బుద్దుందా.. పవర్ ప్లేలో హర్షిత్ రాణాతో బ్యాటింగా?:దినేష్ కార్తీక్
టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పవర్ ప్లేలో టెయిలెండర్ హర్షిత్ రాణాను బ్యాటింగ్‌కు పంపించడాన్ని తప్పుబట్టాడు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం హర్షిత్ రాణాను బ్యాటింగ్‌కు పంపించడం సరికాదని అభిప్రాయపడ్డాడు.
ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మూడో టీ20లో టీమిండియా 125 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 202 పరుగల భారీ లక్ష్యఛేదనలో టీమిండియా 76 పరుగులకే ఆలౌటైంది. టీ20 క్రికెట్ చరిత్రలోనే టీమిండియాకు ఇది అత్యంత ఘోర పరాజయం.
శివమ్ దూబేను కాదని..
అయితే ఈ మ్యాచ్ పవర్ ప్లేలోనే టీమిండియా ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఔటయ్యారు. దాంతో టీమిండియా మేనేజ్‌మెంట్ శివమ్ దూబేను కాకుండా హర్షిత్ రాణాను బ్యాటింగ్‌కు పంపించింది. ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన దినేశ్ కార్తీక్.. హర్షిత్ రాణా బ్యాటింగ్ రావడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇదెక్కడి దిక్కుమాలిన వ్యూహం అంటూ తన వ్యాఖ్యానంలోనే అసహనం వ్యక్తం చేశాడు.

'హర్షిత్ రాణా.. శివమ్ దూబే కంటే ముందు బ్యాటింగ్‌కు రావడమా? నాతో జోక్ చేస్తున్నారా ఏంటి? హర్షిత్ రాణా దేశవాళీ క్రికెట్‌లో కూడా ఎప్పుడూ పవర్‌ప్లేలో బ్యాటింగ్ చేసినట్లు నేను చూడలేదు. టీ20 క్రికెట్‌లో లెఫ్ట్-రైట్ కాంబినేషన్ ఒక స్థాయి వరకే ఉపయోగపడుతుంది. అంతేగానీ, శివమ్ దూబే కంటే ముందు హర్షిత్ రాణాను బ్యాటింగ్‌కు పంపించడం ఏమాత్రం కరెక్ట్ కాదు.' అని కార్తీక్ అసహనం వ్యక్తం చేశాడు. ఈ వ్యూహం బెడిసి కొట్టింది. హర్షిత్ రాణా(9)తో పాటు శివమ్ దూబే(2) కూడా దారుణంగా విఫలమయ్యాడు.
72 పరుగులకే ఆలౌట్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్(44 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. సామ్ కరణ్(24 బంతుల్లో 4 ఫోర్లతో 41 నాటౌట్) దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో ప్రిన్స్ యాదవ్(2/30), హర్షిత్ రాణా(2/40) రెండేసి వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు.
అనంతరం భారత్ 11.4 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలింది. ఇషాన్ కిషన్(13), వైభవ్ సూర్యవంశీ(13), అభిషేక్ శర్మ(10), అక్షర్ పటేల్(10) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(3/29) మూడు వికెట్లు తీయగా.. జోష్ టంగ్(4/28) నాలుగు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. ఆదిల్ రషీద్(2/14) రెండు వికెట్లు తీయగా.. విల్ జాక్స్(1/5) ఒక వికెట్ పడగొట్టాడు. టీ20 చరిత్రలోనే టీమిండియాకు ఇది ఘోర పరాజయం. గతంలో 100 ప్లస్ రన్స్‌తో భారత్ ఎప్పుడూ ఓడలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

