Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ENG vs PAK: ఒరేయ్ ఆజామూ! ఏమిరా మీ వల్ల ఉపయోగం?

ఇంగ్లండ్ గడ్డపై పాకిస్థాన్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. కోచ్ మారినా.. జట్టును ప్రక్షాళన చేసినా.. వేదిక మారినా పాకిస్థాన్ ఆట మాత్రం మారలేదు. బర్మింగ్‌‌హామ్ వేదికగా బుధవారం ప్రారంభమైన ఆఖరి టెస్ట్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 84 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.

కెప్టెన్ బాబర్ ఆజామ్(7) సహా బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇంగ్లండ్ పేస్ త్రయం జోష్ టంగ్(3/23), ఓలీ రాబిన్సన్(2/9), జోఫ్రా ఆర్చర్(2/18) నిప్పులు చెరగడంతో పాకిస్థాన్ బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

పీసీబీ షాకింగ్ నిర్ణయం: చేతులెత్తేసిన బాబర్ ఆజం!

పీసీబీ షాకింగ్ నిర్ణయం: చేతులెత్తేసిన బాబర్ ఆజం!

డకౌట్‌తో పాక్ పతనం షురూ..

ఓపెనర్ సైమ్ ఆయుబ్(0)ను రాబిన్సన్ డకౌట్ చేయగా.. మరో ఓపెనర్ అజాన్ అవైస్(9)ను ఆర్చర్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. అబ్దుల్లా షఫీక్(3)ను రాబిన్సన్ క్యాచ్ ఔట్ చేయగా.. షాన్ మసూద్‌ను ఆర్చర్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. జట్టును ఆదుకుంటాడని భావించిన బాబర్ ఆజామ్(7) జోష్ టంగ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ENG vs PAK Fans Slam Babar Azam After He Falls for 7 as Pakistan Collapse Against England in 3rd Test

18 బంతుల్లో ఒక బౌండరీతో 7 పరుగులే చేశాడు. వికెట్ కీపర్ ఘాజి ఘోరి(4)ని జోష్ టంగ్ వికెట్ల ముందు బోల్తా కొట్టించగా.. మహమ్మద్ ఇమ్రాన్(5)ను టంగ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. సౌద్ షకీల్(37 బ్యాటింగ్), రజౌల్లా(11 బ్యాటింగ్) ఆచితూచి ఆడుతున్నారు. దాంతో పాకిస్థాన్ లంచ్ బ్రేక్ సమయానికి 23 ఓవర్లలో 7 వికెట్లకు 100 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లోనూ ఆ జట్టు 200 పరుగుల లోపే ఆలౌటయ్యే అవకాశం ఉంది.

ఏడుగురిపై వేటు వేసినా..

వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాలను మూటగట్టుకోవడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) జట్టును ప్రక్షాళన చేసింది. హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌తో పాటు ఏడుగురి ఆటగాళ్లను జట్టు నుంచి తొలగించింది. మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్ వంటి సీనియర్ ఆటగాళ్లపై కూడా వేటు వేసింది.

ENG vs PAK: ఒరేయ్ ఆజామూ.. ఏమీరా నీ వల్ల ఉపయోగం!

Also Read

ENG vs PAK: ఒరేయ్ ఆజామూ.. ఏమీరా నీ వల్ల ఉపయోగం!

వారి స్థానాల్లో కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. అయినా జట్టు ఆటలో ఎలాంటి మార్పు లేదు. దాంతో నెటిజన్లు పాకిస్థాన్ జట్టుపై దుమ్మెత్తి పోస్తున్నారు. ముఖ్యంగా బాబర్ ఆజామ్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఒరేయ్ ఆజామూ! ఏమిరా మీ వల్ల ఉపయోగం? నువ్వు నీ జట్టు మారదా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

Story first published: Wednesday, September 9, 2026, 18:15 [IST]
Other articles published on Sep 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+