Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

2027 ప్రపంచకప్ గెలవాలంటే ఇంతకంటే మంచి జట్టు మరొకటి ఉండదు భయ్యా!

టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్.. 2027 వన్డే ప్రపంచకప్ కోసం 11 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేశాడు. ఈ జట్టులో అనుభవం కలిగిన ఆటగాళ్లకే వసీం జాఫర్ పెద్ద పీట వేసాడు. టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు ఏడాదిన్నరగా భారత జట్టుకు దూరంగా ఉన్న సీనియర్ పేసర్‌‌‌కు అవకాశం కల్పించాడు.

వన్డే ప్రపంచకప్ ముందు రోహిత్, కోహ్లీ‌కి అది సవాలే: దీప్ దాస్‌గుప్తా

వన్డే ప్రపంచకప్ ముందు రోహిత్, కోహ్లీ‌కి అది సవాలే: దీప్ దాస్‌గుప్తా

2027 వన్డే ప్రపంచకప్‌ను కేవలం కుర్రాళ్లతోనే గెలవలేమని, అనుభవజ్ఞులైన ఆటగాళ్లు కూడా ముఖ్యమేనని వసీం జాఫర్ తన జట్టు ద్వారా స్పష్టం చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్ టోర్నీకి సౌతాఫ్రికాతో పాటు జింబాబ్వే, నమీబియా దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వసీం జాఫర్ తన జట్టును ఎంపిక చేశాడు.

Wasim Jaffer Picks Experienced India Playing XI For 2027 ODI World Cup Include Mohammed Shami

ఓపెనర్లుగా గిల్, రోహిత్..

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌ను ఓపెనర్లుగా తీసుకున్న వసీం జాఫర్.. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ, నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేశాడు. ఐదో స్థానంలో కేఎల్ రాహుల్‌ను తీసుకున్న జాఫర్.. అతనికే వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించాడు. పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను 6వ స్థానంలో తీసుకున్న జాఫర్.. అక్షర్ పటేల్‌ను స్పిన్ ఆల్‌రౌండర్‌గా తీసుకున్నాడు.

షమీకి చోటు..

స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ను ఎంచుకున్న వసీం జాఫర్.. పేస్ బాధ్యతలను జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు మహమ్మద్ షమీకి అప్పగించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత మహమ్మద్ షమీ భారత్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

గాయం నుంచి కోలుకొని పూర్తి ఫిట్‌నెస్ సాధించినా.. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతున్నా ఈ సీనియర్ పేసర్‌ను సెలెక్టర్లు పట్టించుకోవడం లేదు. వన్డే ప్రపంచకప్ 2023లో షమీ, బుమ్రా చూపిన ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని జాఫర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతుంది. మూడో పేసర్‌గా మహమ్మద్ సిరాజ్‌ను ఎంచుకున్న వసీం జాఫర్.. సీనియర్లకే అధిక ప్రాధాన్యత ఇచ్చాడు.

అందుకే సిరాజ్ గొప్ప క్రికెటర్ అయ్యాడు.. డీఎస్పీ సాబ్‌కు నా సెల్యూట్: ఎమ్మెస్కే ప్రసాద్

అందుకే సిరాజ్ గొప్ప క్రికెటర్ అయ్యాడు.. డీఎస్పీ సాబ్‌కు నా సెల్యూట్: ఎమ్మెస్కే ప్రసాద్

వసీం జాఫర్ ఎంపిక చేసిన టీమిండియా 2027 ప్రపంచకప్ జట్టు:

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్.

Story first published: Wednesday, July 29, 2026, 10:37 [IST]
Other articles published on Jul 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+