For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడితే ఆటగాడిగా మళ్లీ పుడతాం: బ్రావో

Dwayne Bravo Says A player’s career is reborn after he joins CSK
Dwayne Bravo - 'When A Player Comes To CSK, His Career Is Born Again'

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) తరఫున ఆడితే ఆటగాడిగా మళ్లీ పుడతామని ఆ టీమ్ స్టార్ ఆల్‌రౌండర్, వెస్టిండీస్ క్రికెటర్ డ్వాన్ బ్రావో తెలిపాడు. 2011 నుంచి చెన్నై తరఫున ఆడుతున్న బ్రావో.. ఆయా సీజన్లలో షేన్ వాట్సన్, అంబటి రాయుడు‌ల ఆటను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుందని తెలిపాడు. అప్పటి వరకు ఎలా ఉన్నా చెన్నై జట్టులోకి రాగానే పూర్తిగా మారిపోతారని, కొత్తగా కనిపిస్తారన్నాడు. దానికి మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యమే కారణమని ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫోతో జరిగిన వీడియో చాట్‌లో ఈ విండీస్ వీరుడు చెప్పుకొచ్చాడు.

ధోనీ ఎప్పుడూ చెప్పేది ఒక్కటే..

ధోనీ ఎప్పుడూ చెప్పేది ఒక్కటే..

‘చెన్నై సూపర్ కింగ్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో చాలా మంచి కెప్టెన్లు ఉన్నారు. ఫాఫ్ డూప్లెసిస్, మెక్ కల్లమ్, నేను, మైక్ హస్సీ ఇలా ఆయా దేశాలకు సారథులగా వ్యహరించారు. కానీ ధోనీ మాత్రం చాలా విభిన్నమైన సారథి. అతను మాకు ఎప్పుడూ చెప్పేది ఒక్కటే. ‘మీరు అద్బుతమైన ఆటగాళ్లు కాబట్టే ఇక్కడ ఉన్నారు. కాబట్టి మీరు ఎప్పుడు ఇక్కడు వచ్చినా మీ సత్తాను ఎవరి ముందు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రాంచైజీ అన్నీ గమనిస్తుంది. మీరు ఏం చేయగలరో వారికి తెలుసు. మీరు మీలానే ఉండండి'అని చెబుతాడు.'అని బ్రావో గుర్తు చేసుకున్నాడు.

రాయుడు, షేన్ వాట్సనే నిదర్శనం..

రాయుడు, షేన్ వాట్సనే నిదర్శనం..

‘ఏ ఆటగాడైన చెన్నై జట్టులోకి వస్తే అతను ఆటగాడిగా పునర్జన్మిస్తాడు. షేన్ వాట్సన్, అంబటి రాయుడే దీనికి నిదర్శనం. రాయుడు ముంబై వీడినప్పుడు ఎలా ఉన్నాడు. చెన్నైకు వచ్చిన తర్వాత ఎలా ఆడాడు. ప్రతీ ఒక్కరి కెరీర్ గ్రాఫ్ పెరుగుతుంది.'అని తెలిపాడు. ముంబై తరఫున విఫలమై గడ్డు కాలాన్ని ఎదుర్కొన్న రాయుడు 2018లో చెన్నై తరఫున బరిలోకి దిగి అదరగొట్టాడు. దాంతో మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చి వరల్డ్‌కప్ ప్రాబబుల్స్‌కు ఎంపికయ్యాడు. గతేడాది జరిగిన ఐపీఎల్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేక వరల్డ్ కప్ ఆడే అవకాశం కోల్పోయాడు.

12 ఏళ్లుగా ఐపీఎల్ ఆడుతున్న షేన్ వాట్సన్.. 2018లో చెన్నై జట్టు తరపున బరిలోకి ఏన్నడు ఆడని విధంగా ఆడి ప్రశంసలు అందుకున్నాడు. ముఖ్యంగా గత రెండు సీజన్ల ఫైనల్లో అతని ప్రదర్శన అద్భుతం.

సచిన్ vs కోహ్లీ.. వన్డేల్లో ఎవరు గొప్పో చెప్పిన గంభీర్

సూపర్ స్టార్‌లా వ్యవహరించడు..

సూపర్ స్టార్‌లా వ్యవహరించడు..

‘ధోనీ ఎవరిపై ఒత్తిడి చేయడు. ఆఫ్ ఫీల్డ్‌లో అందరూ అతన్ని చాలా తక్కువగా చూస్తారు. కానీ అతని రూమ్ తలుపు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఎప్పుడైనా అతని దగ్గరకు వెళ్లొచ్చు. అతను అద్భుతంగా మాట్లాడుతాడు. అతనితో ఆడటం కూడా బాగుంటుంది. అందరూ కంఫర్ట్‌బుల్‌గా ఫీలయ్యే వాతవారణాన్ని సృష్టిస్తాడు. ప్రతీ ఒక్కరు రిలాక్స్ అవుతారు. అతను సాధించిన విజయాలు, మైలురాళ్లతో ఏనాడు సూపర్ స్టార్‌గా, అతిగా ప్రవర్తించడు.'అని బ్రావో కొనియాడాడు.

కరోనా దెబ్బకు రోజు కూలీగా మారిన ఫుట్‌బాల్ ప్లేయర్!

అంకుల్స్ టీమ్‌గా..

అంకుల్స్ టీమ్‌గా..

నిషేధానంతరం 2018లో రీఎంట్రీ ఇచ్చిన చెన్నై సూపర్ కింగ్స్.. వేలంలో అంతా సీనియర్ ఆటగాళ్లనే తీసుకుంది. ఎక్కువగా 30 ఏళ్లకు పైబడిన ఆటగాళ్లే ఉండటంతో అంకుల్స్ టీమ్ అనే ట్రోల్స్ కూడా ఎదుర్కొంది. కానీ అసాధారణ ప్రదర్శనతో ఆ సీజన్‌లో టైటిల్ అందుకోవడంతో పాటు గతేడాది రన్నరప్‌గా నిలిచింది. ఇప్పటి వరకు మూడు టైటిల్స్ అందుకున్న ఆ జట్టు అత్యంత ప్రభావంతమైన టీమ్‌గా నిలిచింది. అంతే కాకుండా నిషేదానికి గురైన సీజన్లు మినహా ప్రతీ సీజన్‌లో ప్లే ఆఫ్‌కు చేరింది.

Story first published: Thursday, May 21, 2020, 15:18 [IST]
Other articles published on May 21, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+