నా కెరీర్ ముగిసిపోయిందనుకున్నా: దేవదత్ పడిక్కల్
నాలుగేళ్ల క్రితం తీవ్రమైన అనారోగ్యానికి గురవ్వడంతో కెరీర్ ముగిసిపోయిందని భయపడ్డానని టీమిండియా యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అన్నాడు. అది తన జీవితంలోనే అత్యంత కష్టమైన సమయమని చెప్పుకొచ్చాడు. 2022లో దేవదత్ పడిక్కల్ తీవ్రమైన జీర్ణకోశ వ్యాధితో ఇబ్బంది పడ్డాడు. ఈ అనారోగ్యం కారణంగా పడిక్కల్ ఏకంగా 10 కిలోల బరువు తగ్గాడు. ఫిట్‌నెస్ కోల్పోయి మైదానంలో నిలకడగా రాణించలేకపోయాడు. కొంతకాలం ఆటకు బ్రేక్ ఇచ్చి ఈ వ్యాధి నుంచి కోలుకున్నాడు.
ఇటీవలే భారత టెస్ట్ టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన పడిక్కల్ అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్నాడు. శ్రీలంక పర్యటనలో సత్తా చాటిన పడిక్కల్.. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ల్లో విఫలమైనా.. న్యూజిలాండ్ గడ్డపై దుమ్మురేపాడు. బ్యాటింగ్‌కు ప్రతికూలమైన కండిషన్స్‌లో 199 పరుగులతో సత్తా చాటి జట్టును ఆదుకున్నాడు. ఈ ప్రదర్శన నేపథ్యంలో టైమ్స్ ఆఫ్ ఇండియకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవదత్ పడిక్కత్ తన జీవితంలోని గడ్డు కాలాన్ని గుర్తు చేసుకున్నాడు.

అత్యంత కష్టమైన సమయం..
'నా జీవితంలో అది అత్యంత కష్టమైన సమయం. నా క్రికెట్ కెరీర్ అక్కడితో ముగిసిపోతుందేమోనని భయపడ్డా. ఎందుకంటే భారత్‌లో సుదీర్ఘ కాలం ఆటకు దూరంగా ఉంటే.. ఇతర ఆటగాళ్లు మనకంటే చాలా ముందుకు వెళ్లిపోయినట్లు అనిపిస్తుంది.
మూడు ఫార్మాట్లు ఆడటం అంత ఈజీ కాదు. ఫార్మాట్ ఫార్మాట్‌కు చాలా తేడా ఉంటుంది. ప్రిపరేషన్ నుంచి చాలా విషయాలను వేరుగా చూడాల్సి ఉంటుంది. రెడ్ బాల్, వైట్ బాల్ క్రికెట్‌ను ఒకేలా ఆడుతామంటే ఆశించిన ఫలితం దక్కదు.
స్పెషల్ క్లాస్‌లకు హాజరయ్యా..
న్యూజిలాండ్ పర్యటన కోసం నేను ప్రత్యేకంగా సిద్దమయ్యాను. భారత్‌లో కొన్ని ట్రైనింగ్ క్లాస్‌లకు కూడా హాజరయ్యాను.ఆస్ట్రేలియా-ఏ జట్టుతో భారత్-ఏ తరఫున రెండు మ్యాచ్‌లు ఆడాను. అక్కడి పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. కానీ ఇక్కడి పరిస్థితులకు తగ్గట్లు కొన్ని సర్దుబాట్లు చేసుకున్నాను.
న్యూజిలాండ్‌లో వెల్లింగ్టన్ వంటి మైదానాల్లో గాలి కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడి పరిస్థితులను పూర్తి అర్థం చేసుకొని వాటికి అలవాటు పడేందుకు ఈ భారత్-ఏ మ్యాచ్‌లు మాకు ఉపయోగపడుతాయి. నా ఆట గురించి నేను ఒకసారి కేఎల్ రాహుల్ భాయ్‌తో మాట్లాడాను. ప్రతీ రోజు మన ఆటను మెరుగుపర్చుకోవడంపైనే ఫోకస్ పెట్టాలని ఆయన చెప్పారు. ఇంగ్లండ్ పర్యటనలో అవకాశం రానప్పుడు బాధపడ్డాను. నాలాంటి యువ ఆటగాళ్లకు విదేశీ పర్యటనలు మంచి అనుభవాన్ని ఇస్తాయి.'అని దేవదత్ పడిక్కల్ చెప్పుకొచ్చాడు.
సాయి సుదర్శన్ గాయంతో..
శ్రీలంక పర్యటనకు సాయి సుదర్శన్ గాయంతో దూరమవడంతో భారత టెస్ట్ టీమ్‌లో అవకాశం అందుకున్న పడిక్కల్ అద్వితీయమైన ప్రదర్శనతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. న్యూజిలాండ్ పర్యటనలోనూ భారత్-ఏ తరఫున సత్తా చాటుతూ.. తుది జట్టులో తన ప్లేస్‌ను మరింత పదిలం చేసుకుంటున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


