పీసీబీ కఠిన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. హెడ్ కోచ్, బౌలింగ్ కోచ్‌తో పాటు ఏడుగురి ఆటగాళ్లపై వేటు వేసింది. జట్టులోకొ కొత్తగా వచ్చిన రజౌల్లా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గంటకు 149 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధించిన అతను 4 వికెట్లు తీసాడు. బ్యాటింగ్‌లో 9 సిక్సర్లు బాది 81 పరుగులు చేసి అందర్నీ ఆకట్టుకున్నాడు.

Story first published: Sunday, September 13, 2026, 11:19 [IST]
Other articles published on Sep 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+