చరిత్ర సృష్టించిన ఢిల్లీ.. చిత్తుగా ఓడిన హైదరాబాద్!
మహిళల దేశవాళీ టీ20 క్రికెట్‌లో ఢిల్లీ టీమ్ సరికొత్త చరిత్రను లిఖించింది. మహిళల దేశవాళీ క్రికెట్‌లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది. సీనియర్ మహిళల టీ20 ట్రోఫీలో భాగంగా గురువారం పుణేలోని ఎంసీఏ మైదానం వేదికగా హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 262/6 భారీ స్కోర్ నమోదు చేసింది. ఈ క్రమంలో గోవా పేరిట ఉన్న 257/2 రికార్డ్‌ను అధిగమించింది. 2019-20 సీజన్‌లో అరుణాచల్ ప్రదేశ్‌పై గోవా ఈ ఫీట్ సాధించింది. గత 6 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ఈ రికార్డ్‌ను తాజాగా ఢిల్లీ బద్దలు కొట్టింది.
ఢిల్లీ ఓపెనర్ తనిషా సింగ్( 47 బంతుల్లో 25 ఫోర్లు, సిక్స్‌తో 119) సెంచరీతో చెలరేగింది. 38 బంతుల్లోనే సెంచరీ అందుకున్న తనిషా.. మహిళల టీ20 క్రికెట్ చరిత్రలోనే మూడో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన ప్లేయర్‌గా రికార్డ్ సాధించింది. ప్రియా పూనియా(28 బంతుల్లో 59)తో కలిసి 160 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. శ్వేత సెహ్రావత్(8 బంతుల్లో 3 సిక్స్‌లతో 26) రాణించింది. తనిషాను గొంగడి త్రిషా ఔట్ చేసినా.. దీక్ష శర్మ, నజమ్ ఖాన్, సోని యాదవ్ దూకుడుగా ఆడి ఢిల్లీకి రికార్డ్ స్కోర్ అందించారు.

హైదరాబాద్ బౌలర్లలో వెంక పూజ(4/32) నాలుగు వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు తేలిపోయారు. హైదరాబాద్ తరఫున గొంగడి త్రిష(52 బంతుల్లో 80) రాణించినా ఫలితం లేకపోయింది. ఇతర బ్యాటర్లు విఫలమవడంతో హైదరాబాద్ 20 ఓవరల్లో 8 వికెట్లకు 154 పరుగులే చేసి ఓటమిపాలైంది. దాంతో ఢిల్లీ 108 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. సుమిత్ సోని(3/28) మూడు వికెట్లతో హైదరాబాద్ పతనాన్ని శాసించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


