భారత్ ప్రపంచకప్ గెలవాలంటే.. జట్టులో ఆ ఇద్దరు ఉండాలి!
సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో విజయం సాధించినా.. భారత్ బలహీనతలు బయటపడ్డాయి. ఫ్లాట్ వికెట్స్‌పై భారత బ్యాటర్లు భారీ స్కోర్లు చేసినా.. బౌలర్లు తేలిపోయారు. ముఖ్యంగా ముల్లాన్ పూర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో 351 పరుగుల భారీ స్కోర్ చేసినా..భారత్ విజయం సాధించలేకపోయింది. చెత్త బౌలింగ్‌తో మూల్యం చెల్లించుకుంది.
ఈ ఓటమి భారత బౌలింగ్ బలహీనతలను బయటపెట్టింది. జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు సీనియర్ బౌలర్లు లేకపోవడంతోనే టీమిండియా బౌలింగ్ బలహీనంగా కనిపిస్తోంది. మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్‌లకు వన్డేల్లో అద్భుతమైన రికార్డులు ఉన్నా.. వయసు దృష్ట్యా బీసీసీఐ వారిని చాలాకాలంగా పక్కనబెట్టింది.

వచ్చే ఏడాది సౌతాఫ్రికా వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ 2027 ప్రణాళికల్లో షమీ, భువనేశ్వర్ కుమార్ ఇద్దరూ లేరు. అయితే ప్రస్తుత బౌలర్ల ఫామ్ చూస్తే ప్రపంచకప్ గెలవడం కష్టమని క్రికెట్ విశ్లేషకులు, ఫ్యాన్స్ అంటున్నారు. బుమ్రాకు షమీ, భువీ తోడైతే బౌలింగ్ మరింత బలంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా సౌతాఫ్రికా పిచ్ కండీషన్స్.. షమీ, భువనేశ్వర్ కుమార్‌కు సరిగ్గా సరిపోతాయని చెబుతున్నారు.
విండీస్ చితక్కొట్టింది..
టీమిండియా వెటరన్ బ్యాటర్ హనుమ విహారి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 'భారత్ కేవలం జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలతోనే ప్రపంచకప్ గెలుస్తామంటే కుదరదు. ఒకవేళ వారికి గాయలైతే పరిస్థితి ఏంటి? బ్యాకప్ బౌలర్లను సిద్దం చేసుకోవాలి. మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్‌లను తిరిగి టీమ్‌లోకి తీసుకోవాలి. అనుభవం కలిగిన ఆటగాళ్లు ఉంటే జట్టుకు ఒక భరోసా ఉంటుంది. క్లిష్ట పరిస్థితుల్లో జట్టుకు కావాల్సిన వికెట్లు తీయగలరు.
అనుభవానికి ఎప్పుడూ విలువ ఉంటుంది. 350 పరుగుల భారీ స్కోర్ చేసినా కాపాడకోలేకపోయాం. ఇది కళ్లు తెరిపించే హెచ్చరిక కాదా? కనీసం ప్రపంచకప్‌కు అర్హత సాధించని వెస్టిండీస్ జట్టే మ బలహీనతలను బయటపెట్టింది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ వంటి బలమైన జట్లతో ఆడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి.'అని హనుమ విహారి హెచ్చరించారు.
ప్రపంచకప్ కాదు.. సెమీస్ చేరితే గొప్ప..
భారత బౌలింగ్ తీరు గురించి అభిమానులను మా మైఖేల్ ప్రతినిధి ప్రశ్నించినప్పుడు.. వారు కూడా ఇదే ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్‌లను జట్టులోకి తీసుకోవాలని సూచించారు. యువ పేసర్లను నమ్ముకొని మెగా టోర్నీ గెలవడం కష్టమని అభిప్రాయపడ్డాడు. సౌతాఫ్రికా కండిషన్స్ పేస్‌కు అనుకూలంగా ఉంటాయని, అందుకు తగ్గట్లు బౌలర్లను సిద్దం చేయాలని కోరారు.
'జస్‌ప్రీత్ బుమ్రా ఒక్కడితోనే భారత్ ప్రపంచకప్ గెలవలేదు. మరో ఎండ్‌లో అతనికి సహకరించే బౌలర్లను సిద్దం చేయాలి. సిరాజ్ ఫామ్ కోల్పోయాడు. కాబట్టి అనుభవం కలిగిన భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీలను జట్టులోకి తీసుకోవాలి. అర్ష్‌దీప్ సింగ్‌ను కూడా నమ్మలేని పరిస్థితి. కాబట్టి షమీ, భువనేశ్వర్ కుమార్‌లకు వరుసగా అవకాశాలు ఇచ్చి ప్రపంచకప్‌కు సిద్దం చేయాలి.'- మచ్చెందర్, క్రికెట్ అభిమాని
'భారత్ ప్రపంచకప్ గెలవాలంటే బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేయాలి. ప్రస్తుత బౌలింగ్ విభాగంతో భారత్ ప్రపంచకప్ కాదు కదా.. కనీసం సెమీస్ కూడా చేరలేదు. 'బ్యాటర్లు మ్యాచ్‌లు గెలిపిస్తే.. బౌలర్లు టోర్నీలను గెలిపిస్తారు'అనే నానుడీని టీమ్ మేనేజ్‌మెంట్ దృష్టిలో పెట్టుకోవాలి. బుమ్రాకు తోడుగా మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్‌లను మెగా టోర్నీకి సిద్దం చేయాలి.'- సంధ్య రాణి, క్రికెట్ అభిమాని.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications



