Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్ ప్రపంచకప్ గెలవాలంటే.. ఆ రోజు గంగూలీ చేసింది.. ఇప్పుడు శుభ్‌మన్ గిల్ చేయాలి!

వన్డే ప్రపంచకప్ 2027 టోర్నీకి ఎంపిక చేసే భారత జట్టులోకి టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీని తీసుకోవాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. సౌతాఫ్రికా వంటి కండిషన్స్‌లో అనుభవం కలిగిన షమీ జట్టులో ఉండటం ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు టీమ్‌మేనేజ్‌మెంట్ మాత్రం షమీని పట్టించుకోవడం లేదు. దాంతో అతను భారత జట్టులోకి పునరాగమనం చేస్తాడా? లేదా? అనేది తీవ్ర చర్చనీయాంశమైంది.

2027 ప్రపంచకప్ గెలవాలంటే ఇంతకంటే మంచి జట్టు మరొకటి ఉండదు భయ్యా!

2027 ప్రపంచకప్ గెలవాలంటే ఇంతకంటే మంచి జట్టు మరొకటి ఉండదు భయ్యా!

అయితే 2003 వన్డే ప్రపంచకప్‌ ముందు అప్పటి భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేసిన పనినే ప్రస్తుతం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చేస్తే.. షమీ భారత జట్టులోకి వస్తాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2003 వన్డే ప్రపంచకప్‌‌ కోసం భారత ఫాస్ట్ బౌలర్ జవగళ్ శ్రీనాథ్‌ను గంగూలీ పట్టుబట్టి మరీ తీసుకున్నాడు.

Cricket Experts Urges Shubman Gill Should Back Mohammed Shami Like Sourav Ganguly Backed Javagal Srinath in 2003 WC

వాస్తవానికి అతను ఆ ప్రపంచకప్ ముందే రిటైర్ అవ్వాలనుకున్నాడు. అతన్ని జట్టులోకి తీసుకునేందుకు అప్పటి సెలెక్టర్లు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ సౌరవ్ గంగూలీ..శ్రీనాథ్ అనుభవాన్నిగుర్తించి సెలెక్టర్లను ఒప్పించి జట్టులోకి తీసుకొచ్చారు. గంగూలీ తీసుకున్న ఆ సాహసోపేతమైన నిర్ణయం వృథా కాలేదు. ఆ టోర్నీలోభారత్ ఫైనల్స్‌కు చేరడంలో శ్రీనాథ్ కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం మహమ్మద్ షమీ కూడా అలాంటి సందిగ్ధంలోనే ఉన్నాడు.

2027 వన్డే ప్రపంచకప్‌ టోర్నీకి సౌతాఫ్రికా,జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అక్కడి ఫాస్ట్ బౌలింగ్‌ పిచ్‌లపై మహమ్మద్ షమీ బౌలింగ్ ప్రత్యర్థులకు సవాల్‌గా మారుతుంది. భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవి కాలం సెప్టెంబర్‌లో ముగియనుంది. కొత్త సెలెక్షన్ కమిటీ ముందు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన ప్రణాళికల్లో మహమ్మద్ షమీ పేరును ప్రతిపాదిస్తే అతని ఎంపిక సాధ్యమవుతుంది.

భారత ప్రపంచకప్ జట్టులోకి షమీ, భువీని తీసుకోవాలి: రవిశాస్త్రి

Also Read

భారత ప్రపంచకప్ జట్టులోకి షమీ, భువీని తీసుకోవాలి: రవిశాస్త్రి

శుభ్‌మన్ గిల్ గొప్ప కెప్టెన్ కావాలనుకుంటే.. గంగూలీలా షమీ కోసం సెలెక్టర్ల ముందు పట్టుబట్టాలి. ప్రపంచకప్ వంటి పెద్ద టోర్నీలను కేవలం కుర్రాళ్లతో గెలవం లేం. బుమ్రా, షమీ వంటి అనుభవజ్ఞులైన బౌలర్లు చాలా అవసరం. శుభ్‌మన్ గిల్ ఈ సాహోసేతమైన నిర్ణయం తీసుకుంటే.. 2027 ప్రపంచకప్ నాటికి షమీ భారత జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది.

Story first published: Friday, July 31, 2026, 19:28 [IST]
Other articles published on Jul 31, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+