Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మా మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాల్లేవ్.. లాక్ ‌డౌన్‌ను ఆస్వాదిస్తున్నాం: దినేశ్ కార్తీక్ భార్య

Dipika Pallikal Says Dinesh Karthik and I prefer not to talk about respective sports when at home

న్యూఢిల్లీ: తమ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని భారత స్క్వాష్ క్రీడాకారిణి, టీమిండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్ భార్య దీపికా పల్లికల్ స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ కారణంగా వచ్చిన లాక్‌డౌన్‌ సమయాన్ని తాము ఎంతగానో ఆస్వాదిస్తున్నామని తెలిపింది. క్రీడా టోర్నీల కోసం ఎక్కువగా విదేశాల చుట్టూ తిరుగుతూ వైవాహిక జీవితాన్ని పరిమితంగా గడిపే తాము.. లాక్‌డౌన్‌ పుణ్యమా ఒకరి అవసరాల గురించి మరొకరం మాట్లాడుకునే సమయం దొరికిందని ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.

ఎప్పుడూ చర్చించం.

ఈ లాక్‌డౌన్‌ సమయంలో ఫిట్‌నెస్‌‌పై దృష్టి సారించినట్లు తెలిపిన దీపికా.. ప్రొఫెషనల్‌ ప్లేయర్లుగా తమకు ఇది పెద్ద బ్రేక్‌గా అని పేర్కొంది. వాస్తవానికి తాము ఎప్పుడూ ఆటల గురించి పెద్దగా చర్చించుకోమని, కేవలం క్రీడాకారులుగా ఏమి కావాలో వాటి గురించి మాత్రమే ఆలోచిస్తామని చెప్పుకొచ్చింది. ‘ఈ లాక్‌డౌన్‌ సమయంలో ఇద్దరం కలిసి ఇంటి పనులను పంచుకుంటున్నాం. అథ్లెట్లకు ఎప్పుడైనా కుటుంబంతో కలిసి గడిపే సమయం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఊహించని లాక్‌డౌన్‌‌ మమ్మల్ని ఒకరికొకరిని మరింత దగ్గర చేసింది.

కరోనా వైరస్ చైనా కుట్రే.. డ్రాగన్ కంట్రీపై భజ్జీ ఫైర్!

ఎలాంటి గొడవల్లేవ్..

ఇప్పటివరకూ మేము బిజీ బిజీ షెడ్యూల్‌తోనే గడుపుతూ వచ్చాం. ఇప్పుడు ఎటువంటి స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌ లేకపోవడంతో ఇంటికే పరిమితమయ్యాం. మా మధ్య ఎప్పుడూ అభిప్రాయ బేధాలు రాలేదు. మేమిద్దరం ఒకరిని ఒకరు అర్ధం చేసుకోవడంతో మా గేమ్స్‌ల్లో మరింత రాటుదేలే అవకాశం ఏర్పడింది. మా మధ్య కంప్లైట్స్ అనేవి ఉండవు. మేం ఇంటి దగ్గర ఉన్నామంటే మా మధ్య క్రీడల చర్చే రాదు. జీవితంలోని మిగతా విషయాల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. ప్రొఫెషనల్‌ లైఫ్‌ను గౌరవించుకుంటాం తప్పితే వాటి గురించి చర్చలు పెట్టం' అని దీపికా పల్లికల్‌ స్పష్టం చేసింది. ఇక 2015లో వీరిద్దరూ వివాహ బంధంతోo ఒక్కటైన సంగతి తెలిసిందే.

తన భార్యను మురళీ విజయ్ ప్రేమించడంతో..

తన భార్యను మురళీ విజయ్ ప్రేమించడంతో..

దినేశ్ కార్తీక్ 2007లో తన చిన్ననాటి స్నేహితురాలు నిఖితను వివాహం చేసుకున్నాడు. కానీ ఐపీఎల్ 2012 సీజన్‌ సందర్భంగా నిఖితకు భారత క్రికెటర్ మురళి విజయ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో విషయం తెలుసుకున్న దినేశ్ కార్తీక్.. తన సతీమణి నిర్ణయాన్ని గౌరవించి విడాకులిచ్చేశాడు. దీంతో నిఖితను మురళి విజయ్ చేసుకోగా.. అనంతరం పల్లికల్‌ను కార్తీక్ పెళ్లాడాడు. ఎలాంటి వివాదాలు లేకుండా కథ సుఖాంతమైంది. రెండు కుటుంబాలు సంతోషంగా జీవిస్తున్నాయి.

సచిన్ 40 ఏళ్ల వరకు ఆడొచ్చు.. ధోనీ మాత్రం 38 ఏళ్లకే రిటైర్ అవ్వాలా?

Story first published: Friday, May 29, 2020, 19:45 [IST]
Other articles published on May 29, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+