సంజూను తప్పించలేదు.. వైభవ్ సూర్యవంశీ కోసం తప్పుకున్నాడు
టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ను తుది జట్టు నుంచి తప్పించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలతో టీమిండియా విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్‌ను ఎలా తప్పిస్తారని సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.
అయితే సంజూ శాంసన్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ తప్పించలేదని, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వడం కోసం అతనే స్వయంగా తప్పుకున్నాడని ఓ ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ పేర్కొనడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్‌కు పరిమితమైన సంజూ శాంసన్.. 15 ఏళ్ల వైభవ్‌కు అవకాశం ఇవ్వాలని భావించాడట.

మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20కి ముందు సంజూ శాంసన్ స్వయంగా వెళ్లి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఈ విషయాన్ని చెప్పినట్లు సదరు వెబ్‌సైట్ పేర్కొంది. 'నేను తప్పుకుంటాను. వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోండి’అని గంభీర్‌ను సంజూ శాంసన్ కోరాడంట.
సంజూ శాంసన్ తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయంతో వైభవ్ సూర్యవంశీ అతి పిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా 37 ఏళ్ల సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ను అధిగమించాడు. అయితే సంజూ త్యాగానికి వైభవ్ సూర్యవంశీ తగిన గుర్తింపు తీసుకురాలేకపోయాడు. తొలి మ్యాచ్‌ల్లో 10 బంతుల్లో 14 పరుగులే చేసి ఔటైన వైభవ్.. రెండో టీ20ల్లో 5 బంతుల్లో 13 పరుగులు చేసి కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు.
సంజూ శాంసన్‌ను కేవలం పేలవ ఫామ్ కారణంగానే టీమ్ మేనేజ్‌మెంట్ పక్కన పెట్టిందని జరుగుతున్న ప్రచారానికి ఈ తాజా సమాచారంతో క్లారిటీ వచ్చింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2028 కోసం టీమిండియా రచిస్తున్న ప్రణాళికల్లో సంజూ శాంసన్ కీలక సభ్యుడిగా కొనసాగనున్నాడు.
జింబాబ్వే పర్యటనలో కూడా యువ ఆటగాళ్లను పరీక్షించడానికి మాత్రమే సంజూకు విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే సిరీస్‌లకు సంజూ శాంసన్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇంగ్లండ్ కండీషన్స్‌ను అర్థం చేసుకోవడంలో భారత ఆటగాళ్లు బాగా ఇబ్బంది పడుతున్నారు. దాంతోనే టీమిండియా వరుస పరాజయాలతో సతమతమవుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

