Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గంభీర్ X అగార్కర్ విభేదాలతో భారత జట్టు నాశనం: దినేష్ కార్తిక్

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మధ్య తీవ్రమైన భేదాభిప్రాయాలు ఉన్నాయని మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ ఆరోపించాడు. ఈ విభేదాలే ఇంగ్లండ్‌తో ఐదు టీ20 సిరీస్‌లో టీమిండియా ఘోర పరాజయానికి ప్రధాన కారణమయ్యాయని తెలిపాడు.

కోచ్, చీఫ్ సెలెక్టర్ మధ్య నెలకొన్న విభేదాలతో జట్టు వాతావరణం, ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం తీవ్రంగా దెబ్బతింటుందని కార్తీక్ హెచ్చరించాడు. ఇంగ్లండ్‌కు చెందిన స్కై స్పోర్ట్స్‌లో భారత ఘోర పరాజాయాన్ని విశ్లేషిస్తూ దినేశ్ కార్తీక్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

IND vs ENG: ఆ ఘోర తప్పిదమే మా ఓటమిని శాసించింది: హ్యారీ బ్రూక్

IND vs ENG: ఆ ఘోర తప్పిదమే మా ఓటమిని శాసించింది: హ్యారీ బ్రూక్

భిన్నమైన ఆలోచనలతో..

గంభీర్, అగార్కర్ మధ్య ఉన్న విభిన్నమైన దృక్పథాలే ఈ సమస్యకు ప్రధాన కారణమని దినేష్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. 'సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా జట్టు భవిష్యత్తుపై అజిత్ అగార్కర్ దీర్ఘకాలిక ప్రణాళికలు రచిస్తున్నాడు. కానీ హెడ్ కోచ్ గంభీర్ మాత్రం ప్రతీ మ్యాచ్‌లో గెలవాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ పరస్పర విరుద్దమైన ఆలోచనలు జట్టు ఎంపికపై ప్రభావం చూపింది.

Dinesh Karthik Says Bit of Friction Between Gautam Gambhir and Ajit Agarkar After India s T20I Setback

ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో భారత జట్టు వరుస పరాజయాలకు ఇది కారణమైంది. అనుభవజ్ఞుడైన సంజూ శాంసన్‌ను పక్కనపెట్టి యువ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వడం, ఆ తర్వాత అతన్ని 3 మ్యాచ్‌లకే పక్కనపెట్టడం, మళ్లీ సంజూ శాంసన్‌ను ఆడించడం వంటి గందరగోళాలు చోటు చేసుకున్నాయి.

ఆటగాళ్లలో అభద్రతా భావం..

ఈ అనాలోచిత నిర్ణయాల కారణంగానే ఆటగాళ్లలో తమ స్థానాలపై అభద్రతా భావం పెరిగింది. భారత జట్టులోకి వచ్చేందుకు ఎంతో మంది ప్రతిభావంతమైన ఆటగాళ్లు బెంచ్‌పై కూర్చొని ఎదురు చూస్తుండటంతో రెండు మ్యాచ్‌ల్లో విఫలమైతే తమ స్థానం కోల్పోతామనే భయం ఆటగాళ్లలో నెలకొంది. బీసీసీఐ తక్షణమే ఈ పరిస్థితిని పరిశీలించి, సరిదిద్దాలి.'అని దినేశ్ కార్తీక్ సూచించాడు.

IND vs ENG: ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన భారత్.. చిత్తుగా ఓడిన బ్రూక్ సేన!

IND vs ENG: ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన భారత్.. చిత్తుగా ఓడిన బ్రూక్ సేన!

ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయిన భారత్.. ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో 4-0 వైట్ వాష్ అయ్యింది. వరుసగా 7 మ్యాచ్‌ల్లో 6 పరాజయాలను మూటగట్టుకుంది.

Story first published: Wednesday, July 15, 2026, 10:24 [IST]
Other articles published on Jul 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+